గాజాలోని స్కూళ్లకు మలాలా చేయూత | Malala Yousafzai donates USD 50,000 to re-build UN schools in Gaza | Sakshi
Sakshi News home page

గాజాలోని స్కూళ్లకు మలాలా చేయూత

Published Thu, Oct 30 2014 10:59 AM | Last Updated on Sat, Sep 2 2017 3:37 PM

గాజాలోని స్కూళ్లకు మలాలా చేయూత

గాజాలోని స్కూళ్లకు మలాలా చేయూత

లండన్: గాజాలోని దెబ్బతిన్న స్కూళ్లకు పాక్ బాలల హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ చేయూతనందించారు. గత కొన్ని రోజుల క్రితం ప్రపంచ బాలల నోబెల్ అవార్డుకు (వరల్డ్ చిల్ట్రన్స్ ప్రైజ్)ఎంపికైన మలాలా.. ఆ బహుమతి ద్వారా వచ్చిన 50 వేల యూస్ డాలర్లను అక్కడి స్కూళ్లను పునరుద్ధరించేందుకు ఇచ్చారు. ఈ మధ్య కాలంలో గాజాపై ఇజ్రాయిల్ దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో గాజాలో స్కూళ్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. బహుమతి కింది అందే  మొత్తాన్ని ఆమె బాలల సంక్షేమం కోసం వినియోగించాల్సి ఉన్నందున ఆమె గాజాలో స్కూళ్లకు విరాళంగా అందజేశారు.

 

ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. నాణ్యమైన విద్యకు ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఒకవేళ అక్కడ విద్య లేకుంటే ఎప్పటికీ శాంతి అనేది ఉండదు' అని పేర్కొంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement