అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుల వేడుక జరిగింది. అత్యంత భారీ ఖర్చుతో ఈ వేడుకను ఆస్కార్ అకాడమీ నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఈవెంట్‌లో అందరినీ దృష్టిని ఆకర్షించించింది మాత్రం పాకిస్తాన్‌కు చెందిన మలాలా యూజఫ్‌జాయ్. తన భర్త అస్సర్ మాలిక్‌తో కలిసి వేదికపై మెరిసింది. ఇంతకీ ఈ వేడుకకు ఆమె ఎందుకొచ్చింది? అనే ప్రశ్న సినీ ప్రేక్షకుల్లో తలెత్తింది. మలాలాకు ఇప్పటికే నోబెల్ బహుమతి వచ్చిన సంగతి తెలిసిందే.
మహిళల విద్యకోసం కృషి చేస్తున్న మలాలా విశ్వవేదికపై కనిపించడం చర్చనీయాంశంగా మారింది. మహిళా విద్యా కార్యకర్త అయిన ఆమె ఆస్కార్స్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీకి ఎంపికైన 'స్ట్రేంజర్ ఎట్ ది గేట్' అనే షార్ట్ ఫిల్మ్‌కు ఆమె ఎగ్జిక్యూటివ్ నిర్మాత కావడమే కారణం. అందుకే వారికి మద్దతుగా ఆస్కార్ వేడుకలకు హాజరైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది టాలీవుడ్ మూవీకి ఆస్కార్ రావడంతో సినీ ప్రేక్షకులు సంబురాలు చేసుకుంటున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment