కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం.. మరికొన్ని రాష్ట్రాలకు విస్తరించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలనైన మధ్యప్రదేశ్, పుదుచ్చేరిలోనూ ‘హిజాబ్’పైనా చర్చ మొదలైంది. మతసామరస్యం పాటించాలని చెబుతూనే శాంతి భద్రతలను పరిరక్షించుకోవాలని, ఒకే తరహా యూనిఫామ్‌లకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిదని ఓవైపు కర్ణాటక హైకోర్టు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ వ్యవహారం మరింత ముదురుతుందే తప్పా.. చల్లారడం లేదు.
ఈ క్రమంలో హిజాబ్ వివాదం ఇప్పుడు గ్లోబల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. దీంతో ఉద్యమకారిణి, నోబెల్ గ్రహీత మలాలా స్పందించారు. బాలికలను హిజాబ్‌లో పాఠశాలకు వెళ్లనివ్వాలని మలాలా భారతీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తోంది.
యూసఫ్‌జాయ్ ట్వీట్లో.. ‘చదువు, హిజాబ్‌లో ఏది ఎంచుకోవాలో కళాశాల మమ్మల్ని బలవంతం చేస్తోంది’ అంటూ విద్యార్థిణిలు ఆవేదనను ట్వీట్ చేసిన ఆమె.. ఆపై భారతీయ నేతలకు విజ్ఞప్తి చేశారు.
‘బాలికలు తమ హిజాబ్‌లో పాఠశాలకు వెళ్లడానికి నిరాకరించడం భయానకంగా ఉందని వ్యాఖ్యానించారామె. ఆడపిల్లలను హిజాబ్‌లు ధరించి పాఠశాలకు వెళ్లనివ్వకపోవడం దారుణం. భారత నాయకులు ముస్లిం మహిళలను చిన్నచూపు చూడటం ఆపాలి’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.
“College is forcing us to choose between studies and the hijab”.
— Malala (@Malala) February 8, 2022
Refusing to let girls go to school in their hijabs is horrifying. Objectification of women persists — for wearing less or more. Indian leaders must stop the marginalisation of Muslim women. https://t.co/UGfuLWAR8I
ఇదిలా ఉంటే హిజాబ్ ధరించిన ఆడపిల్లలను క్లాస్ రూంల్లోకి రైట్ వింగ్ గ్రూపులు అనుమతించకపోవడంతో మొదలైన వివాదం.. పోటాపోటీగా కాషాయపు కండువాలతో ర్యాలీలు చేపట్టడంతో మరింత ముదిరింది. ఈ తరుణంలో కర్ణాటక ప్రభుత్వం, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సైతం సామరస్యం పాటిస్తూ.. శాంతి భద్రతలు పాటించాలని పిలుపు ఇస్తున్నాయి. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ హిజాబ్ అభ్యంతరం గళం వినిపిస్తోంది. మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మర్.. హిజాబ్ యూనిఫామ్‌లో భాగం కాదని, క్రమశిక్షణ ముఖ్యమంటూ వ్యాఖ్యలు చేశారు.
సంబంధిత వార్త: హిజాబ్ వ్యవహారం.. మూడు రోజులు అక్కడ విద్యాసంస్థలు బంద్
Comments
Please login to add a commentAdd a comment