మలాలాను కలుసుకోవాలనుంది: బీబర్
లాస్ ఎంజెలెస్: తాలిబాన్ కాల్పుల్లో గాయపడిన మలాలా యూసఫ్ జాయ్ ని కలుసుకునేందుకు పాప్ సెన్సేషన్ జస్టిన్ బీబర్ తహతహలాడుతున్నారు. మలాలా స్థాపించిన ఫౌండేషన్ కు సహాయం అందించాలనుకుంటున్నానని బీబర్ వెల్లడించారు. పాకిస్థాన్ లో బాలికలకు విద్యాహక్కు కల్పించాలని ప్రచారం చేసిన మలాలాపై తాలిబాన్ ఉగ్రవాదులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. కాల్పుల గాయపడిన మలాలా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే.
కాల్పుల గాయాల నుంచి కోలుకున్న మలాలా... మహిళలకు విద్యహక్కును కల్పించాలనే ఆశయంతో మలాలా ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. ఇటీవల మలాలాతో బీబర్ వీడియో చాటింగ్ చేశాడు. వీడియో చాటింగ్ వివరాలను యూఎస్ లోని ప్రముఖ వెబ్ సైట్ కు అందించాడు. మలాలా ఫౌండేషన్ కు సహాయం చేయాలని ఉంది. మలాలా జీవితం స్పూర్తిదాయకమైంది. మలాలాను కలుసుకోవడానికి అతృతగా ఉంది అని ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు.