
స్టాన్‌ఫోర్డ్ నుంచి గ్రాడ్యుయేషన్ డే పట్టా అందుకున్న ఇషా
బిలీనియర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ స్టాన్‌ఫోర్డ్ నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందారు. యూనివర్సిటీ 127వ ప్రారంభోత్సవ వేడుకల్లో తన గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నారు. స్టాన్‌ఫోర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఇషా అంబానీ, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ) పూర్తి చేశారు. తన గ్రాడ్యుయేషన్ డే వేడుకను కుటుంబ సభ్యులతో కలిసి పంచుకున్నారు. ఈ వేడుకలో తన కాబోయే భర్త ఆనంద్ పిరామల్, వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.
మొత్తం 2460 మంది విద్యార్థులు ఈ వేడుకలో పట్టాలు అందుకున్నారు. ఇషా అంతకముందు సైకాలజీలో డిగ్రీ పట్టా పుచ్చుకుని, యేల్ విశ్వవిద్యాలయంలో సౌత్ ఏషియన్ స్టడీస్ పూర్తిచేశారు. ఇషా తల్లికి తగ్గ తనయ మాదిరి, ఎంబీఏ చదువుకుంటూనే స్టాన్‌ఫోర్డ్ నర్సరీలో టీచర్ ఉద్యోగం కూడా చేసింది.
ఇషా అంబానీ గ్రాడ్యుయేషన్ డే ఫోటోలు మీకోసం...
Comments
Please login to add a commentAdd a comment