Malala Yousafzai
-
‘నేను మలాలా కాదు.. భారతదేశంలో సురక్షితంగా ఉన్నా’
లండన్: ప్రపంచవేదికపై భారతదేశ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ ప్రచారాన్ని కశ్మీర్ సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ యానా మీర్ తీవ్రంగా ఖండించారు. బ్రిటన్ పార్లమెంట్లో ఏర్పాటు చేసిన ‘సంకల్ప్ దివాస్’ కార్యక్రమంలో యానా మీర్ ప్రసంగించారు. భారత్‌లో అంతర్భాగం అయిన కశ్మీర్లో తనకు భద్రత, స్వేచ్ఛ ఉందని తెలిపారు. ఈ విషయంలో పాకిస్తాన్ భారత్‌పై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆమె తిప్పికొట్టారు. ‘నేను మలాలా యూసఫ్‌జాయ్‌ని కాదు. ఎందుకంటే నేను నా దేశంలో స్వేచ్ఛగా, సురక్షితంగా ఉన్నా. భారతదేశంలో అంతర్భాంగా ఉన్న నా మాతృభూమి కశ్మీర్లో ఉన్నా. నేను ఎప్పుడూ అక్కడి నా దేశం నుంచి శరణార్థిలా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నేను మలాలా యూసఫ్‌జాయ్‌ని అస్సలు కాను. నా దేశాన్ని, నా మాతృభూమి (కశ్మీర్)ను అణచివేయబడిన ప్రాంతమని వ్యాఖ్యానించిన మాటలను తీవ్రంగా తప్పుపడుతున్నా. సోషల్ మీడియా, ప్రపంచ మీడియాలో ఉన్న టూల్‌కిట్ సభ్యులు నా దేశంలోని కశ్మీర్‌ను సందర్శించకుండా అణచివేత పేరుతో వండివార్చిన తప్పుడు కథనాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా’ అని అన్నారు. I am not a Malala I am free and safe in my homeland #Kashmir, which is part of India I will never need to runaway from my homeland and seek refuge in your country: Yana Mir @MirYanaSY in UK Parliament. #SankalpDiwas pic.twitter.com/3C5k2uAzBZ — Sajid Yousuf Shah (@TheSkandar) February 22, 2024 ‘భారతీయులను మతం ప్రాతిపాదికన చూడటం ఆపేయండి. ఆ ప్రాతిపాదికతో మా దేశాన్ని ముక్కలు చేయటాన్ని మేము అనుమతించం. ఈ ఏడాది ‘సంకల్ప్ దివాస్’ యూకే, పాకిస్తాన్లో ఉన్న భారత వ్యతిరేకులు.. ప్రపంచ మీడియా, ప్రపంచ మానవ హక్కుల వేదికలపై భారత్‌పై దుష్ప్రచారాన్ని ఆపేయాలని ఆశిస్తున్నా. ఉగ్రవాదం మూలంగా వేలాది కశ్మీరీ తల్లులు తమ పిల్లలను పొగొట్టుకున్నారు. నా కశ్మీరీ సమాజం ఇక నుంచి ప్రశాంతగా జీవించాలనుకుంటుంది. కృతజ్ఞతలు.. జైహింద్.. ’ అని యానా మీర్ తెలిపారు. ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్‌లోని ప్రజల మధ్య విభేదాలు సృష్టించే విధంగా వార్తలను ప్రచురించవద్దని ఆమె అంతర్జాతీయ మీడియాకు విజ్ఞప్తి చేశారు. జమ్మూ కశ్మీర్లో వైవిధ్యాన్ని పెంపొందించడంలో ఆమె చేసిన కృషికి ‘డైవర్సిటీ అంబాసిడర్ అవార్డు’తో ఆమెను సత్కరించారు. ప్రతికూల మీడియా కథనాలను ప్రతిఘటిస్తూ డి రాడికలైజేషన్, యువత అభివృద్ధిలో భారత సైన్యం తీసుకుంటున్న చొరవలను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించారు. ఆమె మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్‌గా మారింది. -
మలాలా యూసఫ్‌జాయ్ రూ.2.5 కోట్ల విరాళం
లండన్: గాజా ఆసుపత్రిలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో ఏకంగా 500 మందికిపైగా జనం మృతిచెందడం పట్ల ప్రపంచవ్యాప్తంగా సానుభూతి వెల్లువెత్తుతోంది. ఈ మారణకాండను ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో చిన్నారులు బలి కావడం పట్ల పాకిస్తాన్ సాహస బాలిక, నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలా యూసఫ్‌జాయ్ చలించిపోయారు. ఈ మేరకు బుధవారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. గాజాలోని అల్–అహ్లీ ఆసుపత్రిలో బాంబు పేలుడు ఘటనను మీడియాలో చూసి భయాందోళనకు గురయ్యానని చెప్పారు. ఈ ఘాతుకాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. వెంటనే కాల్పుల విరమణ పాటించాలని, గాజాకు నిత్యావసరాలు, ఆహారం, నీరు సరఫరా చేయాలని ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని మలాలా కోరారు. ఈ విపత్కర సమయంలో గాజాలో పాలస్తీనియన్ల సంక్షేమం కోసం కృషి మూడు స్వచ్ఛంద సంస్థలకు 3 లక్షల డాలర్ల (రూ.2.5 కోట్లు) విరాళం ఇవ్వబోతున్నానని మలాలా ప్రకటించారు. ఇజ్రాయెల్, పాలస్తీనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం పోరాడుతున్నవారితో తాను కూడా గొంతు కలుపుతున్నానని వ్యాఖ్యానించారు. గాజా జనాభాలో సగం మంది 18 ఏళ్లలోపు వారేనని అన్నారు. -
ఆస్కార్ వేడుకల్లో మలాలా.. ఎందుకో తెలుసా?
అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుల వేడుక జరిగింది. అత్యంత భారీ ఖర్చుతో ఈ వేడుకను ఆస్కార్ అకాడమీ నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఈవెంట్లో అందరినీ దృష్టిని ఆకర్షించించింది మాత్రం పాకిస్తాన్‌కు చెందిన మలాలా యూజఫ్జాయ్. తన భర్త అస్సర్ మాలిక్‌తో కలిసి వేదికపై మెరిసింది. ఇంతకీ ఈ వేడుకకు ఆమె ఎందుకొచ్చింది? అనే ప్రశ్న సినీ ప్రేక్షకుల్లో తలెత్తింది. మలాలాకు ఇప్పటికే నోబెల్ బహుమతి వచ్చిన సంగతి తెలిసిందే. మహిళల విద్యకోసం కృషి చేస్తున్న మలాలా విశ్వవేదికపై కనిపించడం చర్చనీయాంశంగా మారింది. మహిళా విద్యా కార్యకర్త అయిన ఆమె ఆస్కార్స్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీకి ఎంపికైన 'స్ట్రేంజర్ ఎట్ ది గేట్' అనే షార్ట్ ఫిల్మ్‌కు ఆమె ఎగ్జిక్యూటివ్ నిర్మాత కావడమే కారణం. అందుకే వారికి మద్దతుగా ఆస్కార్ వేడుకలకు హాజరైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది టాలీవుడ్ మూవీకి ఆస్కార్ రావడంతో సినీ ప్రేక్షకులు సంబురాలు చేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ దక్కింది. -
కర్ణాటక హిజాబ్ వ్యవహారంపై స్పందించిన మలాలా
కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం.. మరికొన్ని రాష్ట్రాలకు విస్తరించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలనైన మధ్యప్రదేశ్, పుదుచ్చేరిలోనూ ‘హిజాబ్’పైనా చర్చ మొదలైంది. మతసామరస్యం పాటించాలని చెబుతూనే శాంతి భద్రతలను పరిరక్షించుకోవాలని, ఒకే తరహా యూనిఫామ్‌లకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిదని ఓవైపు కర్ణాటక హైకోర్టు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ వ్యవహారం మరింత ముదురుతుందే తప్పా.. చల్లారడం లేదు. ఈ క్రమంలో హిజాబ్ వివాదం ఇప్పుడు గ్లోబల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. దీంతో ఉద్యమకారిణి, నోబెల్ గ్రహీత మలాలా స్పందించారు. బాలికలను హిజాబ్‌లో పాఠశాలకు వెళ్లనివ్వాలని మలాలా భారతీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తోంది. యూసఫ్‌జాయ్ ట్వీట్లో.. ‘చదువు, హిజాబ్‌లో ఏది ఎంచుకోవాలో కళాశాల మమ్మల్ని బలవంతం చేస్తోంది’ అంటూ విద్యార్థిణిలు ఆవేదనను ట్వీట్ చేసిన ఆమె.. ఆపై భారతీయ నేతలకు విజ్ఞప్తి చేశారు. ‘బాలికలు తమ హిజాబ్‌లో పాఠశాలకు వెళ్లడానికి నిరాకరించడం భయానకంగా ఉందని వ్యాఖ్యానించారామె. ఆడపిల్లలను హిజాబ్‌లు ధరించి పాఠశాలకు వెళ్లనివ్వకపోవడం దారుణం. భారత నాయకులు ముస్లిం మహిళలను చిన్నచూపు చూడటం ఆపాలి’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. “College is forcing us to choose between studies and the hijab”. Refusing to let girls go to school in their hijabs is horrifying. Objectification of women persists — for wearing less or more. Indian leaders must stop the marginalisation of Muslim women. https://t.co/UGfuLWAR8I — Malala (@Malala) February 8, 2022 ఇదిలా ఉంటే హిజాబ్ ధరించిన ఆడపిల్లలను క్లాస్ రూంల్లోకి రైట్ వింగ్ గ్రూపులు అనుమతించకపోవడంతో మొదలైన వివాదం.. పోటాపోటీగా కాషాయపు కండువాలతో ర్యాలీలు చేపట్టడంతో మరింత ముదిరింది. ఈ తరుణంలో కర్ణాటక ప్రభుత్వం, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సైతం సామరస్యం పాటిస్తూ.. శాంతి భద్రతలు పాటించాలని పిలుపు ఇస్తున్నాయి. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ హిజాబ్ అభ్యంతరం గళం వినిపిస్తోంది. మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మర్.. హిజాబ్ యూనిఫామ్‌లో భాగం కాదని, క్రమశిక్షణ ముఖ్యమంటూ వ్యాఖ్యలు చేశారు. సంబంధిత వార్త: హిజాబ్ వ్యవహారం.. మూడు రోజులు అక్కడ విద్యాసంస్థలు బంద్ -
డిగ్రీ పూర్తి చేసిన నోబెల్ గ్రహిత.. ఫోటోలు వైరల్
లండన్: పాకిస్తాన్‌కు చెందిన నోబెల్ బహుమతి గ్రహిత మలాలా యూసఫ్ జాయ్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. పాకిస్తాన్లో బాలికల విద్య కోసం తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన విషయం తెలిసిందే. 24 ఏళ్ల మలాలా 9ఏళ్ల తర్వాత తన డిగ్రీ చదువును పూర్తి చేసుకున్నారు. శుక్రవారం జరిగిన గ్రాడ్యుయేషన్ వేడకకు సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేశారు. గ్రాడ్యుయేషన్‌కు సంబంధించిన దుస్తుల్లో మలాలా.. తన తల్లిదండ్రులు, భర్తతో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ గ్రాడ్యుయేషన్ వేడక మే,2020లో జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణం వాయిదా పడింది. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలను ఇప్పటికే 6లక్షల మంది వీక్షించారు. సోషల్ మీడియాలో మలాలాకు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. అయితే అఫ్గనిస్తాన్‌లో బాలికల సెకండరీ స్కూల్ చదువు విషయంలో బాలిబన్ ప్రభుత్వం ఇంకా అనుమతించలేదు. 15ఏళ్ల వయసులో పాకిస్థాన్‌లో బాలికలను చదివించాలని ప్రచారం చేసిన ఆమెపై తాలిబాన్ ముష్కరులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం ఆమెను బ్రిటన్‌కు తరలించి.. మెరుగైన చికిత్స అందించారు. మలాలా 2014లో కేవలం 17 ఏళ్ల వయసులోనే నోబెల్ శాంతి బహుమతి అందుకొని.. అతి పిన్న వయసులో నోబెల్ అందుకున్న వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. View this post on Instagram A post shared by Malala (@malala) -
Malala Yousafzai: మలాలా భర్త అస్సర్ ఎవరో తెలుసా
బ్రిటన్: నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ బుధవారం వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ నగరంలోని తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య అస్సర్ మాలిక్‌తో నిఖా వేడుక జరిగినట్లు పేర్కొన్నారు. ఇద్దరం కలిసి భార్యభర్తలుగా కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నామని, ఇందుకు అందరి ఆశీస్సులు కావాలని మలాలా ఒక ట్వీట్లో తెలిపారు. అయితే మలాలా పెళ్లి తర్వాత ఆమె భర్త అస్సర్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆయనఎవరనే విషయం ఎక్కువగా నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. చదవండి: Malala Yousafzai Married: పెళ్లి చేసుకున్న మలాల.. ఫోటోలు వైరల్ అస్సర్ మాలిక్ ఎవరంటే.. పాకిస్తాన్‌కు చెందిన అస్సర్ మాలిక్ ఒక ఎంట్రప్రెన్యూర్. అస్సర్ మాలిక్ లాహోర్‌లోని టుచిన్సన్ కాలేజీ నుంచి విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. అనంతరం లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. ఇక అస్సర్కు క్రీడా విభాగంతో మంచి అనుబంధం ఉంది. 2020లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో చేరిన అస్సర్.. ప్రస్తుతం పీసీబీ హై పర్ఫార్మెన్స్ జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో పాటు పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) ఫ్రాంచైజీ ముల్తాన్ సుల్తాన్స్‌కు ప్లేయర్ డెవలప్మెంట్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. Today marks a precious day in my life. Asser and I tied the knot to be partners for life. We celebrated a small nikkah ceremony at home in Birmingham with our families. Please send us your prayers. We are excited to walk together for the journey ahead. 📸: @malinfezehai pic.twitter.com/SNRgm3ufWP — Malala (@Malala) November 9, 2021 -
Malala Yousafzai Marriage Video: పెళ్లి చేసుకున్న మలాల.. వీడియో వైరల్
-
పెళ్లి చేసుకున్న మలాల.. ఫోటోలు వైరల్
బ్రిటన్: బాలికల విద్య కోసం కృషి చేసిన ప్రచారకర్త, బాలికల విద్య కోసం ప్రచారకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో తెలిపింది. తన వివాహాన్ని బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ నగరంలో తమ ఇరు కుటుంబాల సమక్షంలో జరుపుకున్నట్లు వెల్లడించింది. (చదవండి: అద్భుత చిత్రం సౌర మంట! అత్యంత అరుదుగా కనిపించే దృశ్యం) అంతేకాదు తన భర్తని పేరు అస్సర్ అని చెప్పింది. ఈ మేరకు తన వివాహానికి సంబంధించిన ఫోటోలను మేము జీవిత భాగస్వాములమవ్వడానికి ముడివేశాం అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే మలాల పెళ్లి చేసుకున్న వ్యక్తి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి చెందిన హైపెర్ఫార్మెన్స్ సెంటర్ జనరల్ మేనేజర్ అస్సర్ మాలిక్‌గా గుర్తించారు. గానీ దీని పై ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు. ఈ క్రమంలో మలాల గతంలో బ్రిటన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో "ప్రజలు ఎందుకు వివాహం చేసుకోవాలో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మీరు మీ జీవితంలో ఒక వ్యక్తిని కలిగి ఉండాలనుకుంటే, మీరు వివాహ పత్రాలపై ఎందుకు సంతకం చేయాలి" అంటూ మాట్లాడటం గమనార్హం. (చదవండి: అపార్ట్మెంట్లో మంటలు ...కానీ అగ్నిమాపక సిబ్బంది వచ్చేటప్పటికి!!) Today marks a precious day in my life. Asser and I tied the knot to be partners for life. We celebrated a small nikkah ceremony at home in Birmingham with our families. Please send us your prayers. We are excited to walk together for the journey ahead. 📸: @malinfezehai pic.twitter.com/SNRgm3ufWP — Malala (@Malala) November 9, 2021 -
మలాలాపై విషం చిమ్ముతున్న పాకిస్తాన్ ప్రైవేట్ స్కూల్స్ అసోషియేషన్
ఇస్లామాబాద్: నోబెల్ అవార్డు గ్రహీత మలాలా యూసఫ్ జాయ్పై పాకిస్తాన్‌లోని ప్రైవేట్ స్కూల్స్ అసోషియేషన్ విద్యార్థులకు విషం నూరిపోస్తోంది. ఇందుకోసం ఆ సంఘం ఒక ప్రత్యేక డాక్యుమెంటరీని విడుదల చేసింది. పాకిస్తాన్ ప్రైవేట్ పాఠశాలల సంఘం సోమవారం విద్యా కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్‌ను లక్ష్యంగా చేసుకుని యువతలో ఆమె పట్ల వ్యతిరేకత కలగడానికి ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది. మతం, పెళ్లి, పశ్చిమ దేశాల అజెండా అమలు విషయంలో ఆమె తీరును దీనిలో ప్రస్తావించారు. కాగా, మలాలా సోమవారం 24వ పుట్టిన రోజు జరుపుకొన్నారు. ఇక సోమవారం పాకిస్థాన్‌లోని గుల్‌బెర్గ్‌లోని కార్యాలయంలో ఆల్ పాకిస్తాన్ ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. దీని అధ్యక్షుడు కసీఫ్ మిర్జా మాట్లాడుతూ ‘‘ ఐ యామ్ నాట్ మలాలా డాక్యుమెంటరీ చిత్రంలో.. ఆమెకు మతం, పెళ్లిపై ఉన్న వివాదాస్పద అభిప్రాయాలు, పశ్చిమ దేశాల అజెండా అమలు వంటి అంశాలను వెల్లడించారు. యువతలో ఆమె అసలు రూపాన్ని బహిర్గతం చేయడమే మా లక్ష్యం. మహిళల హక్కుల కోసం పోరాడుతుందనుకొని యువత ఆమె పట్ల ఆకర్షితులు కాకుండా చేయడమే మా ఉద్దేశం. మా దేశంలోని 2,00,000 ప్రైవేట్ పాఠశాలల్లోని 20 మిలియన్ల విద్యార్థులకు దీనిని చూపిస్తాం’’ అని పేర్కొన్నారు. మలాలా పెళ్లిని వ్యతిరేకిస్తోంది మలాలా పెళ్లిని వ్యతిరేకిస్తూ సహజీవనాన్ని సమర్థిస్తోందని కసీఫ్ మిర్జా ఆరోపించారు. దేశంలోని వివాహ వ్యవస్థపై ఆమె దాడి చేస్తోందని పేర్కొన్నారు. మలాలా రాసిన ‘ఐ యామ్ మలాలా’ పుస్తకంలోని పలు అంశాలను ఆయన తప్పుపట్టారు. పాక్ పాఠశాలల్లో మతపరమైన విద్యను బోధించడం, అలీ జిన్నా గురించి చెప్పడంపై ఆమె వ్యతిరేకత వ్యక్తం చేశారన్నారు. ఈ పుస్తకాన్ని పశ్చిమ దేశాల అజెండా అమలు కోసం రాసినట్లు ఉందన్నారు. ఇక "మలాలా తండ్రి జియావుద్దీన్ ఒక టీవీ కార్యక్రమంలో తన బ్లాగును బీబీసీ కరస్పాండెంట్ అబ్దుల్ హై కాకర్ రాశారని, 'ఐ యామ్ మలాలా' పుస్తకం క్రిస్టినా లాంబ్ రాసినట్లు ఒప్పుకున్నారు." అని ఆయన అన్నారు. -
‘మలాల.. ఈ సారి తప్పించుకోలేవ్’
బాలల హక్కుల కోసం పోరాడుతున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాల యూసఫ్ జాయ్‌కు మరోసారి బెదిరింపు సందేశాలు వచ్చాయి. ఈ సారి తమ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేవంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తొమ్మిదేళ్ల క్రితం మలాల మీద కాల్పులు జరిపిన పాకిస్తాన్ తాలిబన్ సంస్థ, మరోసారి ఈ మేరకు బెదిరింపులు జారీ చేసింది. అయితే, ఇందుకు సంబంధించిన ట్వీట్‌పై బుధవారం నిషేధం విధించారు. కాగా 15 ఏళ్ల వయసులోనే బాలికల విద్య కోసం పోరాడిన మలాల మీద 2012లో పాకిస్తాన్లో తాలిబాన్ మిలిటెంట్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో మూడు బుల్లెట్లు ఆమె శరీరంలోకి వెళ్లగా తీవ్రంగా గాయపడింది. ఇప్పుడు ఆమె వయసు 23 ఏళ్లు. పాకిస్తాన్ తాలిబాన్ సభ్యుడు ఎహ్సాన్.. ‘నీతో, మీ నాన్నతో సెటిల్ చేసుకునే విషయాలు చాలా ఉన్నాయి. ఇందుకు నువ్వు వెంటనే ఇంటికి తిరిగి రావాలని కోరుతున్నా. ఈసారి ఏ విధంగానూ తప్పించుకోలేవు. చంపేస్తాం’ అని ఓ సందేశం పోస్ట్ చేశాడు. దీనిపై మలాల స్పందిస్తూ.. ‘‘ఇతను నాతోపాటు చాలా మంది అమాయక ప్రజలపై దాడి చేసిన తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ మాజీ ప్రతినిధి. అతను ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రజలను బెదిరిస్తున్నాడు. అతను ఎలా తప్పించుకున్నాడు’’ అని ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను, అదే విధంగా సైన్యాన్ని ప్రశ్నించింది. కాగా ఎహ్సాన్‌ను 2017లో అరెస్టు చేశారు. అయితే 2020 జనవరిలో అతన్ని పట్టుకున్న పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నుంచి తప్పించుకున్నాడు. అంతేగాక అతని అరెస్టు, తప్పిదం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. ఎహ్సాన్ తప్పించుకున్న అనంతరం ఇదే ట్విటర్ అకౌంట్ ద్వారా పాకిస్తాన్ జర్నలిస్టులకు ఇంటర్వ్యూ ఇస్తూ టచ్‌లో ఉన్నాడు. అయితే ఈ అకౌంట్లపై ప్రస్తుతం నిషేధం విధించారు. ఇక మలాలకు వచ్చిన హెచ్చరికలపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని ప్రధాని సలహాదారు రౌఫ్ హసన్ తెలిపారు. కాగా అనేక సంవత్సరాలు సైనిక కస్టడీలో ఉన్న ఎహ్సాన్ వారి నుంచి ఎలా తప్పించుకున్నాడో, అక్కడి నుంచి టర్కీకి ఎలా వెళ్లాడో కూడా అధికారులు వెల్లడించలేదు. చదవండి: పెళ్ళికూతురు డాన్స్..అంతలోనే విషాదం.. ఏడాది తర్వాత కనిపించిన కిమ్ జోంగ్ ఉన్ భార్య -
పదును అంచులు
నిర్భీతికి ముందుమాట మలాల. నిన్నటికి విషయసూచిక.. మోనిక. నిజాలలో తుది పలుకు మాంటీ. లిటరరీ వారియర్స్ ఈ ముగ్గురూ. మలాల ‘ఫియర్లెస్’ క్లబ్.. మోనిక ‘బ్లూమ్స్బరీ’ పోరాటం.. మాంటీ ‘ప్రెసిడెంట్ హంట్’... పదునైన ఖడ్గపు అంచులిప్పుడు! హై లెవల్లో జరిగే పనులకు చప్పుడు ఉండదు. ఆగస్టు 22 శనివారం ‘ఢిల్లీ రాయిట్స్ 2020 : ది అన్‌టోల్డ్ స్టోరీ’ పుస్తకం ఆవిష్కరణ జరగడానికి ముందు రోజు.. ‘ఆ పుస్తకం మీద మన పేరు ఉండటానికి లేదు’ అని ఢిల్లీలోని బ్లూమ్స్బరీ ప్రచురణ సంస్థకు తన ప్రధాన కార్యాలయం ఉన్న లండన్ నుంచి అత్యవసర ఆదేశాలు వచ్చాయి! అప్పటికే బ్లూమ్స్బరీ పేరుతో ఆ పుస్తకానివి వంద కాపీలు ప్రింట్ అయి.. ప్రముఖ మీడియా హౌస్‌లకు, దేశవిదేశాల్లోని ప్రసిద్ధ రచయితలు, గ్రంథకర్తలకు, సోషల్ మీడియాలోని శక్తిమంతమైన ప్రచారకర్తలకు చేరిపోయాయి. పుస్తక రచయిత్రితో కుదిరిన ఒప్పందం ప్రకారం వచ్చే సెప్టెంబరులో బ్లూమ్స్బరీ ఆ పుస్తకాన్ని మార్కెట్లోకి తేవలసి ఉంది. అకస్మాత్తుగా మొత్తానికే ప్రచురణను ఆపేసింది! విడుదల కాకుండానే వివాదం అయిన ఈ ‘ఢిల్లీ రాయిట్స్ 2020 : ది అన్‌టోల్డ్ స్టోరీ’ పుస్తక ప్రధాన రచయిత్రి మోనికా అరోరా. ప్రచురణను ఎందుకు ఆపేశారన్న దానికి బ్లూమ్స్బరీ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో ఢిల్లీలోని ఆ ప్రచురణ సంస్థ న్యాయపరమైన వివాదంలోకి వెళ్లే అవకాశం ఉంది. మోనికా రచయిత్రి మాత్రమే కాదు. పేరున్న సుప్రీంకోర్టు లాయర్, సామాజిక కార్యకర్త కూడా. మోనిక ఈ ఆగస్టు 28న తన 47 లోకి ప్రవేశిస్తున్నారు. ఈ వయసుకే ఆమె మహిళా న్యాయవాదుల సంఘానికి నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిర్భయ ఘటనను సుమోటోగా స్వీకరించాలని సుప్రీంకోర్టును, హైకోర్టును కోరిన తొలి న్యాయవాది మోనికానే. ఢిల్లీ యూనివర్సిటీలో ‘లా’ పీజీ చేశారామె. 1993–94 మధ్య ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా ఉన్నారు. ‘ఢిల్లీ రాయిట్స్..’ పుస్తకావిష్కరణకు బీజేపీ నాయకులను ఆహ్వానించడమే బ్లూమ్స్బరీ తీసుకున్న ఉపసంహరణ నిర్ణయానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇప్పుడీ పుస్తకాన్ని ‘గరుడ ప్రకాశన్’ ముద్రించబోతోంది. అధినేతలు కన్ను మూసినప్పుడు వెనువెంటనే చప్పుడవదు. కరోనా ప్రారంభ సమయంలో ఉత్తర కొరియా సుప్రీమ్ లీడర్ కిమ్ జోన్ ఉన్ కొన్నాళ్లు కనిపించకుండా పోయారు. మే నెలలో ఒకసారి అలా కనిపించి ఇలా మాయం అయ్యారు. ఇక నాలుగు రోజుల క్రితమైతే.. కొన్ని ప్రధానమైన పాలనాధికారాలను కిమ్ తన సోదరికి బదిలీ చేశారన్న వార్తలు వచ్చాయి. అయితే కిమ్‌కి ఏదో అయి ఉంటుందన్నదే అందులోని ఊహాజనితమైన ప్రధాన వార్త. ఆయన బతికి లేరని, మే నెలలో ఒక కర్మాగారానికి రిబ్బన్ కట్ చేస్తూ కనిపించింది కిమ్ డూప్ అని అప్పట్లోనే ప్రచారం అయింది. ఇప్పుడిక ఆయన కోమాలో ఉన్నారని మరో వదంతి! కొరియా కొట్టిన పిండి అయిన రాయ్ క్యాలీ అనే బీబీసి జర్నలిస్టయితే ‘కిమ్ లేరనే నా నమ్మకం’ అంటున్నారు! ఏది నిజం? ఏది అబద్ధం? ఈ సందిగ్ధావస్థలో అందరి ఆలోచనలు రూత్ యాన్ మాంటీ వైపు మళ్లాయి. పరిశోధనాత్మక గ్రంథాల రచయిత్రి ఆమె. దేశాలన్నీ తిరుగుతుంటారు. దేశాధినేతల రహస్యాలను పుస్తక రూపంలోకి తెస్తుంటారు. ఆరిజోనాలోని స్కాట్డేల్లో ఉంటారు. ‘డోనాల్ట్ ట్రంప్ ఇన్ 100 ఫ్యాక్ట్స్’ అని 2018లో ఒక పుస్తకం రాశారు. గత ఏడాది జనవరిలో ‘నార్త్ కొరియా ఇన్ 100 ఫ్యాక్ట్’ అని మరో పుస్తకం తెచ్చారు. ఈ రెండు పుస్తకాలూ ప్రకంపనలు సృష్టించాయి. జర్నలిస్టు రాయ్ క్యాలీ లానే రచయిత్రి రూత్ కూడా కొరియాలో చీమ చిటుక్కుమన్నా పట్టేస్తారు. ‘చివరిసారిగా నేను కిమ్‌ని లేవలేని స్థితిలో చూశాను’ అని ఆమె ఇటీవలే ఎక్కడో రాసిన మాట ఇప్పుడు మళ్లీ పైకి తేలింది. ఇద్దరు మనుషుల సహాయంతో కిమ్ నడుస్తున్నారట.. ఆమె చూసేటప్పటికి! మరి ఇప్పటికి?! చెబితే ఉత్తర కొరియా శత్రుదేశం దక్షిణ కొరియా చెప్పాలి. లేదంటే.. మళ్లీ రూత్ యాన్ మాంటీనే పరిశోధించి చెప్పాలి. మలాలా ఏం సాధించినా చప్పుడే అవలేదు! అన్నీ నిశ్శబ్దంగానే జరిగిపోయాయి. తాలిబన్లపై పోరాటం, నోబెల్ శాంతి బహుమతి, రెండు నెలల క్రితమే పూర్తి చేసిన ఆక్స్ఫర్డ్ డిగ్రీ.. ఈ మధ్యలో ఆమె రాసిన ‘ఐ యామ్ మలాలా’, ‘మలాలాస్ మ్యాజిక్ పెన్సిల్’, ‘మై స్టోరీ ఆఫ్ స్టాండింగ్ అప్ ఫర్ గర్ల్స్ రైట్స్’, ‘వియ్ ఆర్ డిస్ప్లేస్డ్’.. ఇవన్నీ కూడా! ఇప్పుడిక తక్కిన రచయిత్రుల పుస్తకాలను నెలకొకటిగా ఆమె పరిచయం చేయబోతోంది. వాటిపై చర్చించబోతోంది. ఆ రచయిత్రులతో వెబ్ ఇష్టాగోష్టులు కూడా ఉంటాయి. ఇందుకోసం అక్టోబర్‌లో ‘ఫియర్లెస్’ అనే డిజిటల్ బుక్ క్లబ్‌ను ప్రారంభిస్తోంది. క్లబ్ కోసం టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో ఉన్న ‘లిటరటీ’ అనే స్టార్టప్‌తో కలిసి చర్చనీయ పుస్తకాలను ఎంపిక చేస్తుంది మలాలా. ప్రపంచ ప్రసిద్ధులైన ఆంగ్ల రచయిత్రుల గ్రంథ సారాంశాలను మన మాలతీ చందూర్లా మలాలా తనదైన కథన శైలిలో వివరిస్తుంది. ఆసక్తి, పఠనశక్తి కలిగిస్తుంది. వాటిల్లో ఎక్కువగా ఆటోబయోగ్రఫీలు, రియల్ లైఫ్ స్టోరీలు ఉంటాయి. కొన్నిసార్లు మగవాళ్లు రాసినవి కూడా. మలాలాకు వ్యక్తిగతంగా ఆమె ఆల్‌టైమ్ ఫేవరేట్, ఎప్పుడూ తన పక్కనే ఉండే పుస్తకం.. పాలో కొయిలో రాసిన ‘ది ఆల్కెమిస్ట్’. ఒక గొర్రెల కాపరి ఆశయ లక్ష్యసాధన ప్రయాణం అది. లోపలి భయాలను, బయటి భయాలను దాటుకుని వచ్చిన వారి జీవితాలను చూసి నేర్చుకోవలసింది ఎంతో ఉంటుంది. అందుకే నా డిజిటల్ బుక్ క్లబ్‌కి ‘ఫియర్లెస్’ అని పేరు పెట్టాను అంటోంది మలాలా యూసఫ్‌జాయ్. -
ఆనందంలో మలాలా కుటుంబ సభ్యులు
నోబెల్ శాంతి బహుమతి గ్రహిత, పాకిస్తాన్‌కు చెందిన మలాలా యూసఫ్ జాయ్ సంబరాల్లో మునిగిపోయారు. ప్రఖ్యాత ఆక్స్‌ఫర్ట్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసిన ఫొటోలను కూడా షేర్ చేశారు. ‘హ్యాపీ గ్రాడ్యుయేషన్ మలాలా’ అని రాసి ఉన్న కేక్‌ను కట్ చేశారు. ‘నేను ఆక్స్‌ఫర్డ్‌లో నా ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ డిగ్రీ పూర్తిచేశాను. దీనిపై నా ఆనందాన్ని, కృతజ్ఞతను తెలుపడానికి మాటలు రావడం లేదు. ఇక ముందు ఏం జరుగుతుందో నాకు తెలియదు. ప్రస్తుతానికి నెట్‌ఫ్లిక్స్, పుస్తకాలు చదవడం, నిద్ర పోవడం ఇదే నా పని’ అని మలాలా పేర్కొన్నారు. కాగా, బాలికల విద్య కోసం పోరాడిన మలాలా.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. పాకిస్తాన్లో బాలికలను పాఠశాలల్లోకి అనుమతించాలని మలాలా ప్రచారం చేయడంతో.. 2012లో ఆమె ప్రయాణిస్తున్న స్కూలు బస్సుపై మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆమె గాయపడ్డారు. ఈ క్రమంలోనే మలాలా సేవకు గుర్తింపుగా 2014లో ఆమెను నోబెల్ శాంతి బహుమతి వరించిన విషయం తెలిసిందే. (చదవండి : ఆ దేశంలో టెలిగ్రామ్‌పై నిషేధం ఎత్తివేత!) Hard to express my joy and gratitude right now as I completed my Philosophy, Politics and Economics degree at Oxford. I don’t know what’s ahead. For now, it will be Netflix, reading and sleep. 😴 pic.twitter.com/AUxN55cUAf — Malala (@Malala) June 19, 2020 -
వీకెండ్ ఫోకస్.. వార్తల్లో వ్యక్తులు
బిపిన్ రావత్ సుదీర్ఘ నిరీక్షణ అనంతరం దేశ రక్షణ రంగంలో కీలకమార్పు చోటుచేసుకుంది. దేశ రక్షణ బలగాల తొలి అధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్– సీడీఎస్)గా బిపిన్ రావత్ నియామకమయ్యారు. త్రివిధ రక్షణ బలగాల వ్యవహారాలకు బిపిన్ రావత్ ఇకపై బాధ్యత వహిస్తారు. జనవరి 1వ తేదీన జనరల్ బిపిన్ రావత్ బాధ్యతలు చేపట్టారు. మూడేళ్ల పాటు ఈయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. మాలావత్ పూర్ణ ప్రపంచంలోనే చిన్న వయస్సులో మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించిన ఘనతను సాధిం చిన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థిని మాలావత్ పూర్ణ మరో సాహసాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. డిసెంబర్ 26న అంటార్కిటికా ఖండంలో 16,050 అడుగుల ఎత్తైన విస్సన్ మసిఫ్ పర్వతంపై అడుగుమోపారు. ప్రపంచంలో ని ఎత్తైన ఏడు ఖండాల్లో ఆరింటిని అధిరోహించిన పూర్ణ.. ఇక ఉత్తర అమెరికాలోని ‘డెనాలీ’ పర్వతాన్ని అధిరోహించాల్సి ఉంది. మలాలా యూసఫ్ జా నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాని ‘‘మోస్ట్ ఫేమస్ టీనేజర్ ఇన్ ద వరల్డ్’’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. బాలికల విద్య కోసం గొంతెత్తి నినదించిన మలాలా, తాలిబన్ల అకృత్యాలను ప్రపంచవ్యాప్తంగా ఎలుగెత్తి చాటారు. అతిచిన్న వయస్సులోనే ప్రారంభించిన ఆమె ఉద్యమ సంకల్పాన్ని ఐక్యరాజ్యసమితి కొనియాడింది. -
అరుదైన ఘనత దక్కించుకున్న మలాలా
న్యూయార్క్ : నోబెల్ శాంతి బహుమతి గ్రహిత, పాకిస్తాన్‌కు చెందిన మలాలా యూసఫ్ జాయ్ మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత టీనేజ్ యువతిగా గుర్తింపు పొందింది. 21వ శతాబ్ధపు రెండవ దశకంలో ఫేమస్ టీనేజర్‌గా మలాలా నిలిచినట్లు.. ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 2010 నుంచి 2019 మధ్య కాలంలో మలాలాకు వచ్చిన గుర్తింపు ఆధారంగా యూఎన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ మేరకు యూఎన్ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్‌లోని బాలికల విద్య కోసం మలాలా చేసిన పోరాటాన్ని యూఎన్ గుర్తుచేసింది. యుక్త వయసు నుంచే మలాలా బాలిక విద్య గురించి మాట్లాడిందని, తాలిబన్ల అకృత్యాలపై పోరాడిందని తన రిపోర్ట్‌లో పేర్కొంది. ఆమె సేవను గుర్తింపుగా 2014లో నోబెల్ శాంతి బహుమతి వరించిన విషయం తెలసిందే. 2017లో యూఎన్ శాంతిదూతగా కూడా ఆమె నిలిచారు. -
ప్రపంచకప్: భారత్‌పై మలాలా సెటైర్
లండన్: ఐసీసీ వన్డే క్రికెట్ ప్రపంచకప్ 2019 ప్రారంభవేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆతిథ్య ఇంగ్లండ్ సంప్రదాయం ఉట్టిపడేలా పలు కార్యక్రమాలను టోర్నీ నిర్వాహకులు నిర్వహించారు. ఈ ప్రారంభ వేడుకలకు అన్ని దేశాల ప్రముఖులు, క్రికెటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ‘60 సెకన్ల చాలెంజ్’ గల్లీ క్రికెట్ ఆడారు. అయితే పాకిస్తాన్ తరుపున ఈ వేడుకల్లో పాల్గొన్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, పాకీస్తానీ యువతి మలాలా యూసఫ్ జాయ్ భారత్‌ను తక్కువ చేసి మాట్లాడారు. ఈ చాలెంజ్‌లో టీమిండియా తరుపున ఆడిన మాజీ కోచ్ అనిల్ కుంబ్లే, బాలీవుడ్ నటుడు ఫరాన్ అఖ్తర్‌లు అన్ని జట్ల కన్నా తక్కువ పరుగులు(19) సాధించారు. దీంతో చివరి స్థానంలో నిలిచారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ తరుపున బ్యాటింగ్ చేసిన బ్యాట్స్‌మెన్ 38 పరుగులు చేశారు. ఇక మ్యాచ్‌ల అనంతరం పాక్ ప్రదర్శన గురించి మాట్లాడుతూ..‘పాక్ మరీ అంత దారుణంగా ఆడలేదు. టీమిండియా మాదిరి చివరి స్థానంలో మా జట్టు లేదు. కానీ భారత్ మంచిగా ఆడింది’అంటూ ఎద్దేవా చేశారు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌పై మలాలా స్పందించిన తీరుపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయినా ఆమె పాకిస్తానీ పౌరురాలే కదా.. అందుకే భారత్‌పై అక్కసును వెల్లగక్కింది’, ‘మలాలా, పాక్‌లో నీ పోరాటానికి ఫిదా అయ్యాము.. కానీ ఈ వ్యాఖ్యలతో నువ్వంటే ఏంటో తెలిసిపోయింది’అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
వారి గుండెల్లో వణుకు మొదలైంది: మలాల
ఇస్లామాబాద్: బాలిక చేతిలో పుస్తకం మత చాందస వాదులకు వణుకు పుట్టిస్తోందని, అందుకనే పాఠశాలలు తగులబెడుతున్నారని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాల యూసఫ్ జాయ్ (21) మండిపడ్డారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిట్–బాల్టిస్తాన్‌లో గుర్తుతెలియని ఉగ్రవాదులు గురువారం 12 స్కూళ్లను తగలబెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ఆరు బాలికల పాఠశాలలే ఉన్నాయి. ధ్వంసమైన పాఠశాలలను తిరిగి పునరుద్ధరించాలని ఆమె పిలుపునిచ్చారు. భయానికి వెరవకుండా దేశంలోని బాలబాలికలు బాగా చదువుకొని.. విద్య తమ హక్కు అని మత జాఢ్యంలో మునిగితేలుతున్న తీవ్రవాదులకు తెలియజెప్పాలని ఆకాక్షించారు. కాగా, ఉగ్రవాదుల చేతిలో దాడికి గురైన పాఠశాలల్లో ఎక్కువగా నిర్మాణ దశలో ఉన్నవేనని దియామిర్ డివిజన్ పోలీసు కమిషనర్ అబ్దుల్ వహీద్ షా తెలిపారు. The extremists have shown what frightens them most - a girl with a book. We must rebuild these schools immediately, get the students back into their classrooms and show the world that every girl and boy has the right to learn. https://t.co/99J7ZivafC — Malala (@Malala) August 3, 2018 బాలికా విద్యకై ప్రాధాన్యమిస్తాం: ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ కాబోయే ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పాఠశాలల విధ్వంసంపై స్పందించారు. ‘విద్యాలయాలపై ఉగ్ర దాడిని ఖండిస్తున్నాను. ఇలాంటి పిరికిపంద చర్యలను సహించబోను. త్వరలో కొలువుదీరే మా ప్రభుత్వం.. విద్యావ్యవస్థ పటిష్టానికి ప్రాధాన్యం ఇస్తుంది. ముఖ్యంగా బాలికా విద్యకై కృషి చేస్తాం’అన్నారు. ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. పాఠశాలల వద్ద గట్టి భద్రత కల్పిస్తామని అన్నారు. Shocking & condemnable torching of schools in GB, more than half of them girls' schools.This is unacceptable & we will ensure security for schools as we are committed to focusing on education, esp girls' education which is integral to Naya Pakistan. https://t.co/lSlQDjSkeS — Imran Khan (@ImranKhanPTI) August 3, 2018 -
మలాలా బయోపిక్.. ఫస్ట్‌లుక్ ఇదే!
పాకిస్తాన్ సాహస బాలిక, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌జాయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘గుల్ మకాయ్’ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలైంది. ప్రముఖ దర్శకుడు అంజద్ ఖాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మలాలా పాత్రలో బాలీవుడ్ నటి రీమ్ షేక్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సినిమా థీమ్‌ను తెలియజేసేలా ఈ ఫస్ట్‌లుక్‌ను రూపొందించారు. మలాల చేతిలో పుస్తకం పట్టుకొని ఉండగా.. పుస్తకాన్ని ఉగ్రవాదులు తగలబెట్టినట్లుగా పోస్టర్లో చూపించారు. తాలిబన్ల అరాచకాలకు ముస్లీం బాలికలు ఎలా చదువుకు దూరమయ్యారనే విషయాన్ని ఫస్ట్ లుక్‌లో చూపించారు. ఈ సినిమాలో మలాలా తల్లి పాత్రను దివ్య దత్తా పోషిస్తున్నారు. అలాగే ఇందులో ఓం పురి, రాగిణి ఖన్నాలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలాల తన చిన్ననాటి అనుభవాలను ‘గుల్ మకాయ్’ అనే పేరుతో డైరీ రూపంలో రాసుకున్నారు. ఉర్దూలో రాసుకున్న ఈ పుస్తకానికి సంబంధించిన కథనం బీబీసీలో ప్రసారం చేశారు. ఇప్పుడు అదే పేరుతో మలాల బయోపిక్ తెరకెక్కనుంది. గతంలో మలాల, తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలను ‘ఐయామ్ మలాలా’ అన్న పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. పాకిస్తాన్, స్వాత్‌లోయలో బాలికల చదువుకోవడాన్ని తాలిబన్లు నిషేదించినా, 11 ఏళ్ల వయస్సులోనే మలాలా విద్యా హక్కు కోసం పోరాటం చేశారు. 2012 లో ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తినందకు ఆమెపై తీవ్రవాదులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చిన్నారుల విద్యకోసం మలాలా కృషిచేస్తున్నారు. -
మలాలాపై దాడి : సూత్రధారి హతం
కాబుల్, అఫ్గానిస్తాన్ : మలాలా యూసఫ్ జాయ్పై దాడి సూత్రధారిని అఫ్గానిస్తాన్‌లో అమెరికా దళాలు మట్టుబెట్టాయి. అఫ్గానిస్థాన్‌లోని తూర్పు కునార్ ప్రావిన్స్‌లో అమెరికా దళాలు జరిపిన డ్రోన్ దాడిలో పాకిస్థాన్ తాలిబన్ నాయకుడు ముల్లా ఫజ్లుల్లా హతమయ్యాడు. ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని చేసిన డ్రోన్ దాడుల్లో ఉగ్రవాద నాయకుడు హతమైనట్లు అమెరికా ప్రకటించింది. అయితే, అతని పేరును మాత్రం వెల్లడించలేదు. ఈ దాడిలో చనిపోయింది మలాలాపై దాడికి ఆదేశించిన ముల్లా ఫజుల్లా అని అఫ్గాన్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఫజ్లుల్లా, పలువురు కమాండర్లు ఇఫ్తార్ విందులో ఉండగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఫజ్లుల్లా 2013లో పాకిస్థాన్‌లోని తాలిబన్ చీఫ్‌గా నియమితులయ్యాడు. అప్పటినుంచి అమెరికా, పాకిస్థానీ ప్రజలను లక్ష్యంగా చేసుకుని అనేక దాడులకు పాల్పడ్డాడు. 2014 డిసెంబరులో పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఆర్మీ పబ్లిక్ స్కూల్‌పై జరిగిన ఉగ్రదాడిలో ఫజ్లుల్లా ప్రధాన సూత్రధారి. ఆ ఘటనలో 151 మంది చిన్నారులు బలయ్యారు. మరో 130 మంది గాయపడ్డారు. ఫజ్లుల్లాపై 5 మిలియన్ డాలర్ల రివార్డు ఉంది. -
తాలిబన్ నేతను పట్టిస్తే భారీ రివార్డు
వాషింగ్టన్: నోబెల్ శాంతి గ్రహీత మలాలాపై దాడికి కారణమైన తాలిబన్ నేత మౌలానా ఫజలుల్లా తలపై అమెరికా ప్రభుత్వం భారీ రివార్డు ప్రకటించింది. అతడిని పట్టించిన వారికి 5 మిలియన్ డాలర్లు(దాదాపు 32.49 కోట్లు) నజరానాగా ఇస్తానని తెలిపింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రిక్–ఇ– తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) అధినేత ఫజలుల్లాను పలు దాడులకు సూత్రధారిగా అమెరికా అనుమానిస్తోంది. 2014లో పెషావర్ పాఠశాలపై తెహ్రిక్–ఇ– తాలిబన్ జరిపిన దాడిలో 150 మంది చనిపోయారు. వీరి లో ఎక్కువ మంది విద్యార్థులే. బాలికా విద్య కోసం కృషి చేస్తున్న మలాలాపై 2012లో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయం నుంచి బయటపడింది. -
మహిళలే స్వతంత్రంగా ఉంటూ తమకై తాము పోరాడాలి
-
మలాలాతో టెక్ దిగ్గజం భాగస్వామ్యం
టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థ బాలికల విద్యకు ప్రోత్సాహం ఇచ్చే దిశగా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇందుకోసం నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ నాయకత్వంలోని ది మాలాలా ఫండ్‌కు భారీ మద్దతు ఇవ్వనున్నట్టు సోమవారం తెలిపింది. బాలికల విద్యకు, సమానత్వానికి విశేషంగా కృషి చేస్తున్న మలాలా ఫండ్ సేవలకు విస్తరణకు ఈ పార్టనర్షిప్ తోడ్పడనుంది. అంతేకాదు మలాలాతో భాగస్వామ్యం కుదుర్చుకున్న తొలి టెక్ సంస్థ కూడా ఆపిల్‌నే. అలాగే మలాలా ఫండ్ లీడర్షిప్ కౌన్సిల్లో ఆపిల్ సీఈవో టిమ్ కుక్ కూడా చేరనున్నారు. ప్రతి బాలిక పాఠశాలకు వెళ్లే అవకాశాన్ని కల్పించాలనే మలాలా యూసఫ్ జాయ్ నిబద్ధతలో తాము కూడా భాగస్వామ్యులు కావాలని నిర్ణయించామని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఒక ప్రకటనలో తెలిపారు. ''మలాలా బాలికా విద్య, సమానత్వం కోసం పనిచేస్తున్న ధైర్యం గల న్యాయవాది. మన కాలంలో చాలా ఉత్తేజకరమైన వ్యక్తులలో ఆమె కూడా ఒకరు. ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిల సాధికారిత కోసం ఆమె చేస్తున్న ముఖ్యమైన పనిలో భాగం కావడం సంతోషంగా ఉంది. మనల్ని ఏకం చేయడంలో విద్య గొప్ప సమానమైన శక్తి అని నమ్ముతాం'' అని కుక్ పేర్కొన్నారు. 2013 నుండి, 12 సంవత్సరాల వరకు ఉచిత, సురక్షితమైన, నాణ్యమైన విద్య ప్రతి అమ్మాయి హక్కుకోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న , ప్రైవేటు, ప్రభుత్వాలు, ఇతర సంస్థలు భాగస్వామ్యంతో మలాలా ఫండ్ పని చేస్తోంది. 130 మిలియన్ల మందికిపైగా బాలికలు పాఠశాలలో దూరంగా ఉండడం వారి కృషి ప్రాముఖ్యతను మరింత పెంచిందని కుక్ వ్యాఖ్యానించారు. అటు ఆపిల్ భాగస్వామ్యంపై మలాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి అమ్మాయి తన సొంత భవిష్యత్తును ఎన్నుకోవడమే తన కల అని ఆమె పేర్కొన్నారు. -
సోషల్ మీడియా ఓ ఆయుధం కావాలి!
మెక్సికో: సామాజిక మాద్యమాలైన ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్ వంటి వాటిని రాజకీయ ఆయుధంగా వాడుకోవాలని నోబెల్ గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ పిలుపునిచ్చారు. సమానత్వం, మహిళా హక్కులు, విద్యా హక్కుల సాధన కోసం సోషల్ మీడియా ఎంతో ప్రభావవంతమైన ఆయుధంగా ఉపయోగపడుతుందని, దీనిని యువత అందిపుచ్చుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో వివక్ష పూరిత పోస్టులపై యువత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని, విచక్షణతో ఆలోచించి, స్పందించాలని హెచ్చరించారు. మెక్సికో నగరంలోని మాంటెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ హైయ్యర్ ఎడ్యుకేషన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మలాలా ప్రధానంగా సోషల్ మీడియా వినియోగంపైనే ప్రసంగించారు. ‘సోషల్ మీడియాకు కృతజ్ఞతలు. యువత రాజకీయ అంశాల గురించి మాట్లాడుకుంటున్నారంటే అంతా సోషల్ మీడియా కారణంగానే. ఇది అర్థవంతమైన చర్చల దిశగా సాగాలి. సమాజంలో మార్పు కోసం సామాజిక మాద్యమాలను ఓ ఆయుధంగా ఉపయోగించుకోవాలి. అయితే ఇదే మీడియాను ఉపయోగించుకొని తప్పుదోవ పట్టించే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని’ చెప్పారు. -
'ఆ పని చేస్తున్నది పాకిస్థానీలే'
ఇస్లాంకు, దేశానికి చెడ్డపేరు తెస్తున్నారు ఇస్లాం సందేశానికి చావుగంట మోగిస్తున్నారు సొంత దేశంపై తీవ్రంగా విరుచుకుపడ్డ మాలాలా న్యూఢిల్లీ: సొంత దేశం పాకిస్థాన్‌పై తీవ్రంగా విరుచుకుపడుతూ తాజాగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయి ఓ వీడియో సందేశాన్ని వెలువరించారు. 'దైవదూషణ'కు పాల్పడ్డాడన్న నెపంతో ఇటీవల పాకిస్థాన్‌లో ఓ యూనివర్సిటీ విద్యార్థిని దారుణంగా కొట్టిచంపారు. ఈ ఘటనను పేర్కొంటూ ప్రపంచవ్యాప్తంగా పాకిస్థాన్‌కు చెడ్డపేరు రావడానికి మరెవరో కాదు పాకిస్థానీలే కారణమని ఆమె విమర్శించారు. 'మనం ఇస్లామోఫోబియా గురించి మాట్లాడుతాం. మన దేశానికి, మన మతానికి ప్రజలు ఎలా చెడ్డపేరు తెస్తున్నారో మాట్టాడుతాం. కానీ, ఇతరులెవరూ మన దేశానికి, మన మతానికి చెడ్డపేరు పెట్టడం లేదు. అది మనకు మనమే చేస్తున్నాం. అందులో మనం సరిపోతాం' అంటూ ఆమె తప్పుబట్టారు. గురువారం 23 ఏళ్ల జర్నలిజం విద్యార్థి మషాల్ ఖాన్‌ను యూనివర్సిటీ పరిసరాల్లోనే పట్టపగలు అతి కిరాతకంగా ఓ మూక కేకలు పెడుతూ హతమార్చింది. ఫేస్బుక్లో 'దైవదూషణ' చేశాడన్న ఆరోపణలతో ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. మషాల్ ఖాన్‌ను క్రూరంగా కొట్టిచంపడమే కాదు.. అతని మృతదేహాన్ని కాలేశారు. అతడు ప్రాణాలు కోల్పోయి నిర్జీవంగా పడి ఉన్నా.. అతని మృతదేహాన్ని కట్టెలతో కొడుతూ కసి తీర్చుకున్నారు. ఈ దారుణమైన ఘటన నేపథ్యంలో మలాలా మృతిచెందిన విద్యార్థి తండ్రితో మాట్లాడారు. ఇంతటి దారుణం తన కొడుకుపై జరిగినా, సమాజంలో శాంతి, సహనం నెలకొనాలంటూ ఆయన సందేశమిచ్చారని ఆమె చెప్పారు. 'ఈ ఘటన మషాల్ హత్యకు సంబంధించినదే కాదు. ఇది ఇస్లాం సందేశానికి చావుగంట మోగించడమే. మనం మన మతాన్ని మరిచిపోయాం. మనం మన విలువల్ని, సభ్యతని మరిచిపోయాం' అని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. -
అక్షర సాహసికి మరో అరుదైన గౌరవం
కెనడా: పాకిస్థాన్ అక్షర సాహసి, బాలికల విద్యాహక్కుల పోరాట యోధురాలు, అతి పిన్న వయసులోనే నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న మలాలా యూసఫ్జాయ్కు అరుదైన గౌరవం దక్కనుంది. కెనడా పార్లమెంటులో ఆమె ప్రసంగించనుంది. తమ దేశ పార్లమెంటులో మలాలా ప్రసంగించనుందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడు స్వయంగా ప్రకటించారు. దాంతోపాటు ఆరోజు గౌరవ పూర్వకమైన సిటిజన్‌షిప్ కూడా అందించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 12న కెనడాను 19 ఏళ్ల మలాలా సందర్శించనుందని, తమ పార్లమెంటులో ప్రసంగించనున్న అతి పిన్న వయస్కురాలు మలాలా కానుందని చెప్పారు. మలాలా 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తాలిబన్ల కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. స్కూలు నుంచి తిరిగొస్తున్న ఆమెపై బాలికల విద్యను ప్రోత్సహిస్తుందనే కారణంతో కాల్పులు జరపగా అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. తొలుత పాక్‌లోనే చికిత్స జరిగినా తర్వాత మాత్రం బ్రిటన్‌కు తరలించి అక్కడే పూర్తిగా కోలుకునేలా చేశారు. 2014 మలాలా నోబెల్ అవార్డు అందుకుంది. -
ఆమె పోరాటం ఊరికే పోలేదు!
అక్కడి ఆడపిల్లల మీద ఎన్నో ఆంక్షలు. మతం పేరుతో బాలికలపై ఎన్నో అరాచకాలు.. బాలికలను విద్యకు దూరం చేయాలన్న తాలిబన్ల ఫత్వా ఆమె ఖాతరు చేయలేదు. బాలిక విద్యకోసం కృషి చేస్తున్న ఆ చిన్నారిపై ఉగ్రవాదులు దాడి జరిపారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఆ బాలిక విద్య కోసం నేటికి ఉద్యమిస్తూనే ఉంది. తాలిబన్ల తూటాలను ధైర్యంగా ఎదుర్కొంది. బాలిక హక్కుల కోసం మరణం అంచుల దాకా వెళ్లి ఆమె చేసిన పోరాటం ఊరికే పోలేదు. ఆమె సేవలకు గుర్తుగా నోబెల్ శాంతి బహుమతికి వరించింది. ఆమె మరెవరో కాదు.. పాక్ బాలిక యూసఫ్‌జాయ్ మలాలా... మరి ఆమెపై జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన మరిన్ని విషయాలను ఈ రోజు తెలుసుకుందాం...! మలాలా ఎక్కడి అమ్మాయి? పదహారణాల తెలుగింటి అమ్మాయి కాదే. పోనీ పొరుగింటి అమ్మాయా? అసలే కాదు. పోనీ మన దేశానికి చెందిన అమ్మాయా? కానే కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే మన శత్రుదేశమైన పాకిస్థాన్‌కి చెందిన అమ్మాయి. కానీ ఈ అమ్మాయి ఏదైనా ఆశయం కోసం చిన్నగా పిడికిళ్లు బిగిస్తే.. ఆ పిడికిళ్ల ప్రభంజనాన్ని అందుకునేందుకు కోట్లాది చేతులు పైకిలేస్తాయి. అంతే ఉద్విగంగా ఆ పిడికిళ్లు ఆకాశమంత ఎత్తులో ‘‘మేము ఆడపిల్లలం ఆత్మస్ధైర్యానికి ప్రతీకలం’’ అంటూ నినదిస్తాయి. డాక్టర్ కావాలనుకున్నా... జూలై 12, 1997న పాకిస్థాన్‌కి చెందిన ఒక సున్నీ ముస్లిం కుటుంబంలో మలాలా జన్మించింది. చిన్నప్పటినుంచి మలాలాకు డాక్టర్ కావాలని కోరిక ఉండేది. కానీ తండ్రి కోరిక మేరకు రాజకీయాల్లోకి రావాలని నిశ్చయించుకుంది. ఇద్దరు తమ్ముళ్లు నిద్రపోయినా కూడా అర్ధరాత్రి వరకు తండ్రితో రాజకీయాల గురించి చర్చిస్తూనే ఉండేది. రాజకీయాలపై అవగాహన పెంచుకున్న 11 సంవత్సరాల మలాలా 2008 పెషావర్ క్లబ్లో అనర్గళమైన ఉపన్యాసం ఇచ్చింది. ‘‘చదువుకోవడానికి నాకు ఉన్న హక్కును లాక్కోవడానికి మీరెవరు? అంటూ ఉపన్యాసంలో తాలిబన్లను ప్రశ్నించింది. ఈ ఉపన్యాసం స్వాత్‌లోయ మొత్తం ప్రతిధ్వనించింది. ఇక అప్పటినుంచి తాలిబన్లకు మలాలా, ఆమె కుటుంబ సభ్యులు శత్రువులయ్యారు. ఉగ్రవాదుల హుకుం స్వాత్‌లోయలో ఆడపిల్లలకు అక్షరం నిషిద్ధమైంది. బాలిక పాఠశాలలన్ని మూసేయాలని హుకుం జారీచేశారు. ఉగ్రవాదుల ఆదేశాలను ఖతారు చేయని వందకుపైగా బాలిక పాఠశాల భవనాలను పేల్చివేశారు. బడికి వెళ్లే బాలికలను చంపడంతోపాటు ఉపాధ్యాయులను కూడా బహిరంగంగా చంపడం మొదలుపెట్టారు. కొడుకుతో కలిసి బడికి వెళుతున్న ఉపాధ్యాయిని కొడుకు ముందే కాల్చి చంపారు ఉగ్రవాదులు. కరాచిలోని క్వెట్టాలో ఆత్మాహుతి దళసభ్యుడు 40 బాలికలు ఉన్న పాఠశాల బస్సులోకి వెళ్లి తనను తాను పేల్చివేసుకున్నాడు. టీవీలు మూగబోయాయి. స్త్రీలు గడపదాటిరావడం మీద ఆంక్షలు మొదలయ్యాయి. తాలిబన్ల ఆగడాలు రోజురోజుకి పెరిగిపోసాగాయి. మలాలా సొంత ఊరు మింగోరా పట్టణంలో కూడా పాఠశాల భవంతిని ఉగ్రవాదులు పేల్చివేసారు. అయినప్పటికీ మలాలా ఏ మాత్రం భయపడకుండా బడికి వెళుతూనే ఉంది. ఒకరోజు పాఠశాలకు వెళ్లివస్తున్న మలాలాకు ఎదురుగా ముసుగు వేసుకున్న వ్యక్తి వెళ్లి చంపుతానని బెదిరించాడు. తమ మాట వినటం లేదన్న కారణంతో అక్టోబర్ 9, 2012, స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళుతుండగా మలాలాపై ముష్కరులు దాడిచేశారు. తలలోకి బుల్లెట్లు దూసుకపోయాయి. చనిపోయారనుకుని వదిలివెళ్లిపోయారు. కానీ, అదృష్టవశాత్తూ బాలిక ఇంకా ప్రాణాలతోనేఉంది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. కానీ, పాకిస్థాన్‌లో సరైన వైద్య సదుపాయాలు లేనందున బ్రిటన్‌లోని క్వీన్ ఎలిజిబెత్ ఆసుపత్రికి తరలించారు. సర్జరీల మీద సర్జరీలు చేయాలి బతకడం కష్టం అన్నారు. బతికినా ఏదో సమస్య జీవితాంతంవెంటాడుతూనే ఉంటుందన్నారు. మలాలా బతకాలని ప్రపంచంలో అణిచివేతకు గురవుతున్న ప్రతిబాలిక దేవుడిని ప్రార్థించింది. వెట్టిచాకిరీ, వేధింపులకు గురవుతున్న ప్రతి మహిళా మలాలా కోలుకోవాలని పూజలు చేశారు. వీరందరి పూజలు, మలాలా సంకల్పం ఫలించాయి. మొత్తానికి కానీ, మలాలా కళ్లు తెరిచింది. బాలికల హక్కుల కోసం పోరాడేందుకు లేచినిలబడింది. తీవ్రవాదుల తూటాల గాయాల నుంచి 6 నెలల్లోనే కోలుకుని ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. మార్చి, 2013న మలాలా చిరునవ్వుల చిందిస్తూ బ్రిటన్ స్కూల్లో అడుగుపెట్టింది. నోబెల్ శాంతి బహుమతి బాలిక విద్యావ్యాప్తికోసం చేసిన విశేష కృషికి గుర్తింపుగా 2014లో మలాలాకు నోబెల్ శాంతి పురస్కారం లభించింది. బాలకార్మిక నిర్మూలనకోసం కృషిచేసిన కైలాశ్ సత్యార్థితో నోబెల్ బహుమతిని పంచుకుంది. ఈ బహుమతికి ఎంపికైన అతిపిన్న వయస్కురాలు మలాలా. ఆడపిల్లలకు పెన్ను, నోట్‌బుక్ ఇస్తే పరిస్థితులు మారిపోతాయని మలాలా బలంగా నమ్ముతుంది. ‘‘సాటి మనిషిని ప్రేమించడమే నా కుటుంబం నాకు నేర్పిన సంస్కారం. నా మీద తూటాలు కురిపించిన తాలిబన్ వచ్చి నా ఎదురుగా నిలిచినా అతడిని నేను క్షమిస్తాను. గాంధీజీ, మార్టిన్ లూథర్ కింగ్, మదర్ థెరిసాలే నాకు ఆదర్శ’’మని మలాలా చెప్పింది. తాలిబన్లకు చదువు లేదు, అందుకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఐక్యరాజ్యసమితి ఉపన్యాసంలో పేర్కొంది. పది మంది కోసం పనిచేస్తే వంద మంది గుర్తుపెట్టుకుంటారు. భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తే కొన్ని తరాలు గుర్తుపెట్టుకుంటాయి. ఆడపిల్లలకు కూడా చదువు కావాలంటూ గళమెత్తిన మలాలా ఇప్పుడు ప్రపంచంలోని ఎంతోమంది బాలికలకు, యువతులకు మార్గదర్శకమైంది. అందుకే ఇప్పుడు ఆమెను రోల్‌మోడల్‌గా తీసుకుంటున్నారు ప్రపంచ దేశాల యువతులు. – సాక్షి స్కూల్ ఎడిషన్ -
నోబెల్ బహుమతి ఇస్తానంటే.. వద్దన్నాను!
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ ఓ చిత్రమైన విషయం చెప్పారు. తనకు గతంలో నోబెల్ శాంతి బహుమతి ఇస్తామంటే.. వద్దని తిరస్కరించానన్నారు. ఇటీవల పాకిస్థానీ అమ్మాయి మలాలా యూసుఫ్జాయ్కి ఈ అవార్డు ఇవ్వడం కూడా సరికాదని, ఆమెకు ఆ అర్హత లేదని చెప్పారు. నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సినంతగా ఆమె ఏమీ చేయలేదని ఆయన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. తాను కేవలం పని చేయడాన్నే నమ్ముతాను తప్ప.. తనకు అవార్డులతో పనిలేదని చెప్పారు. అవార్డులు ఇచ్చేటప్పుడు దానికి తగిన అర్హత ఉందో లేదో చూసుకోవాలని, మలాలాకు ఆ అవార్డు ఇవ్వడం శుద్ధ దండగని అన్నారు. మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి వెళ్లినప్పుడు ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవలే భారత ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన ఆ అవార్డు స్వీకరించారు. -
సిరియన్ బాలికలకోసం మలాలా పాఠశాల
లెబనాన్: పాకిస్థాన్ సాహస బాలిక, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌జాయ్.. సిరియన్ శరణార్ధ బాలికల కోసం బెక్కా లోయలో 'మలాలా యూసఫ్ జాయ్ ఆల్ గర్ల్స్ స్కూల్' పేరుతో ఒక పాఠశాలను ప్రారంభించారు. మలాలా ఫండ్ నిధులను ఈ పాఠశాల నిర్వహణకు ఉపయోగించనున్నారు. తన 18వ పుట్టిన రోజు వేడుకలను ఆమె సిరియన్ సరిహద్దుల్లో లెబనాన్ వ్యాలీలో ఆదివారం జరుపుకొన్నారు. బాలికా విద్యకోసం పాటు పడుతున్నమలాలా ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా విద్యకు అధిక ప్రాధాన్యతనివ్వాలని పిలుపునిచ్చారు. మిలిటరీ ఖర్చులను తగ్గించుకొని , బాలికా విద్యాకోసం పాటుపడాలని ప్రపంచ నాయకులకు విజ్క్షప్తి చేశారు. ప్రపంచం మొత్తంమీద ఎనిమిది రోజులు సైనిక ఖర్చును నిలిపివేస్తే 12 సంవత్సరాలపాటు ఉచిత విద్యను అందించవచ్చన్నారు. ప్రతీ పిల్లవాడికి నాణ్యమైన విద్య చాలా అవసరమని ఆమె పేర్కొన్నారు. సిరియాలో తలెత్తిన అంతర్యుద్ధాన్ని నివారించడంలో ప్రపంచ దేశాలన్నీ పూర్తిగా విఫలమయ్యాయని మలాలా ఆవేదన వ్యక్తం చేశారు. సిరియా ప్రాంతంలో అంతర్యుద్ధం కారణంగా ప్రజలు చెల్లాచెదరైపోతున్నారనీ, ఇతర ప్రాంతాలకు శరణార్థులుగా మారిపోతున్నారన్నారు. ఆ ప్రజలను, ముఖ్యంగా పిల్లలను కాపాడడంలో ప్రపంచ దేశాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఇది హృదయాలను పిండేసేంత బాధాకరమైన విషయమన్నారు. సిరియన్ శరణార్థ బాలికలకు తన సంపూర్ణ మద్దతు తెలియచేసిన ఆమె ఇంతమంది ధైర్యవంతుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అరుదైన గౌరవంగా భావిస్తానని తెలిపారు. ఇంత విషాదకర పరిస్థితుల్లోనూ, అంతర్యుర్ధం మధ్య పాఠశాలకు వెళుతున్న 2.80 కోట్ల మంది పిల్లల ప్రతినిధిగా ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. వారి ధైర్యసాహసాలు మనందరికీ ఎంతో స్ఫూర్తినిస్తాయని మలాలా కొనియాడారు. -
మలాలా జీవితంపై సినిమా
-
'పాకిస్తానీ, భారతీయుడు కలసి పనిచేయగలరు'
-
'విశ్వశాంతికి అందరూ కృషి చేయాలి'
-
'పాకిస్తానీ, భారతీయుడు కలసి పనిచేయగలరు'
న్యూఢిల్లీ: ఒక పాకిస్థానీ, ఒక భారతీయుడు కలసి పనిచేయగలరని పాక్ ధీర బాలిక, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ అన్నారు. ప్రముఖ భారత బాలల హక్కుల కార్యకర్త కైలాస్ సత్యార్థితో కలసి నోబెల్ బహుమతి అందుకోవడం గర్వకారణంగా ఉందని మలాలా చెప్పారు. నార్వే రాజధాని ఓస్లోలో బుధవారం జరిగిన కార్యక్రమంలో మలాలా, సత్యార్థి సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించారు. అనంతరం మలాలా ప్రసంగిస్తూ తల్లిదండ్రులకు, గురువులకు, స్నేహితులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆంక్షలు విధించకుండా స్వేచ్ఛగా ఎదగనిచ్చినందుకు తన తండ్రికి కృతజ్ఞతలు చెప్పారు. బాలల హక్కుల కోసం జాలి చూపకుండా, వారి కోసం పోరాడాలాని మలాలా కోరారు. -
'విశ్వశాంతికి అందరూ కృషి చేయాలి'
న్యూఢిల్లీ: తూర్పు-పశ్చిమ, ఉత్తర-దక్షిణ ప్రాంతాలన్నీ విశ్వశాంతి కోసం పాటుపడాలని ప్రముఖ బాలల హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి అన్నారు. పాకిస్థాన్ ధీర బాలిక మలాలా యూసఫ్జాయ్తో కలసి కైలాస్ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి అందుకోనున్నారు. నార్వే రాజధాని ఓస్లోలో బుధవారం జరిగిన కార్యక్రమంలో వీరికి సంయుక్తంగా బహుమతిని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కైలాస్ వేదాల్లోని ఓ శ్లోకాన్ని వినిపించి హిందీలో ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ బహుమతిని బాలల హక్కుల కోసం పోరాడుతున్న అందరికీ అంకితం చేస్తున్నట్టు చెప్పారు. మలాలా తనకు కూతురు లాంటిదని, ఓస్లో వేదికగా పాక్ కూతురును ఓ భారతీయ తండ్రి కలుసుకున్నారని కైలాస్ చెప్పారు. 'ప్రతి చిన్నారి స్వేచ్ఛగా పాఠశాలకు వెళ్లాలి. ఆడుకోవాలి. చిన్నారులెవరూ బాలకార్మికులుగా మారరాదు. విముక్తులయిన బాల కార్మికుల్లో ఈశ్వరుడిని చూశాను' అని కైలాస్ అన్నారు. బుద్ధుడు జన్మించిన భూమి నుంచి నార్వే వరకు తన యాత్ర సాగిందని కైలాస్ అన్నారు. కైలాస్ స్వరాష్ట్రం మధ్యప్రదేశ్. అధ్యాపక వృత్తికి గుడ్ బై చెప్పి బాలల హక్కుల కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. -
'నోబెల్' స్వీకరించిన కైలాస్, మలాలా
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్లకు చెందిన ప్రముఖ బాలల హక్కుల కార్యకర్తలు కైలాస్ సత్యార్థి, మలాలా యూసఫ్‌జాయ్ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. నార్వే రాజధాని ఓస్లోలో బుధవారం జరిగిన కార్యక్రమంలో వీరికి సంయుక్తంగా బహుమతిని ప్రదానం చేశారు. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న ఎనిమిదో భారతీయుడు కైలాస్. బాలల హక్కుల కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. బహుమతి కింద కైలాస్ సత్యార్థి, మలాలాకు నోబెల్ పతకం, ప్రశంసాపత్రం, 1.1 మిలియన్ డాలర్ల (రూ.6.1 కోట్లు) నగదు చెరిసగం అందజేశారు. అవార్డును స్వీకరించడానికి సత్యార్థి తన భార్య సుమేధ, కుమారుడు, కోడలు, కూతురుతో సహా సోమవారమే ఓస్లోకు వెళ్లారు. ఓస్లోలో మంగళవారం జరిగిన చర్చా కార్యక్రమంలో కైలాస్ సత్యార్థి, మలాలా పాల్గొన్నారు. -
నేడు సత్యార్థి, మలాలాకు నోబెల్
-
నేడు సత్యార్థి, మలాలాకు నోబెల్
స్టాక్‌హోం(స్వీడన్): భారత్, పాకిస్తాన్లకు చెందిన ప్రముఖ బాలల హక్కుల కార్యకర్తలు కైలాస్ సత్యార్థి(60), మలాలా యూసఫ్‌జాయ్ (17)లు బుధవారం ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి అందుకోనున్నారు. నార్వే రాజధాని ఓస్లోలో జరిగే కార్యక్రమంలో వీరికి సంయుక్తంగా బహుమతిని ప్రదానం చేయనున్నారు. బహుమతి కింద వీరికి నోబెల్ పతకం, ప్రశంసాపత్రం, 1.1 మిలియన్ డాలర్ల (రూ.6.1 కోట్లు) నగదు చెరిసగం అందజేస్తారు. అవార్డును స్వీకరించడానికి సత్యార్థి తన భార్య సుమేధ, కుమారుడు, కోడలు, కూతురుతో సహా సోమవారమే ఓస్లోకు చేరుకున్నారు. ఆయన ‘పీటీఐ’తో మాట్లాడుతూ.. ‘ఈ అవార్డును భారత్‌లోని బాలలకు అంకితమిస్తున్నా. ఈ బహుమతి వారి కోసమే. దేశ ప్రజల కోసం కూడా’ అని సంతోషం వ్యక్తం చేశారు. భారత్, పాకిస్తాన్ల మధ్య శాంతి కొనసాగడానికి విశ్వాసం, స్నేహమే ముఖ్యమని ఓస్లోలో జరిగిన ఓ కార్యక్రమంలో సత్యార్థి, మలాలా అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల ప్రధానుల చర్చల కన్నా ప్రజల మధ్య సంబంధాలు మరింత ముఖ్యమని సత్యార్థి అన్నారు. కాగా, భౌతిక, రసాయన, వైద్య, ఆర్థిక శాస్త్రాలు, సాహిత్యం విభాగాల్లో విజేతలుగా నిలిచిన మరో 11 మందికి స్వీడన్‌లోని స్టాక్‌హోంలో జరిగే కార్యక్రమంలో నోబెల్ బహుమతులను అందజేయనున్నారు. నోబెల్ బహుమతిని నెలకొల్పిన ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ స్మారకార్థం ఆయన వర్ధంతి రోజైన డిసెంబరు 10న 1901 నుంచి ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. -
గాజాలోని స్కూళ్లకు మలాలా చేయూత
లండన్: గాజాలోని దెబ్బతిన్న స్కూళ్లకు పాక్ బాలల హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ చేయూతనందించారు. గత కొన్ని రోజుల క్రితం ప్రపంచ బాలల నోబెల్ అవార్డుకు (వరల్డ్ చిల్ట్రన్స్ ప్రైజ్)ఎంపికైన మలాలా.. ఆ బహుమతి ద్వారా వచ్చిన 50 వేల యూస్ డాలర్లను అక్కడి స్కూళ్లను పునరుద్ధరించేందుకు ఇచ్చారు. ఈ మధ్య కాలంలో గాజాపై ఇజ్రాయిల్ దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో గాజాలో స్కూళ్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. బహుమతి కింది అందే మొత్తాన్ని ఆమె బాలల సంక్షేమం కోసం వినియోగించాల్సి ఉన్నందున ఆమె గాజాలో స్కూళ్లకు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. నాణ్యమైన విద్యకు ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఒకవేళ అక్కడ విద్య లేకుంటే ఎప్పటికీ శాంతి అనేది ఉండదు' అని పేర్కొంది. -
రెక్కలు తొడిగిన బాల్యానికి నోబెల్ శాంతి బహుమతి
భారత్, పాకిస్థాన్ దేశాల్లో బాలల హక్కులు, బాలికల విద్య కోసం అలుపెరుగని ఉద్యమం సాగిస్తున్న సామాజిక కార్యకర్తలు కైలాష్ సత్యార్థి (60), మలాలా యూసఫ్‌జాయ్ (17)లు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. అతిపిన్న వయస్సులోనే: పాక్‌లో బాలికల విద్యాహక్కుల కోసం ఉద్యమం సాగిస్తూ.. రెండేళ్ల కిందట తాలిబాన్ ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడి.. మరణాన్ని జయించి.. లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్న పాక్ బాలిక మలాలా.. నోబెల్ బహుమతికి ఎంపికైన అతి పిన్నవయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. ఆమె వయసు కేవలం 17ఏళ్లు. గతంలో ఈ రికార్డు సర్ విలియమ్ లారెన్స్ బ్రాగ్ పేరిట ఉంది. ఆయనకు 1915లో 25 ఏళ్ల వయసులో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. విలియమ్ ఆస్ట్రేలియాలో జన్మించిన బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త. మలాలా నోబెల్ గెలుచుకున్న రెండో పాకిస్థాని. ఇంతకు ముందు 1979లో మహ్మద్ అబ్దుస్ సలామ్ అనే భౌతిక శాస్త్రవేత్తకు నోబెల్ పురస్కారం లభించింది. మలాలా యూసఫ్‌జాయ్ 1997 జూలై 12న వాయవ్య పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల ప్రాబల్యమున్న స్వాత్ జిల్లాలో జన్మించింది. అక్కడి తాలిబన్లు బాలికల విద్యపై నిషేధం విధించారు. అయితే దీన్ని వ్యతిరేకించి బాలికల విద్య కోసం ఉద్యమం ప్రారంభించింది. దీన్ని సహించని తాలిబన్లు 2012, అక్టోబర్ 9న మలాలాపై తూటాలు పేల్చారు. అప్పుడు ఒక బుల్లెట్ ఆమె తలలోకి దూసుకుపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను మెరుగైన చికిత్స కోసం బ్రిటన్‌కు తరలించారు. చికిత్స అనంతరం మలాలా 2013 మార్చిలో బర్మింగ్‌హామ్‌లోని ఒక స్కూల్లో చేరి ఇంగ్లండ్‌లోనే చదువుకుంటోంది. ఈ ఘటనతో మలాలా ప్రపంచం మొత్తానికి తెలిసింది. 2013 అక్టోబర్‌లో మలాలా ‘‘ఐ యామ్ మలాలా- ద గర్ల్ హూ స్టుడ్ అప్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ వాజ్ షాట్ బై ద తాలిబన్’’ అనే పేరుతో తన ఆత్మకథను ప్రచురించింది. దీన్ని ఆమె క్రిస్టినా ల్యాంబ్ అనే బ్రిటిష్ జర్నలిస్టుతో క లిసి రచించింది. అవార్డులు: మలాలా స్ఫూర్తిని గుర్తిస్తూ ఎన్నో అవార్డులు ఆమెకు లభించాయి. 2013లో కిడ్స్‌రైట్స్ ఫౌండేషన్ వారి అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి, క్లింటన్ ఫౌండేషన్ వారి క్లింటన్ గ్లోబల్ సిటిజన్ అవార్డు, అన్నా పొలిటికొవ్స్కయా అవార్డు, యూరోపియన్ పార్లమెంట్ ఇచ్చే సఖరోవ్ పురస్కారం, అంతర్జాతీయ సమానత్వ బహుమతి, 2014లో లిబర్టీ మెడల్‌ను గెలుచుకుంది. బచ్పన్ బచావో ఆందోళన్: బాలల హక్కుల అణచివేతపై మూడు దశాబ్దాలుగా కైలాష్ సత్యార్థి పోరు సాగిస్తున్నారు. 80 వేల మంది బాలలను వెట్టి చాకిరీ, అక్రమ రవాణా నుంచి విముక్తి కల్పించేందుకు విశేష కృషి చేశారు. భారత్‌కు నోబెల్ శాంతి బహుమతి లభించటం ఇది రెండోసారి. మథర్ థెరిస్సా 1979లో మొదటి సారి భారత్ తరఫున నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు (ఆమె తన జీవితాన్ని భారత్‌లోనే గడిపినా జన్మించింది మాత్రం ఒకప్పటి యుగోస్లోవియాలో). జన్మతః భారతీయుడికి నోబెల్ శాంతి బహుమతి లభించడం ఇదే ప్రథమం. మధ్యప్రదేశ్‌కు చెందిన కైలాష్ సత్యార్థి ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి మూడు దశాబ్దాల కిందట ‘బచ్పన్ బచావో ఆందోళన్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. -
తరగతి పరీక్షలపై మలాలా బెంగ!
లండన్: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన మలాలా యూసఫ్‌జాయ్(17) సందిగ్ధంలో పడింది. నోబెల్ అవార్డు తీసుకునే సమయంలోనే తరగతి పరీక్షలకు హాజరవుతున్నందున మలాలా బెంగపెట్టుకుంది. ప్రస్తుతం బర్మింగ్ హమ్ లో తన తల్లి దండ్రులతో కలసి ఉన్న మలాల నోబెల్ అవార్డును గెలుచుకున్న ఆనందంలో ఉన్నా.. త్వరలో జరుగనున్న స్కూలు పరీక్షలపై ఆందోళన చెందుతోంది. నోబెల్ అవార్డు తీసుకునే సమయం.. పరీక్షల సమయం ఒకేసారి రావడంతో ఆమె కలత చెందుతున్నట్లు పేర్కొంది. బాలికల విద్యా హక్కు కోసం ధైర్యంగా, సాహసోపేతంగా పోరాడిన మలాలాకు నోబెల్ అవార్డుతో కొత్త సమస్య వచ్చిపడటం ఆసక్తికరంగా మారింది. గత రెండు సంవత్సరాల క్రితం తాలిబన్లు తుపాకీ దాడుల్లో తీవ్రంగా గాయపడిన మలాలా అనంతరం మెదడుకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకుని కోలుకున్న సంగతి తెలిసిందే. నోబెల్ అవార్డు గెలుచుకున్న తరువాత ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటూర్యూలో పలు విషయాలను వెల్లడించింది. 'ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఇది నిజంగా గొప్ప గౌరవం. ప్రజలు చూపించిన ప్రేమతోనే నేను తిరిగి బయటపడ్డాను'అని పేర్కొంది. 'నాకు అవార్డు వచ్చే విషయంలో నా టీచర్లే ఎక్కువ ఆసక్తి చూపారు. అవార్డు వచ్చినట్లు ప్రకటించాక వారే ఎక్కువగా ఆనంద పడ్డారు' అని మలాలా పేర్కొంది. అవార్డు వచ్చే సమయంలో కెమిస్ట్రీ టీచర్ వద్ద తాము ఒక పాఠ్యాంశాన్ని నేర్చుకుంటున్నామని మలాలా తెలిపింది. అయితే తన వద్ద ఎటువంటి సెల్ ఫోన్ లేకపోవడంతో ఆ విషయాన్ని తన టీచర్లే తెలిపినట్లు మలాలా పేర్కొంది. -
మలాలాపై దాడి చేసిన ఉగ్రవాదుల అరెస్ట్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ బాలికల విద్యాహక్కు కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్‌ని హత్యచేసేందు కు ఆమె తలపై కాల్పులు జరిపిన పది మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు ఆ దేశ ఆర్మీ తెలిపింది. ఉగ్రవాదులపై దాడిలో భాగంగా పోలీసు లు, నిఘా సంస్థలు, సైన్యం జరిపిన ఆపరేషన్‌లో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు మేజర్ జనర్ అసీమ్ బాజ్వా శుక్రవారం వెల్లడించారు. -
మలాలాను కలుసుకోవాలనుంది: బీబర్
లాస్ ఎంజెలెస్: తాలిబాన్ కాల్పుల్లో గాయపడిన మలాలా యూసఫ్ జాయ్ ని కలుసుకునేందుకు పాప్ సెన్సేషన్ జస్టిన్ బీబర్ తహతహలాడుతున్నారు. మలాలా స్థాపించిన ఫౌండేషన్ కు సహాయం అందించాలనుకుంటున్నానని బీబర్ వెల్లడించారు. పాకిస్థాన్ లో బాలికలకు విద్యాహక్కు కల్పించాలని ప్రచారం చేసిన మలాలాపై తాలిబాన్ ఉగ్రవాదులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. కాల్పుల గాయపడిన మలాలా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. కాల్పుల గాయాల నుంచి కోలుకున్న మలాలా... మహిళలకు విద్యహక్కును కల్పించాలనే ఆశయంతో మలాలా ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. ఇటీవల మలాలాతో బీబర్ వీడియో చాటింగ్ చేశాడు. వీడియో చాటింగ్ వివరాలను యూఎస్ లోని ప్రముఖ వెబ్ సైట్ కు అందించాడు. మలాలా ఫౌండేషన్ కు సహాయం చేయాలని ఉంది. మలాలా జీవితం స్పూర్తిదాయకమైంది. మలాలాను కలుసుకోవడానికి అతృతగా ఉంది అని ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు. -
మలాలాకు చిన్నారుల నోబెల్
ప్రతిష్టాత్మక ప్రపంచ చిన్నారుల అవార్డుకు ఎంపిక లండన్: చిన్నారుల నోబెల్‌గా పేర్కొనే ‘ప్రపంచ చిన్నారుల అవార్డు’కు పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్(16) ఎంపికయ్యింది. మరో ఇద్దరు ప్రముఖులు.. అమెరికాకు చెందిన జాన్ వుడ్, నేపాల్‌కు చెందిన రణంగర్ కూడా 2014 సంవత్సరానికి సంబంధించి ఈ అవార్డు కోసం నామినేట్ అయ్యారు. ఏటా 15 మంది చిన్నారులతో కూడిన అవార్డుల జ్యూరీ ముగ్గురి పేర్లను ఈ అవార్డు కోసం ఎంపిక చేస్తుంది. వారికి స్వీడన్ సంస్థ అవార్డును ప్రదానం చేస్తుంది. బాలికల విద్యా హక్కు కోసం ధైర్యంగా, సాహసోపేతంగా పోరాడినందుకు మలాలా పేరును ప్రతిపాదించినట్లు అవార్డుల జ్యూరీ పేర్కొంది. పాక్‌లోని స్వాత్‌లోయలో బాలికలు చదువుకోవడాన్ని తాలిబాన్లు నిషేధించినా, 11 ఏళ్ల వయసులోనే మలాలా విద్యా హక్కు కోసం నినదించిందని తెలిపింది. తాలిబాన్ల ఆదేశాలను ధిక్కరించి మలాలా ధైర్యంగా స్కూలుకెళ్లి.. 15 ఏళ్ల వయసులో(2012లో) కాల్పులకు గురై ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వివరించింది. మలాలాపై హత్యాయత్నం ద్వారా తాలిబాన్లు ఆమె పోరాటాన్ని ప్రపంచవ్యాప్తం చేశారని పేర్కొంది. ప్రస్తుతం మలాలా బ్రిటన్‌లో నివసిస్తున్న సంగతి తెలిసిందే. అవార్డుకు ఎంపికైన మరో ఇద్దరిలో అమరికాకు చెందిన జాన్‌వుడ్ మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం వదులుకుని.. ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల విద్య కోసం 15 ఏళ్లుగా పాటుపడుతున్నారు. ఇక నేపాల్‌కు చెందిన రణంగర్ స్వదేశంలో చిన్నారుల హక్కుల కోసం 20 ఏళ్లుగా ఉద్యమిస్తున్నారు. -
బాలల నోబెల్ కు మలాలా యూసఫ్ జాయ్
స్టాక్‌హోమ్: 'చిల్డ్రన్స్ నోబెల్' బహుమతి ఎప్పుడైనా ఎవరికైనా ప్రదానం చేయడం చూశారా? తాజాగా బాలలకు అందించే చిల్డ్రన్స్ నోబెల్ ప్రైజ్ జాబితాలో పాకిస్తాన్ కు చెందిన బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్ జాయ్ చోటు దక్కించుకుంది. ఈ సంవత్సరానికి అందించే ఈ నోబెల్ పురస్కారానికి అత్యంత ప్రతిభ కనబరిచిన ముగ్గురు బాలలు పోటీపడుతున్నారు. వీరిలో మలాలా కూడా ఒకరు. 11 ఏళ్ల ప్రాయంలో బాలల హక్కులపై పోరాటం జరిపిన మాలాల పేరును నోబెల్ జాబితాలో చేర్చారు. విద్య అనేది బాలల హక్కు అని పోరాడిన మలాలా పై తాలిబన్లు విచక్షణా రహితంగా కాల్పులు జరిపడంతో తీవ్రంగా గాయపడింది. అనంతరం కోలుకున్న ఆమెకు అంతర్జాతీయంగా విశిష్టమైన గుర్తింపు లభించింది. మలాలా ఒక స్పూర్తి ప్రదాత అంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమా సైతం కొనియాడిన సంగతి తెలిసిందే. -
అత్యంత ప్రభావవంతమైన ఏసియన్‌గా మలాలా
లండన్: బ్రిటన్‌లో అత్యంత ప్రభావవంతమైన ఆసియా వ్యక్తిగా పాక్ బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ నిలిచారు. గరావీ గుజరాత్2(జీజీ2) అనే వారపత్రిక రూపొందించిన ‘జీజీ2 పవర్ 101’ జాబితాలో ఆమె మొదటి స్థానంలో నిలిచారు. గురువారం రాత్రి ఇక్కడ జరిగిన జీజీ2 నాయకత్వ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో మలాలాతోపాటు బాలికా విద్య కోసం స్వాత్ లోయలో తాలిబన్ల తూటాలకు ఎదురొడ్డిన కైనాత్ రియాజ్, షాజియా రంజాన్లకు జీజీ2 హ్యామర్ అవార్డులను ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మలాలా హాజరుకాకున్నా.. రికార్డు చేసిన తన సందేశాన్ని పంపించారు. జాబితాలో బ్రిటన్ ఎంపీ కీత్ వాజ్ రెండు, స్టీల్ దిగ్గజం లక్ష్మీ మిట్టల్ మూడు స్థానాల్లో నిలిచారు. -
'టైమ్' మేటి వ్యక్తుల జాబితాలో నరేంద్రమోడీ!
టైమ్ మ్యాగజైన్ రూపొందించిన ఈ సంవత్సరపు మేటి వ్యక్తుల ఎంపిక జాబితాలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి స్థానం దక్కింది. టైమ్ జాబితాలో భారత తరపున స్థానం దక్కించుకున్న ఏకైక నేతగా మోడీ ఘనతను సాధించారు. ఈ ఏటి మేటి వ్యక్తుల కోసం ప్రపంచవ్యాప్తంగా 42 మంది నేతలను, వ్యాపారవేత్తలను, సెలబ్రిటీలను ఎంపిక చేశారు. ఈ జాబితాలో జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, పాకిస్థానీ టీనేజ్ సంచలనం మలాలా యూసఫ్ జాయ్, అమెజాన్ సీఈఓ జెఫ్ బెంజోస్, ఎన్ఎస్ఏ కు చెందిన ఎడ్వార్డ్ స్నోడెన్ లకు స్థానం దక్కింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొంటున్న నేత, హిందుత్వ నాయకుడు అని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడిపై టైమ్ వ్యాఖ్యలు చేసింది. టైమ్ ఎంపిక చేసిన జాబితాలో భారత తరపున మోడీ ఒక్కరికే స్తానం లభించడం విశేషం. ఆన్ లైన్ లో నిర్వహించిన సర్వేలో మోడీకి 2650 పైగా ఓట్లు వచ్చాయని టైమ్ తెలిపింది. ఈ జాబితాలో ఎంపికైన వ్యక్తుల నుంచి విజేతను టైమ్స్ ఎడిటర్స్ ప్రకటిస్తారని తెలిపారు. -
టైమ్స్ జాబితాలో మాలియా, మలాలా
2013 యువ ప్రభావశీలుర జాబితా విడుదల న్యూయార్క్: టైమ్స్ మాగజైన్ రూపొందించిన అత్యంత ప్రభావశీలురైన యువత జాబితా-2013 లోని తొలి 16 మందిలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పెద్ద కుమార్తె మాలియా, పాక్‌లో బాలికల విద్యా హక్కు కోసం ఉద్యమిస్తున్న మలాలా యూసఫ్జాయ్ల పేర్లు చోటుచేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తమ అసాధారణమైన కృషి, అభినివేశాలతో ఉన్నత శిఖరాలు అధిరోహించిన పలువురు యువ గాయకులు, క్రీడాకారులు, శాస్త్ర సాంకేతిక రంగాల్లోని ప్రముఖులతోపాటు అసాధారణ మేధస్సు కనబరచిన బాలలు, యువ రచయితలకు ఈ జాబితాలో స్థానం దక్కింది. విస్తృత జీవితానుభవం కలిగిన పెద్దల మాదిరిగా పరిణతితో, హుందాగా వ్యవహరిం చడంలో మాలియా(15), ఆమె చెల్లెలు సాషా సుప్రసిద్ధులు. పురుష స్వలింగ సంపర్కులకు వివాహ హక్కు కల్పించడం వంటి అనేక అంశాలలో తన కుమార్తెలు తన ఆలోచనలను ప్రభావితం చేశారని ఒబామా తరచూ తన ప్రసంగాల్లో పేర్కొంటూ ఉంటారు. -
క్వీన్ ఎలిజబెత్ ను కలిసిన మలాలా!
తాలిబాన్ ఉగ్రవాదుల తూటాలకు ఎదురొడ్డిన సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్ శుక్రవారం బ్రిటన్ రాణి ఎలిజబెత్ ను బంకింగ్ హమ్ ప్యాలెస్ లో కలిశారు. ఇటీవల తాను రాసిన ఐ యామ్ మలాలా అనే పుస్తకాన్ని క్వీన్ ఎలిజబెత్ కు అందించారు. కామన్ వెల్త్ యూత్ అండ్ ఎడ్యుకేషన్ కోసం ఏర్పాటు చేసిన రిసెప్షన్ కు రావడం తనకు లభించిన గొప్ప గౌరవం అని ఎలిజబెత్ కు మలాలా తెలిపింది. విద్యనభ్యసించడానికి ఎదురైన ఇబ్బందులను ఎలిజబెత్ దృష్టికి తీసుకువచ్చింది. ప్రతి ఒక్కరికి విద్యను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మలాలా అభిప్రాయం పడినట్టు తెలిసింది. -
నియంతలకు నీడ కరువు
బైలైన్ ఎం.జె.అక్బర్ సీనియర్ సంపాదకులు గత వారంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కావాల్సిన పదహారేళ్ల బాలిక మలాలా యూసఫ్‌జాయ్ ఏదో ఒక రోజున పాకిస్థాన్ ప్రధాని కావాలని కోరుకుంటోంది. నోబెల్‌తో పోలిస్తే ఆ రెండోదే ఆమెకు మంచి భవిత. అర్హులైన ప్రముఖులకు... వారు విస్మృతులైన తర్వాత మాత్రమే సాధారణంగా నోబెల్ బహుమతి లభిస్తుంది. అగ్రరాజ్యం కోటాకు ఏ మాత్రం తగ్గకుండా అంతర్జాతీయస్థాయి హింసాకాండకు కారకులైన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గత ఏడాది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత! నోబెల్తోపాటూ ఉండే జయజయ ధ్వానాలు, భారీ నగదు మొత్తమూ మలాలాకు చాలా ఉపయోగపడేవని అనడంలో సందేహం లేదు. ఇక బాగా అమ్ముడుపోయే పతాక శీర్షికల పట్ల ఆత్రుతతో ఉండే మీడియాకు మరింత ఉపయోగపడేవని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఆమె రాజకీయాలను వ్యాపకంగా ఎంచుకోవడమే పాకిస్థాన్‌కు ఉపయోగకరం. సాహస బాలిక మలాలా బస్సులో స్కూలుకు పోతుండగా పాక్‌ను విచ్ఛిన్నం చేస్తున్నవారు ఆమె తలలో తూటాను దించారు. అందుకు తగినట్టే ఆమె అంత మంచి భవితవ్యం కోసం ఎన్నో కలలను కనాల్సి ఉంది. పాక్ తీవ్రవాదుల డీఎన్ఏలో కేంద్ర స్థానంలో ఉన్నది అత్యంత అథమమైన లైంగిక అణచివేత. నిర్హేతుక దురభిమానం లేదా అజ్ఞానం నిండిన కాలానికి వారు దేశాన్ని వెనక్కు తీసుకుపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇస్లాం పూర్వ సంచార తెగల అరేబియా ఎడారులను అలాగే వర్ణించేవారు. ఇస్లాం ఆడ శిశువుల హత్యల వంటి పలు దురాచారాలను నిషేధించి మహిళల హృదయాలను జయించింది. పాక్ తాలిబన్లు గతించిన ఆ ఆరవ శతాబ్దపు అవశేషాలు. వారు ఏ మతానికి అనుయాయులమని చెప్పుకుంటారో ఆ ఇస్లాం ప్రతిష్టకే భంగకరం. అలా అని ఈ వాస్తవం అట్టడుగు వర్గాల్లో వారి ప్రాబల్యం విస్తరించడాన్ని క్షీణింప చేయలేదు. లేదా తాలిబన్‌తో ‘చర్చల ద్వారా పరిష్కారం’ కోరుతూ పాక్ ఉన్నత వర్గాలు గగ్గోలు చేయడాన్ని బలహీనపరచలేదు. తాలిబన్లతో బేరసారాలు సాగించడానికి అసలు ఏం ఉంటుంది? అనే సరళమైన ప్రశ్నను ఎప్పుడో గానీ అడగరు, సమాధానం అసలు ఎన్నడూ చెప్పనే చెప్పరు. ఎవరిని బడితే వారిని హత్య చేయడమే ప్రధాన ఎత్తుగడగా, బహుశా భావజాలపు కేంద్ర సూత్రంగా ఉండే ఒంటెత్తువాదులతో చర్చలకు అజెండా ఏమిటి? నాజూకైన మాటల మాటున తాలిబన్లు, వారి ప్రాపకందార్లు తమ అధికార వాంఛను కప్పిపుచ్చుకోలేరు. పాక్ రాజకీయ వేత్తలు వారికి ఇవ్వజూపాల్సింది అదేగా? సింధ్ వాయవ్య ప్రాంతాల్లో అధికార భాగస్వామ్యం ఇచ్చి వారిని సంతృప్తి పరచాలని ఎవరైనా కోరుకుంటారా? అప్పుడే వారి ప్రభావం ప్రమాదకర స్థాయిలో చట్టాల్లోకి చొరబడిపోయింది. కొన్ని మసీదులు, ప్రదర్శనల నుంచి బహిరంగ ప్రదేశాల్లో మారుమోగే వారి ఉన్మత్త ప్రేలాపనలను ఎవరూ నిరోధించలేరు. పోనీ వారిని డబ్బుతో కొనడం సాధ్యమా? బహుశా అసంభవం. అంతర్గత, బహిర్గత వనరుల ద్వారా లభిస్తున్న నిధులు తగినన్ని వారికి ఉన్నాయి. ఉన్న అత్యంత సున్నితమైన సమస్య ఇది: పాక్ కోవర్టు ప్రయోజనాలకు అనుగుణంగా అఫ్ఘానిస్థాన్ లేదా భారత్ వంటి ప్రాంతాలపైకి మాత్రమే తమ తుపాకులను ఎక్కుపెట్టి, పెషావర్, క్వెట్టాల వంటి పాక్ నగరాలను సురక్షితంగా వదిలివేయడానికి వారు ఎన్నటికైనా అంగీకరిస్తారా? ఇబ్బందికరమైన వాస్తవాలు అవి అసలు లేనే లేవన్నట్టు న టించడం ద్వారా అంతరించిపోవు. మలాలా ఇప్పుడు బ్రిటిష్ స్కూల్లో చదువుకుంటోందంటే అది తాలిబన్ల కారణంగానే. ప్రజలు ఎన్నుకున్న పదవి ద్వారా ఆమె వారి కబంద హస్తాల పట్టును సవాలు చేయాలని ఆశిస్తోంది. తమ దేశ స్వస్థతకు వారు ఎంత ముప్పో ఆమె గ్రహించింది. మలాలా కౌమారంలో ఉన్నది. కలలు కనడానికి ఆమెకు సకల హక్కులూ ఉన్నాయి. ప్రత్యేకించి ఆమెకిది రెండో జన్మ కాబట్టి ఆ హక్కు మరింత ఎక్కువగా ఉంటుంది. ఊగుతూ, తూగుతూ గమ్యం లేకుండా సాగే జనరల్ ముష్రాఫ్ లాంటి డైబ్బయ్యేళ్ల ముసలోడి అభూత కాల్పనికతల కంటే ఆమె కలలు ఖచ్చితంగా మరింత అర్థవంతమైనవై ఉంటాయి. ముష్రాఫ్ అలసిపోయినమాట నిజమే, అయినా ఎన్నటికీ రాజకీయ విరమణ చేయరు. దేశ ‘రక్షకుని’ వేషం గట్టి అధికారం కోసం వెంపర్లాడటానికి బదులు ఆయన దుబాయ్ లేదా ఆమెరికా లేదా ఇంకెక్కడ మరిన్ని ఎక్కువ డాలర్లను రాబట్టుకోగలిగితే అక్కడికి తప్పించుకు పోగలరు, బహుశా తప్పించుకు పోవచ్చు కూడా. ఇతరత్రా పలు విధాలుగా వెనుకడుగు వేసినా పాక్ చాలా విధాలుగా ఆయనను దాటి ముందుకు వెళ్లిపోయింది. అది ఇక ఎంత మాత్రమూ పాత నియంతలకు పట్టం కట్టే దేశం కాదు. పాక్‌ను నిజంగానే ‘రక్షించాల్సి’ ఉంటే, అది ఆయన కంటే చాలా చిన్నవారైన యువతీయువకులు పదవుల్లో ఉండే దేశం కావాల్సి ఉంటుంది. ఇటీవలి చరిత్ర భారాన్ని మోయాల్సిన అవసరం లేని కొత్త నాయకుల బృందం అందుకు కావాలి. మలాలా తిరిగి స్వస్థలానికి తిరిగి రాగలిగిన దేశం కావాలి. మలాలాకు ఇప్పుడు విద్య, భవిష్యత్తులతో పాటూ ప్రశంసాపూర్వకమైన బ్రిటన్ మీడియా ఆసక్తి కూడా ఉంది. ఆమె శ్రేయోభిలాషులకు మించి ఆ ఆసక్తే ఆమెకు నోబెల్ శాంతి బహుమతి లభిస్తుందన్న అంచనాలను రేకెత్తింపజేసింది. మలాలాకు ఈ వయసులో ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి. అయినాగానీ ఆమె బ్రిటన్‌లో గాక పాక్‌లో శాంతిని నెలకొల్పాలని కోరుకుంటోంది. బ్రాడ్ఫోర్డ్ లేదా బ్రిమింగ్‌హామ్ యువతి కావాలని గాక లాహోర్ లేదా పెషావర్ యువతి కావాలని కోరుకుంటోంది. అక్కడి వీధుల్లో రాజ్యమేలే స్త్రీ ద్వేషం, మతోన్మాదాలను సవాలు చేయాలని భావిస్తోంది. ఆమె లక్ష్య సాఫల్యతను పొందే అవకాశాలు ఎలా ఉన్నాయి? నిజాయితీగా చెప్పాలంటే ఏమంత బాగా లేవు. ఉద్రిక్తతల అంచున నిలిచి ఉన్న దేశంలో నవాజ్ షరీఫ్ ప్రశాంతతను నెలకొల్పగలరని, మానసిక శాంతి భగ్నమైన వోటర్లు విశ్వసించారు. అందుకే సుస్థిర ప్రభుత్వానికి ప్రధానిని చేశారు. ఇంతవరకు అయితే నవాజ్ గమ్యం లేకుండా మెల్లగా పెళ్లి నడక సాగిస్తున్నారు. అయినా ఆయనకు ఇంకా సమయం ఉంది. షరీఫ్ విఫలమైతే మాత్రం మలాలా ఆమె తరం మరో ప్రశ్నను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరైనా గానీ ఏమైనా చేయగలిగేది ఉన్నదా? ఆ బాలిక దాదాపుగా ప్రాణాలను కోల్పోయినా, ఆశను మాత్రం ఎన్నడూ వీడలేదు. నిరాశావహమైన సలహాలు ఆమెకు అక్కర్లేదు. కలలు తప్పనిసరిగా నిజం కావాలని ఏమీ లేదు. ఎందరికి మాత్రం మరో జన్మ లభిస్తుందని? -
'మలాలా' దేశ గౌరవానికి ప్రతీక : నవాజ్ షరీఫ్
మలాలా యుసఫ్‌జాయ్ పాకిస్థాన్ దేశ గౌరవానికి ప్రతీక అని ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ అభివర్ణించారు. శనివారం ఇస్లామాబాద్‌లో డైలీ టైమ్స్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఐరోపా పార్లమెంట్ మానవ హక్కుల కోసం కృషి చేసినవారికి అందించే షకరోవా పురస్కారానికి మలాలా ఎంపిక కావడం పట్ల విలేకర్లు అడిగిన ప్రశ్నకు నవాజ్ షరీఫ్‌పై విధంగా స్పందించారు. ఈ సందర్బంగా మలాలాను నవాజ్ షరీఫ్ పొగడ్తలతో ముంచెత్తారు. తమ దేశానికి మలాలా ఓ అణిముత్యమని పేర్కొన్నారు. యువతరానికి, రాబోయే తరాలకు స్ఫూర్తి అని తెలిపారు. ఆమెను చూసి దేశం గర్విస్తుందని చెప్పారు. పాక్‌లో బాలికల విద్య కోసం ఆమె చేస్తున్న పోరాటంపై ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తుందన్నారు. అయితే ప్రస్తుతం యూఎస్‌లో ఉన్న మలాలా ఆ దేశాధ్యక్షుడు ఒబామా ఆయన భార్య మిషెల్‌తో భేటీ అయింది. ఈ సందర్భంగా మలాలాను ఒబామా దంపతులు ఘనంగా సత్కరించారు. పాక్‌లో బాలికల విద్య కోసం ఎదురైన అడ్డంకులను అధిగమిస్తూ ఆమె చేస్తున్న పోరాటాన్ని ఒబామా దంపతులు ఈ సందర్భంగా కొనియాడారు. పాక్‌లో చిన్నారి బాలికల విద్య కోసం తాలిబన్లను సైతం ఎదురించింది. ఆ క్రమంలో తాలిబన్ల కాల్పుల్లో తీవ్రంగా గాయపడింది. మెరుగైన వైద్య చికిత్స కోసం పాక్ ప్రభుత్వం మలాలాను బ్రిటన్‌కు తరలించింది. అక్కడ మలాలా ఆరోగ్యం కుదుటపడింది. మలాలాతోపాటు ఆమె తండ్రి బ్రిటన్‌లో నివసిస్తున్న సంగతి తెలిసిందే. -
మలాలా ప్రతి ఒక్కరికి స్పూర్తిమంతం:ఒబామా
పాకిస్థాన్‌లో బాలిక విద్య కోసం పోరాడుతున్న మలాలా యుసఫ్‌జాయ్ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిమంతమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కొనియాడారు. బాలికల విద్యా హక్కు కోసం చేస్తున్న పోరాటంలో యూఎస్‌తోపాటు ప్రపంచంమంతా మలాలాకు అండా నిలుస్తామని ఒబామా పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌లో శుక్రవారం ఒబామా దంపతులతో మలాలా భేటీ అయింది. ఈ సందర్భంగా ఒబామా దంపతులు మాలాలాను ఘనంగా సత్కరించారు. అనంతరం వైట్ హౌస్ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ఒబామా దంపతులతో భేటీ అనంతరం మలాలా మీడియాతో మాట్లాడుతూ... పాకిస్థాన్‌లో చిన్నారుల విద్య కోసం అమెరికా అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివని అన్నారు. అలాగే అఫ్ఘాన్‌లో పునర్ నిర్మాణంతోపాటు సిరియా శరణార్థులును అదుకోవడంలో యూఎస్ చేస్తున్న కృషి అద్భుతమని మలాలా పేర్కొన్నారు. -
పాక్ ప్రధాని కావాలని ఉంది: మలాలా
న్యూయార్క్: తాలిబన్ల కాల్పుల్లో గాయపడి కోలుకున్న పాక్ బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్(16) పాక్‌కు ప్రధాని కావాలని కోరుకుంటున్నానని చెప్పింది. తన ఆదర్శ నాయకురాలైన దివంగత ప్రధాని బేనజీర్ భుట్టో అడుగుజాడల్లో నడచి దేశానికి సేవ చేయాలని ఉందని సీఎన్ఎన్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ‘ఇదివరకు డాక్టర్‌ను కావాలనుకున్నాను. అయితే ఇప్పుడు రాజకీయాల్లో చేరాలనుకుంటున్నాను. రాజకీయాల్లోకి వెళ్తే దేశానికే డాక్టర్ కావచ్చు. ప్రధాని అయితే బడ్జెట్ నుంచి పిల్లల విద్య కోసం ఎక్కువ నిధులు ఖర్చు చేయొచ్చు’ అని చెప్పింది. మలాలా పుస్తకాన్ని అమ్మొద్దు: తాలిబన్లు ఇస్లామాబాద్: మలాలా తన జీవితానుభవాలతో రాసిన ‘ఐ యామ్ మలాలా’ పుస్తకాన్ని అమ్మకూడదని పాక్ తాలిబన్లు వ్యాపారులను హెచ్చరించారు. మలాలా లౌకికవాదం కోసం మతాన్ని వదులుకుందని, అందుకే ఆమెకు అవార్డులు ఇస్తున్నారని తాలిబన్ల ప్రతినిధి షహీదుల్లా షాహిద్ ఆరోపించాడు. మలాలా నిజానికి ఎలాంటి సాహసమూ చేయలేదని, ఆమె పుస్తకాన్ని అమ్మితే శిక్షిస్తామని హెచ్చరించాడు. -
మలాలా 'మనసులో మాట'
-
మలాలా 'మనసులో మాట'
పాకిస్థాన్‌లో బాలికల విద్య కోసం తాలిబాన్ల తుపాకీ గుళ్లకు సైతం ఎదురు నిలిచిన ప్రపంచ వ్యాప్తంగా పలువురి మన్ననలు అందుకున్న మలాలా యూసఫ్ జాయ్ గురువారం తన మనసులోని మాటను బయట పెట్టారు. తనకు పాకిస్థాన్ ప్రధాని పీఠం అధిష్టించాలని ఉందని తెలిపారు. గురువారం న్యూయార్క్‌లో ఆహ్వానితులను ఉద్దేశించి ప్రసంగిస్తూ...పాక్ ప్రధాని అయితే దేశాన్ని రక్షించ వచ్చన్నారు. అలాగే విద్యా రంగానికి అధిక నిధులు కేటాయించ వచ్చని తెలిపారు. దానితోపాటు విదేశీ వ్యవహారాలపై కేంద్రీకరించ వచ్చని చెప్పారు. గతంలో పాకిస్థాన్‌లోని స్వాత్ ప్రాంతంలో మింగొర్కు చెందిన మలాలాతోపాటు పాఠశాలకు వెళ్తున్న విద్యార్థుల బస్సుపై తాలిబన్లు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో మలాలా తలకు తీవ్ర గాయమైంది. దాంతో ఆమెను ప్రత్యేక వైద్య చికిత్స కోసం బ్రిటన్ తరలించారు. అక్కడ మలాలా ఆరోగ్యం కుదుటపడింది. మలాలా బ్రిటన్‌లో ఉంటూ పాకిస్థాన్‌లో తాలిబన్ల అనుసరిస్తున్న వైఖరితోపాటు బాలికల విద్యపై వారి అవలంభిస్తున్న చర్యలను ప్రచారం ద్వారా ఎండగడుతోంది. మనవ హక్కుల కోసం పోరాడే వారికి ఐరోపా యూనియన్ పార్లమెంట్ అందించే షకరోవా ప్రతిష్టాత్మక పురస్కారానికి మలాలా గురువారం ఎంపికైన విషయం తెలిసిందే. -
మలాలాకు ఈయూ ప్రతిష్టాత్మక అవార్డు
లండన్: పాకిస్థాన్‌కు చెందిన బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్జాయ్కు ప్రతిష్టాత్మక ఐరోపా పార్లమెంటు(ఈయూ) అవార్డు దక్కింది. తాలిబన్లకు ఎదురొడ్డి బాలికల విద్య కోసం ఆమె చేస్తున్న వీరోచిత పోరాటానికిగాను ఈయూలో ఉన్నతస్థాయి అవార్డుగా భావించే ‘సఖరోవ్’ మానవ హక్కుల పురస్కారాన్ని ఆమెకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈయూ అధ్యక్షుడు మార్టిన్ ష్లూజ్ గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు. మలాలాలోని అద్భుత సామర్థ్యాన్ని ఐరోపా పార్లమెంటు గుర్తించిందని అన్నారు. ‘‘పిల్లలందరికీ చదువుకొనే హక్కు ఉందని, అది వారికి దక్కాల్సిందేనని మలాలా ధైర్యంగా పోరాడింది. బాలికల విషయంలో ఈ హక్కును సాధారణంగానే నిర్లక్ష్యం చేస్తున్నారు’’ అని పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో బాలల హక్కుల కోసం పోరాడుతున్న నేపథ్యంలో 16 ఏళ్ల మలాలాపై గతేడాది తాలిబన్లు దాడిచేశారు. దీంతో మరణం అంచుల దాకా వెళ్లి ఆమె ఎట్టకేలకు బతికి బట్టకట్టింది. ప్రస్తుతం మలాలా నోబెల్ శాంతి బహుమతి రేసులో కూడా ఉంది. సఖరోవ్ అవార్డు కింద మలాలాకు 65 వేల డాలర్లు(దాదాపు రూ.40 లక్షలు) ఇవ్వనున్నారు.