
'పాకిస్తానీ, భారతీయుడు కలసి పనిచేయగలరు'
న్యూఢిల్లీ: ఒక పాకిస్థానీ, ఒక భారతీయుడు కలసి పనిచేయగలరని పాక్ ధీర బాలిక, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ అన్నారు. ప్రముఖ భారత బాలల హక్కుల కార్యకర్త కైలాస్ సత్యార్థితో కలసి నోబెల్ బహుమతి అందుకోవడం గర్వకారణంగా ఉందని మలాలా చెప్పారు. నార్వే రాజధాని ఓస్లోలో బుధవారం జరిగిన కార్యక్రమంలో మలాలా, సత్యార్థి సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించారు.
అనంతరం మలాలా ప్రసంగిస్తూ తల్లిదండ్రులకు, గురువులకు, స్నేహితులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆంక్షలు విధించకుండా స్వేచ్ఛగా ఎదగనిచ్చినందుకు తన తండ్రికి కృతజ్ఞతలు చెప్పారు. బాలల హక్కుల కోసం జాలి చూపకుండా, వారి కోసం పోరాడాలాని మలాలా కోరారు.