లండన్: పాకిస్తాన్‌కు చెందిన నోబెల్ బహుమతి గ్రహిత మలాలా యూసఫ్ జాయ్ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. పాకిస్తాన్‌లో బాలికల విద్య కోసం తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన విషయం తెలిసిందే. 24 ఏళ్ల మలాలా 9ఏళ్ల తర్వాత తన డిగ్రీ చదువును పూర్తి చేసుకున్నారు. శుక్రవారం జరిగిన గ్రాడ్యుయేషన్ వేడకకు సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేశారు. గ్రాడ్యుయేషన్‌కు సంబంధించిన దుస్తుల్లో మలాలా.. తన తల్లిదండ్రులు, భర్తతో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ గ్రాడ్యుయేషన్ వేడక మే,2020లో జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణం వాయిదా పడింది. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలను ఇప్పటికే 6లక్షల మంది వీక్షించారు. సోషల్ మీడియాలో మలాలాకు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. అయితే అఫ్గనిస్తాన్‌లో బాలికల సెకండరీ స్కూల్ చదువు విషయంలో బాలిబన్ ప్రభుత్వం ఇంకా అనుమతించలేదు.
15ఏళ్ల వయసులో పాకిస్థాన్‌లో బాలికలను చదివించాలని ప్రచారం చేసిన ఆమెపై తాలిబాన్ ముష్కరులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం ఆమెను బ్రిటన్‌కు తరలించి.. మెరుగైన చికిత్స అందించారు. మలాలా 2014లో కేవలం 17 ఏళ్ల వయసులోనే నోబెల్ శాంతి బహుమతి అందుకొని.. అతి పిన్న వయసులో నోబెల్ అందుకున్న వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.
Comments
Please login to add a commentAdd a comment