రాజ్‌కపూర్ టెక్నిక్
నాస్టాల్జియా
బాబీ సినిమాతో రాజ్‌కపూర్ ఎక్స్‌పోజింగ్ సన్నివేశాలకు తెరలేపాడు. బాబీలో డింపుల్ కాపాడియాను ఆ తర్వాత సత్యం శివమ్ సుందరంలో జీనత్ అమాన్‌ను, ఆ తర్వాత రామ్ తేరి గంగామైలీలో మందాకినిని ఆయన చూపించిన తీరు వల్లే ఆ సినిమాలు ప్రేక్షకుల్లో కుతూహలం రేపాయన్నది వాస్తవం. అయితే ఇవన్నీ సెన్సార్‌ను దాటి ఎలా బయటపడినట్టు? దీనికి రాజ్‌కపూర్ ఒక టెక్నిక్ పాటించేవాడు. సెన్సార్ డేట్ వచ్చి లోపల కమిటీ సినిమా చూస్తూ ఉండగా నలిగిన పైజామా నలిగిన లాల్చీ వేసుకొని వెళ్లేవాడు.
గడ్డం అప్పటికే మాసి ఉండేలా చూసుకునేవాడు. ఈ సినిమా లేకపోతే తన పరిస్థితి లేదు అన్నట్టుగా దిగాలు ముఖం పెట్టుకుని కూచునేవాడు. సినిమా చూసి బయటకొచ్చిన కమిటీ ఈయన ముఖం చూసి గట్టిగా కట్స్ చెప్పడానికి మొహమాట పడేది. సరేలే ఏదో పెద్దాయన... ఏడవనీ అని వదిలేసేది. రాజ్‌కపూర్ పథకం పారి పోస్టర్స్ అన్నీ హాట్ హాట్ స్టిల్స్‌తో నిండిపోయేవి.