ఈ అక్కాచెల్లెళ్లను గుర్తుపట్టారా? ఒకరు స్టార్‌ హీరోయిన్‌గా, మరొకరు.. | These Sisters Made Film Debut with Two Superstars, Can You Recognise Them? | Sakshi
Sakshi News home page

Guess the Actress: ఒకరు క్యాన్సర్‌కు బలి.. మరొకరు స్టార్‌ హీరోయిన్‌గా

Published Sun, Oct 15 2023 5:45 PM | Last Updated on Sun, Oct 15 2023 6:07 PM

These Sisters Made Film Debut with Two Superstars, Can You Recognise Them? - Sakshi

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. ఇద్దరూ హీరోయిన్‌గా కెరీర్‌ మొదలుపెట్టారు. ఒకరు స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తే మరొకరు హీరోయిన్‌గా రాణించలేకపోయారు. ఆమె ఫ్యాషన్‌ డిజైనింగ్‌ వైపు అడుగులేసి అక్కడ పేరుప్రతిష్టలు సంపాదించుకున్నారు. కానీ క్యాన్సర్‌ మహమ్మారితో పోరాడి 51 ఏళ్ల వయసులో ప్రాణాలు వదిలారు. ఇంతకీ వీళ్లెవరో గుర్తుపట్టారా? వాళ్లే బాలీవుడ్‌ సిస్టర్స్‌ డింపుల్‌ కపాడియా- సింపుల్‌ కపాడియా.

ఒక్క సినిమాతో ఓవర్‌నైట్‌ స్టార్‌
డింపుల్‌ కపాడియా బాబీ సినిమాతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. ఈ మూవీలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో రిషి కపూర్‌ సరసన నటించింది. ఈ సినిమాతో ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిన డింపుల్‌ కెరీర్‌ పీక్స్‌లో ఉండగా బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజేశ్‌ ఖన్నాను పెళ్లాడింది. కానీ వీరి వైవాహిక జీవితం సజావుగా సాగలేదు. తొమ్మిదేళ్లు కలిసున్న తర్వాత వీరు విడిపోయారు. అయితే నటనను మాత్రం వదిలిపెట్టలేదు డింపుల్‌. ఇప్పటికీ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చేస్తోంది.

యాక్టింగ్‌ వదిలేసి ఫ్యాషన్‌ డిజైనింగ్‌పై ఫోకస్‌
డింపుల్‌ సోదరి సింపుల్‌ కపాడియా మాత్రం నటిగా పెద్దగా క్లిక్‌ అవలేదు. రాజేశ్‌ ఖన్నా హీరోగా నటించిన అనురోధ్‌(1977) సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ మూవీ తనకు పెద్దగా ప్లస్‌ అవలేదు. చక్రవ్యూహ, మ్యాన్‌ పసంద్‌, లూట్‌మార్‌, షక్క, జీవన్‌ ధార, ప్యార్‌ కే దో పాల్‌ సహా పలు చిత్రాల్లో నటించింది. అయినా తనకు సంతృప్తి దక్కలేదు. దీంతో యాక్టింగ్‌ వదిలేసి తనకు ఇష్టమైన ఫ్యాషన్‌ డిజైనింగ్‌పై ఫోకస్‌ చేసింది. పలు సినిమాలకు ఫ్యాషన్‌ డిజైనర్‌గా పని చేసింది కూడా! కానీ క్యాన్సర్‌ వ్యాధి ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. క్యాన్సర్‌ కారణంగా 2009లో నవంబర్‌ 10న మరణించింది.

చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి కింగ్‌ ఆఫ్‌ కొత్త హిందీ వర్షన్‌.. ఎప్పుడు? ఎక్కడంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement