
మలాలా ప్రతి ఒక్కరికి స్పూర్తిమంతం:ఒబామా
పాకిస్థాన్లో బాలిక విద్య కోసం పోరాడుతున్న మలాలా యుసఫ్జాయ్ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిమంతమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కొనియాడారు. బాలికల విద్యా హక్కు కోసం చేస్తున్న పోరాటంలో యూఎస్తోపాటు ప్రపంచంమంతా మలాలాకు అండా నిలుస్తామని ఒబామా పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్లో శుక్రవారం ఒబామా దంపతులతో మలాలా భేటీ అయింది. ఈ సందర్భంగా ఒబామా దంపతులు మాలాలాను ఘనంగా సత్కరించారు. అనంతరం వైట్ హౌస్ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఒబామా దంపతులతో భేటీ అనంతరం మలాలా మీడియాతో మాట్లాడుతూ... పాకిస్థాన్లో చిన్నారుల విద్య కోసం అమెరికా అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివని అన్నారు. అలాగే అఫ్ఘాన్లో పునర్ నిర్మాణంతోపాటు సిరియా శరణార్థులును అదుకోవడంలో యూఎస్ చేస్తున్న కృషి అద్భుతమని మలాలా పేర్కొన్నారు.