Rishi Kapoor
-
గోల్డెన్ బాబీ
50 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలీవుడ్ బంపర్ హిట్ చిత్రం బాబీ (1973) కి సంబంధించిన జ్ఞాపకాలు, తెలిసిన విషయాలు, తెలియని విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. బాగా ఇష్టపడి చేసిన సినిమా పరాజయం పాలైతే లేచి నిల్చోవడానికి, అడుగులు వేయడానికి, పరుగులు తీయడానికి శక్తి కావాలి. ఆ శక్తి రావాలంటే ‘ఎలాగైనా హిట్టు కొడతాను’ అనే కసి ఉండాలి. ‘మేరా నామ్ జోకర్’ సినిమాతో పరాజయం, అప్పుల పాలైన రాజ్ కపూర్‌లో ఆ కసి దండిగా ఉంది. కసి సంగతి సరే, ఇప్పుడొక సూపర్స్టారుడు కావాలి కదా. అప్పుల పాలైన తనతో సినిమా చేయడానికి ఎవరు ధైర్యం చేస్తారు? ‘ఇక అంతా అయిపోయింది. మిగిలింది ఏమీలేదు’ అనుకున్నప్పుడు ఎక్కడ లేని ధైర్యం వస్తుందట. ఆ ధైర్యంతోనే కుమారుడిని హీరోగా పెట్టి ‘బాబీ’ తీసి తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు రాజ్ కపూర్. ఆర్కే స్టూడియోస్‌కు ఇది మకుటాయమాన చిత్రం అయింది. రిషి కపూర్, డింపుల్ కపాడియాలను ఎక్కడికో తీసుకెళ్లింది. ‘బాబీ’ గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే...కమర్శియల్ రోమాంటిక్ ఫిల్మ్ ‘ఫార్మట్’ను సెట్ చేసింది. మినీ–స్కర్ట్స్, హాట్ ప్యాంట్స్, లెదర్ ఔట్ఫిట్స్, వోవర్ సైజ్డ్ గ్లాసెస్, పోల్క–డాటెడ్ నాటెడ్ టాప్స్ మన దేశంలోని ఫ్యాషన్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్స్‌ను మోసుకొచ్చాయి. -
రిషికపూర్ మృతి: లుకేమియా వ్యాధి లక్షణాలు!
బాలీవుడ్ నటుడు రిషి కపూర్ క్యాన్సర్‌తో పోరాడి గురువారం మృతి చెందారు. గత రెండేళ్లుగా లుకేమియా వ్యాధితో బాధపుడుతున్న ఆయన ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో ప్రశాంత మరణాన్ని పొందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. క్యాన్సర్ల కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. అసలు లుకేమియా అంటే ఏమిటి? ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? (రిషి కపూర్ లాస్ట్ ట్వీట్ అదే..) లుకేమియా అంటే ఏమిటి? సాధారణంగా దీన్ని బ్లడ్‌క్యాన్సర్ అంటుంటారు. మన శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్య అధిక సంఖ్యలో ఉత్పత్తి కావడం వల్ల లుకేమియా వస్తుంది. ఎందుకంటే తెల్ల రక్త కణాలు ఉండాల్సిన సంఖ్య కంటే అధిక సంఖ్యలో ఉంటే అవి ఎర్ర రక్త కణాలను, ప్లేట్లేట్స్ ఉత్పత్తి తగ్గిస్తాయి. మన శరీరానికి అవసరమైనన్ని ఎర్రరక్తకణాలను ఉత్పత్తి జరగకుండా వాటిని బలహీన పరుస్తాయి. అవి బలహీన పడటం వల్ల ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి తగ్గి రక్తకణజాలల్లో కణుతులు ఏర్పడటమే కాకుండా ఎముక మజ్జలో కూడా కణుతులు ఏర్పడతాయి. ఇవే లుకేమియాకు దారిస్తాయి. దీనివల్ల శరీరంలో శక్తి సామర్థ్యం తగ్గి రోజుకు రోజుకూ ఆరోగ్యం క్షీణిస్తుంది. (ఉద్వేగానికి లోనైన ఇర్ఫాన్ కుమారుడు) లుకేమియాలో రకాలు.. లుకేమియాల్లో చాలా రకాలున్నా, వాటిలో తరచుగా కనిపించేవి నాలుగు రకాలు అవి... అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా, అక్యూట్ మైలాయిడ్ లుకేమియా, క్రానిక్ లింఫోసైటిక్ లుకేమియా, క్రానిక్ మైలాయిడ్ లుకేమియా. అయితే కొన్నిసార్లు ఇతర క్యాన్సర్లు ఎముక మజ్జలోకి వ్యాపించే అవకాశం ఉన్న ఉన్నా అవి లుకేమియాలు కావని గ్రహించాలి. లక్షణాలు లుకేమియా బారిన పడిన వ్యక్తులు శరీర ఆరోగ్యాన్ని బట్టి కొంత మంది వేగంగా, నెమ్మదిగా ప్రభావం చూపుతుంది. వేగంగా పెరిగే లుకేమియా రోగులకు అలసట, బరువు తగ్గడం, తరచూ అంటువ్యాధులు, సులభంగా రక్తస్రావం లేదా గాయాలు వంటి లక్షణాలు ఉంటాయి. అయితే నెమ్మదిగా పెరిగా లుకేమియా రోగులలో చాలా మందికి ఈ లక్షణాలు తక్కువగా కనిపించవు. ఇక లుకేమియాతో బాధపడే వారికి ఎముకలు, కీళ్లలో నొప్పి ఉంటుంది. మైకం, జ్వరం, ఆకలి లేకపోవడం, నోటిలో పుండ్లు, పల్లర్, చర్మంపై ఎర్రటి మచ్చలు, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, వాపు శోషరస కణుపులు, అనుకోకుండా బరువు తగ్గడం, బలహీనత వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. చికిత్స లుకేమియాకు సాధారణ చికిత్సగా కీమోథెరపీను ఇస్తారు. కొన్ని సందర్భాల్లో కీమోథెరపీతో పాటు రేడియోథెరపీ, మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ, ఇమ్యునోథెరపీని ఇస్తారు. ఇవి పని చేయని పక్షంలో ఎముక మజ్జ మార్పడి చికిత్సను చేయాల్సి వస్తుంది. -
ఆప్తమిత్రుడిని కోల్పోయాం : బాలయ్య
సాక్షి, హైదరాబాద్ : బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ క్యాన్సర్ కారణంగా గురువారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో దేశ వ్యాప్తంగా విషాద ఛాయలు నెలకొన్నాయి. సినీ, క్రీడా, రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నారు. రిషి కపూర్ మృతిపట్ల హీరో నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ.. ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ లాంటి ఇద్దరు నట దిగ్గజాలు హఠాత్తుగా మనకు దూరమవడం చాలా బాధాకరమన్నారు. భారతీయ సినిమాకు ఇది తీరని లోటని, వారి విశేష ప్రతిభ, చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుంటారని తెలిపారు. ఈ సందర్భంగా వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు పేర్కొన్నారు. (రిషి కపూర్ లాస్ట్ ట్వీట్ అదే..) ఆప్తమిత్రుడ్ని కోల్పోయాను.. సినీ నిర్మాత టి.సుబ్బరామి రెడ్డి స్పందిస్తూ.. రిషి కపూర్ మరణవార్త విని తీవ్ర దిగ్బ్రాంతి కి గురయ్యానని, ఒక ఆప్తమిత్రుడ్ని కోల్పోయానన్నారు, ఆయనతో తాము నిర్మించిన 'చాందిని' చిత్ర జ్ఞాపకాలు ఎప్పటికి పదిలంగా ఉంటాయన్నారు. ' రిషి కపూర్ నిజంగా గ్రేట్ హ్యూమన్ బీయింగ్. మా కుటుంబానికి ఎంతో సన్నిహితులు. ఆయన హఠాత్తుగా మనకు దూరమవడం చాలా బాధాకరం. భారతీయ సినిమాకు ఇది తీరని లోటు. వారి విశేష ప్రతిభ, ఆయన చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుంటారు. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నా' అని పేర్కొన్నారు. (చాకొలెట్ బాయ్ రిషి కపూర్...) -
కాంచీ విడుదలకు తొందరేం లేదు: సుభాష్ ఘాయ్
తన దర్శకత్వంలో రూపుదిద్దుకోంటున్న 'కాంచీ' చిత్రం విడుదలకు అంత తొందర ఏమి లేదని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘాయ్ వెల్లడించారు. కాంచీ చిత్రాన్ని తగినంత సమయం తీసుకుని విడుదల చేస్తానని ఆయన తెలిపారు. ఆ చిత్ర నిర్మాణంలో మహాబీజిగా ఉన్న ఆయన కాసంత విరామం సమయంలో విలేకర్లతో సరదాగా ముచ్చటించారు. కాంచీ చిత్ర నిర్మాణం తుది దశకు చేరుకుందని తెలిపారు. అలా అని షూటింగ్ పూర్తి అయిన వెంటనే విడుదల చేయనన్నారు. సినిమా చిత్రీకరణ ఓ సారి పూర్తి అయితే ఎప్పుడు విడుదల చేద్దామా అనే ఆలోచన అతనకు ఉంటుందన్నారు. అయితే ఈ సారి అలా కాకుండా సరైన సమయంలో కాంచీ విడుదల చేస్తానన్నారు. తన దర్శకత్వంలో ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద చతికిలపడిన యువరాజ్ చిత్రంలా అరిబరీగా తీసి మళ్లీ చేతులు కాల్చుకోనే ఉద్దేశం తనకు లేదని తేల్చి చెప్పారు. యువరాజ్ చిత్రాన్ని ఒడిలోపెట్టన దడిలో పెట్టన అన్న రీతిలో తీసి ఆగమేఘాలపై విడుదల చేశానని సుభాష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ చిత్రం తనకు ఓ గుణపాఠం అని వ్యాఖ్యానించారు. ఇంకా చెప్పాలంటే ఆ చిత్రంతో తనకు జ్ఞానోదయం అయిందని వివరించారు. అలాంటి తప్పులు మరల జీవితంలో చేయకుడదని ఓ నిర్ణయం తీసుకున్నట్లు సుభాష్ ఘాయ్ వివరించారు. కార్తీక్ తివారీ, నూతన నాయక మిస్తి ప్రధాన తారాగణంగా కాంచీ చిత్రం రూపొందుతోంది. ఆ చిత్రంలో రిషి కపూర్, మిథున్ చక్రవర్తులు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.