ఓ మై గాడ్‌ 2 | Gopala Gopala Is The Remake Of Oh My God seqwel | Sakshi
Sakshi News home page

ఓ మై గాడ్‌ 2

Published Mon, Jan 25 2021 6:19 AM | Last Updated on Mon, Jan 25 2021 6:19 AM

Gopala Gopala Is The Remake Of Oh My God  seqwel - Sakshi

అక్షయ్‌ కుమార్, పరేష్‌ రావల్‌ ముఖ్య పాత్రల్లో 2012లో వచ్చిన హిందీ చిత్రం ‘ఓ మై గాడ్‌’. సోషల్‌ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. నాస్తికుడిగా పరేష్, దేవుడిగా అక్షయ్‌ కుమార్‌ కనిపించిన ఈ సినిమాకు ఉమేశ్‌ శుక్లా దర్శకుడు. ఈ సినిమాను తెలుగులో ‘గోపాలా గోపాలా’గా రీమేక్‌ చేశారు వెంకటేశ్, పవన్‌ కల్యాణ్‌. తాజాగా ‘ఓ మై గాడ్‌’ చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కబోతోంది. సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు పూర్తయ్యాయని టాక్‌. వేసవిలో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. అయితే మొదటి భాగాన్ని డైరెక్ట్‌ చేసిన ఉమేశ్‌ శుక్లా ఈ సీక్వెల్‌ను డైరెక్ట్‌ చేయడంలేదట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement