నన్ను గారం చేసి చెడగొడుతున్నారు: దీపిక | Dimpleji pampers and spoils me, says Deepika Padukone | Sakshi
Sakshi News home page

నన్ను గారం చేసి చెడగొడుతున్నారు: దీపిక

Published Mon, Aug 11 2014 4:31 PM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM

నన్ను గారం చేసి చెడగొడుతున్నారు: దీపిక

నన్ను గారం చేసి చెడగొడుతున్నారు: దీపిక

డింపుల్ కపాడియా తనను కన్నకూతురిలా భావించి.. గారం చేస్తూ బాగా చెడగొడుతున్నారని బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే చెబుతోంది. అసలు డింపుల్జీతో తన అనుబంధం గురించి మాటల్లో ఏ మాత్రం చెప్పలేనని, ఆమె తెలిపింది. 'కాక్టెయిల్' సినిమాలో తామిద్దరం కలిసి నటిస్తున్నప్పుడు ఆమె తనను భోజనానికి బయటకు తీసుకెళ్లేవారని, షాపింగ్ కూడా చేయించేవారని తెలిపింది. డింపుల్ కపాడియా తనను కన్నకూతురిలా గారం చేసి చెడగొడుతున్నారని గోముగా చెప్పింది.

కాక్ టెయిల్ సినిమా సెప్టెంబర్ 12న విడుదల అవుతోంది. ఇది చాలా విభిన్నమైన సినిమా అవుతుందని, ప్రోమోలు చూసినప్పుడు ఆ విషయం తెలిసిందని దీపిక అంది. ఈ చిత్రంలో అర్జున్ కపూర్, నసీరుద్దీన్ షా, పంకజ్ కపూర్ తదితరులు నటించారు. హోమీ అడజానియా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో తనకు తన మాతృభాష అయిన కొంకణిలో మాట్లాడే అవకాశం కూడా వచ్చిందని దీపిక తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement