
లండన్: ఐసీసీ వన్డే క్రికెట్ ప్రపంచకప్ 2019 ప్రారంభవేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆతిథ్య ఇంగ్లండ్ సంప్రదాయం ఉట్టిపడేలా పలు కార్యక్రమాలను టోర్నీ నిర్వాహకులు నిర్వహించారు. ఈ ప్రారంభ వేడుకలకు అన్ని దేశాల ప్రముఖులు, క్రికెటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ‘60 సెకన్ల చాలెంజ్’ గల్లీ క్రికెట్ ఆడారు. అయితే పాకిస్తాన్ తరుపున ఈ వేడుకల్లో పాల్గొన్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, పాకీస్తానీ యువతి మలాలా యూసఫ్ జాయ్ భారత్‌ను తక్కువ చేసి మాట్లాడారు.
ఈ చాలెంజ్‌లో టీమిండియా తరుపున ఆడిన మాజీ కోచ్ అనిల్ కుంబ్లే, బాలీవుడ్ నటుడు ఫరాన్ అఖ్తర్‌లు అన్ని జట్ల కన్నా తక్కువ పరుగులు(19) సాధించారు. దీంతో చివరి స్థానంలో నిలిచారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ తరుపున బ్యాటింగ్ చేసిన బ్యాట్స్‌మెన్ 38 పరుగులు చేశారు. ఇక మ్యాచ్‌ల అనంతరం పాక్ ప్రదర్శన గురించి మాట్లాడుతూ..‘పాక్ మరీ అంత దారుణంగా ఆడలేదు. టీమిండియా మాదిరి చివరి స్థానంలో మా జట్టు లేదు. కానీ భారత్ మంచిగా ఆడింది’అంటూ ఎద్దేవా చేశారు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత్‌పై మలాలా స్పందించిన తీరుపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయినా ఆమె పాకిస్తానీ పౌరురాలే కదా.. అందుకే భారత్‌పై అక్కసును వెల్లగక్కింది’, ‘మలాలా, పాక్‌లో నీ పోరాటానికి ఫిదా అయ్యాము.. కానీ ఈ వ్యాఖ్యలతో నువ్వంటే ఏంటో తెలిసిపోయింది’అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment