
మలాలాపై దాడి చేసిన ఉగ్రవాదుల అరెస్ట్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ బాలికల విద్యాహక్కు కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్‌ని హత్యచేసేందు కు ఆమె తలపై కాల్పులు జరిపిన పది మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు ఆ దేశ ఆర్మీ తెలిపింది. ఉగ్రవాదులపై దాడిలో భాగంగా పోలీసు లు, నిఘా సంస్థలు, సైన్యం జరిపిన ఆపరేషన్‌లో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు మేజర్ జనర్ అసీమ్ బాజ్వా శుక్రవారం వెల్లడించారు.