
బాలల నోబెల్ కు మలాలా యూసఫ్ జాయ్
స్టాక్హోమ్: 'చిల్డ్రన్స్ నోబెల్' బహుమతి ఎప్పుడైనా ఎవరికైనా ప్రదానం చేయడం చూశారా? తాజాగా బాలలకు అందించే చిల్డ్రన్స్ నోబెల్ ప్రైజ్ జాబితాలో పాకిస్తాన్ కు చెందిన బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్ జాయ్ చోటు దక్కించుకుంది. ఈ సంవత్సరానికి అందించే ఈ నోబెల్ పురస్కారానికి అత్యంత ప్రతిభ కనబరిచిన ముగ్గురు బాలలు పోటీపడుతున్నారు. వీరిలో మలాలా కూడా ఒకరు. 11 ఏళ్ల ప్రాయంలో బాలల హక్కులపై పోరాటం జరిపిన మాలాల పేరును నోబెల్ జాబితాలో చేర్చారు.
విద్య అనేది బాలల హక్కు అని పోరాడిన మలాలా పై తాలిబన్లు విచక్షణా రహితంగా కాల్పులు జరిపడంతో తీవ్రంగా గాయపడింది. అనంతరం కోలుకున్న ఆమెకు అంతర్జాతీయంగా విశిష్టమైన గుర్తింపు లభించింది. మలాలా ఒక స్పూర్తి ప్రదాత అంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమా సైతం కొనియాడిన సంగతి తెలిసిందే.