Malala Yousafzai: మలాలా భర్త అస్సర్‌ ఎవరో తెలుసా | Do You Know Who Is Malala Yousafzai Husband Asser Malik | Sakshi
Sakshi News home page

Asser Malik: మలాలా భర్త అస్సర్‌ ఎవరో తెలుసా

Published Wed, Nov 10 2021 7:07 PM | Last Updated on Wed, Nov 10 2021 8:21 PM

Do You Know Who Is Malala Yousafzai Husband Asser Malik - Sakshi

బ్రిటన్‌: నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ బుధవారం వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ నగరంలోని తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య అస్సర్‌ మాలిక్‌తో నిఖా వేడుక జరిగినట్లు పేర్కొన్నారు. ఇద్దరం కలిసి భార్యభర్తలుగా కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నామని, ఇందుకు అందరి ఆశీస్సులు కావాలని మలాలా ఒక ట్వీట్‌లో తెలిపారు. అయితే మలాలా పెళ్లి తర్వాత ఆమె భర్త అస్సర్‌ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆయనఎవరనే విషయం ఎక్కువగా నెటిజన్లు సెర్చ్‌ చేస్తున్నారు.
చదవండి: Malala Yousafzai Married: పెళ్లి చేసుకున్న మలాల.. ఫోటోలు వైరల్‌

అస్సర్‌ మాలిక్‌​ ఎవరంటే..
పాకిస్తాన్‌కు చెందిన అస్సర్‌ మాలిక్‌ ఒక ఎంట్రప్రెన్యూర్. అస్సర్‌ మాలిక్ లాహోర్‌లోని టుచిన్సన్ కాలేజీ నుంచి విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. అనంతరం లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. ఇక అస్సర్‌కు క్రీడా విభాగంతో మంచి అనుబంధం ఉంది. 2020లో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డులో చేరిన అస్సర్‌.. ప్రస్తుతం పీసీబీ హై పర్ఫార్మెన్స్‌ జనరల్‌ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తు‍న్నారు. దీంతో పాటు పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌) ఫ్రాంచైజీ ముల్తాన్ సుల్తాన్స్‌కు ప్లేయర్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement