50 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలీవుడ్ బంపర్ హిట్ చిత్రం బాబీ (1973) కి సంబంధించిన జ్ఞాపకాలు, తెలిసిన విషయాలు, తెలియని విషయాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. బాగా ఇష్టపడి చేసిన సినిమా పరాజయం పాలైతే లేచి నిల్చోవడానికి, అడుగులు వేయడానికి, పరుగులు తీయడానికి శక్తి కావాలి. ఆ శక్తి రావాలంటే ‘ఎలాగైనా హిట్టు కొడతాను’ అనే కసి ఉండాలి.
‘మేరా నామ్ జోకర్’ సినిమాతో పరాజయం, అప్పుల పాలైన రాజ్ కపూర్‌లో ఆ కసి దండిగా ఉంది. కసి సంగతి సరే, ఇప్పుడొక సూపర్‌స్టారుడు కావాలి కదా. అప్పుల పాలైన తనతో సినిమా చేయడానికి ఎవరు ధైర్యం చేస్తారు? ‘ఇక అంతా అయిపోయింది. మిగిలింది ఏమీలేదు’ అనుకున్నప్పుడు ఎక్కడ లేని ధైర్యం వస్తుందట.
ఆ ధైర్యంతోనే కుమారుడిని హీరోగా పెట్టి ‘బాబీ’ తీసి తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు రాజ్ కపూర్. ఆర్‌కే స్టూడియోస్‌కు ఇది మకుటాయమాన చిత్రం అయింది. రిషి కపూర్, డింపుల్ కపాడియాలను ఎక్కడికో తీసుకెళ్లింది. ‘బాబీ’ గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే...కమర్శియల్ రోమాంటిక్ ఫిల్మ్ ‘ఫార్మట్’ను సెట్ చేసింది. మినీ–స్కర్ట్స్, హాట్ ప్యాంట్స్, లెదర్ ఔట్‌ఫిట్స్, వోవర్ సైజ్‌డ్ గ్లాసెస్, పోల్క–డాటెడ్ నాటెడ్ టాప్స్ మన దేశంలోని ఫ్యాషన్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్స్‌ను మోసుకొచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment