అత్తే నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌: హీరో | Dimple Kapadia is Akshay Kumar's best friend in Bollywood | Sakshi
Sakshi News home page

అత్తే నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌: హీరో

Published Fri, Feb 10 2017 9:19 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

అత్తే నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌: హీరో - Sakshi

అత్తే నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌: హీరో

ముంబై: బాలీవుడ్‌ అలనాటి హీరోయిన్, తన అత్త డింపుల్ కపాడియా తనకు బెస్ట్ ఫ్రెండ్ అని హీరో అక్షయ్ కుమార్ అన్నాడు. బాలీవుడ్‌లో మీకు బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరని ట్విట్టర్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అక్షయ్ పైవిధంగా సమాధానం ఇచ్చాడు.

అభిమానులతో ట్విట్టర్‌ చాట్‌ సందర్భంగా అక్షయ్.. మరో బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌ను ప్రశంసించాడు. షారుక్‌ కు వ్యాపార  తెలివితేటలు బాగున్నాయని అన్నాడు. బాలీవుడ్‌ ప్రఖ్యాత నటుడు రాజేష్‌ ఖన్నా, డింపుల్ కపాడియాల కూతురు ట్వింకిల్‌ ఖన్నాను అక్షయ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లో నటించిన ట్వింకిల్‌ అక్షయ్ను వివాహం చేసుకున్న తర్వాత నటనకు దూరమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement