అక్షర సాహసికి మరో అరుదైన గౌరవం | Malala Yousafzai to address Canada Parliament | Sakshi
Sakshi News home page

అక్షర సాహసికి మరో అరుదైన గౌరవం

Published Tue, Apr 4 2017 3:25 PM | Last Updated on Tue, Aug 27 2019 4:33 PM

అక్షర సాహసికి మరో అరుదైన గౌరవం - Sakshi

అక్షర సాహసికి మరో అరుదైన గౌరవం

కెనడా: పాకిస్థాన్‌ అక్షర సాహసి, బాలికల విద్యాహక్కుల పోరాట యోధురాలు, అతి పిన్న వయసులోనే నోబెల్‌ శాంతి బహుమతిని అందుకున్న మలాలా యూసఫ్‌జాయ్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. కెనడా పార్లమెంటులో ఆమె ప్రసంగించనుంది. తమ దేశ పార్లమెంటులో మలాలా ప్రసంగించనుందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడు స్వయంగా ప్రకటించారు. దాంతోపాటు ఆరోజు గౌరవ పూర్వకమైన సిటిజన్‌షిప్‌ కూడా అందించనున్నట్లు తెలిపారు.

ఏప్రిల్‌ 12న కెనడాను 19 ఏళ్ల మలాలా సందర్శించనుందని, తమ పార్లమెంటులో ప్రసంగించనున్న అతి పిన్న వయస్కురాలు మలాలా కానుందని చెప్పారు. మలాలా 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తాలిబన్ల కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. స్కూలు నుంచి తిరిగొస్తున్న ఆమెపై బాలికల విద్యను ప్రోత్సహిస్తుందనే కారణంతో కాల్పులు జరపగా అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. తొలుత పాక్‌లోనే చికిత్స జరిగినా తర్వాత మాత్రం బ్రిటన్‌కు తరలించి అక్కడే పూర్తిగా కోలుకునేలా చేశారు. 2014 మలాలా నోబెల్‌ అవార్డు అందుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement