నా కూతుర్ని కుక్కపిల్ల కరిచింది: హీరోయిన్‌ | Twinkle Khanna Reveals Pet Dog Bitten Nitara on both hands | Sakshi
Sakshi News home page

Twinkle Khanna: పండగ రోజే శునకం నా కూతురి రెండు చేతుల్ని కరిచింది..

Published Mon, Jan 29 2024 4:23 PM | Last Updated on Mon, Jan 29 2024 4:57 PM

Twinkle Khanna Reveals Pet Dog Bitten Nitara on both hands - Sakshi

ఒకప్పుడు బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది ట్వింకిల్‌ ఖన్నా. తెలుగులోనూ ఓ సినిమా చేసింది. వెంకటేశ్‌ హీరోగా నటించిన శీను మూవీలో యాక్ట్‌ చేసింది. ఎప్పుడైతే బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ను పెళ్లాడిందో అప్పుడే సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. నటిగా మళ్లీ పూర్తిస్థాయిలో వెండితెరపై కనిపించలేదు. 2010లో వచ్చిన తీస్‌మార్‌ ఖాన్‌లో మాత్రం అతిథి పాత్రలో మెరిసింది. నటనకు దూరమైనా నిర్మాతగా కొన్ని చిత్రాలు తెరకెక్కించింది. అనంతరం రచయిత్రిగానూ మారి పుస్తకాలు రాసింది.

కుక్క కరిచింది..
ఇక అక్షయ్‌-ట్వింకిల్‌ దంపతులకు కుమారుడు ఆరవ్‌(21), కూతురు నితార(11) సంతానం. ఈ మధ్య తన కూతురికి కుక్క కరిచిందని చెప్పుకొచ్చింది ట్వింకిల్‌. 'క్రిస్‌మస్‌ రోజు ఎవరో అనుకోకుండా మా కుక్కపిల్ల ఫ్రెడ్డీ కోసం ప్లేటులో చికెన్‌ పెట్టి అది మా పిల్లల ముందు పెట్టారు. అది చూసిన ఫ్రెడ్డీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ముక్కల్ని కొరకడం ‍ప్రారంభించింది. అయితే ఆ చికెన్‌ ముక్కలు వెదురు పుల్లలకు తగిలించి ఉన్నాయి. అవి ఎక్కడ కుక్క గొంతులో ఇరుక్కుపోతాయో, అలాగే మింగేస్తే దానికి హాని కలుగుతుందేమోనన్న భయంతో నా కూతురు వాటిని దాని నోటిలో నుంచి తీయడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో కుక్క తన చేతుల్ని కొరికింది.

ఏం కాదులే అని శునకాన్ని వెనకేసుకొచ్చింది
వెంటనే తనకు రేబిస్‌, టెటానస్‌ ఇంజక్షన్స్‌ వేయించాను. అయినా తనేమాత్రం భయపడలేదు, బాధపడలేదు. పైగా ఫ్రెడ్డీని వెనకేసుకొచ్చింది. ఇది అనుకోకుండా జరిగిపోయిందిలే.. అదేం కావాలని కరవలేదు.. ఫ్రెడ్డీకి బాగుంటే అంతే చాలని చెప్పింది. ఒకవేళ నేను పొరపాటున తన వేళ్లను కట్‌ చేసినా, అనుకోకుండా గాయపర్చినా నామీద ఎన్ని నిందారోపణలు వచ్చేవో! ఇప్పుడే కాదు ఇంకో 20 ఏళ్ల తర్వాత కూడా దాని గురించి సీరియస్‌గా మాట్లాడుకునేవారు' అని అభిప్రాయపడింది.

చదవండి: స్టార్‌ హీరో సినిమాలో గూండాగా.. ఎందుకు చేశానా? అని బాధపడ్డా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement