Gopala Gopala movie
-
ఓ మై గాడ్ 2
అక్షయ్ కుమార్, పరేష్ రావల్ ముఖ్య పాత్రల్లో 2012లో వచ్చిన హిందీ చిత్రం ‘ఓ మై గాడ్’. సోషల్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. నాస్తికుడిగా పరేష్, దేవుడిగా అక్షయ్ కుమార్ కనిపించిన ఈ సినిమాకు ఉమేశ్ శుక్లా దర్శకుడు. ఈ సినిమాను తెలుగులో ‘గోపాలా గోపాలా’గా రీమేక్ చేశారు వెంకటేశ్, పవన్ కల్యాణ్. తాజాగా ‘ఓ మై గాడ్’ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కబోతోంది. సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని టాక్. వేసవిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే మొదటి భాగాన్ని డైరెక్ట్ చేసిన ఉమేశ్ శుక్లా ఈ సీక్వెల్‌ను డైరెక్ట్ చేయడంలేదట. -
హైదరాబాద్‌లో... బాబు...బంగారం!
లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా రావడానికి వెంకటేశ్ రెడీ అవుతున్నారు. ‘గోపాల... గోపాల’ తర్వాత వెంకటేశ్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ఈ సినిమా విడుదలై ఏడాది పైనే అవుతోంది. దాంతో వెంకీ అభిమానులు ఆయన తదుపరి చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకే వెంకీ కూడా టకటకా సినిమా పూర్తి చేసేస్తున్నారు. మారుతి దర్శకత్వంలో ఆయన ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘బాబు బంగారం’ అనే టైటిల్ ప్రచారమవుతోంది. చిత్రబృందం ఈ టైటిల్ వైపే మొగ్గు చూపుతోందని సమాచారం. ‘లక్ష్మి’, ‘తులసి’ చిత్రాల తర్వాత వెంకీ, నయనతార కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రమిది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎస్. చినబాబు సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘సినిమా చిత్రీకరణ మొత్తం హైదరాబాద్‌లోనే జరుగుతోంది. హాస్యనటుడు ‘థర్టీ ఇయర్స్’ పృథ్వి మీద కొత్త తరహా సీన్స్ తీస్తున్నాం. ఏప్రిల్ నెలాఖరుతో చిత్రీకరణ పూర్తవుతుంది. వెంకటేశ్ కెరీర్లో విభిన్న తరహాలో సాగే చిత్రంగా ఇది నిలిచిపోతుంది. జూలైలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. -
'మంచి కథ కోసం చూస్తున్నా'
నెల్లిమర్ల: మంచి కథ కోసం వేచిచూస్తున్నానని గోపాల గోపాల చిత్ర నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు తనయుడు అభిరామ్ అన్నారు. ఆయన రామతీర్థంలోని శ్రీ రాముడ్ని శనివారం సందర్శించారు. ఆలయ అర్చకులు అభిరామ్ పేరిట ప్రత్యేక పూజలు జరిపించారు. అలాగే ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయ వృత్తాంతాన్ని వివరించారు. ఈ సందర్భంగా అభిరామ్ విలేకరులతో మాట్లాడుతూ గోపాల గోపాల సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రను బ్రేక్ చేస్తుందన్నారు. అంచనాలకు మించి ఆదరణ లభిస్తోందని చెప్పారు. సినిమా ప్రదర్శిస్తున్న అన్ని థియేటర్లను సందర్శిస్తున్నట్టు చెప్పారు. గోపాలగోపాల వంటిమంచి చిత్రాలు నిర్మించేందుకు కథల కోసం వేచి చూస్తున్నామన్నారు. ఇప్పటికే పలువురు రచయితలు తమకు కథలు వినిపించారని, అయితే మరింత విభిన్నమైన కథల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ఐదు శతాబ్దాల చరిత్ర కలిగిన రామతీర్థం దేవస్థానాన్ని దర్శించుకోవడంతనకెంతో ఆనందం కలిగించిందని చెప్పారు. ఆయనతో పాటు స్టూడియో పంతులు ఉన్నారు. nellimarla, raamatheertham, gopala gopala movie, daggubati abhiram, నెల్లిమర్ల, రామతీర్థం, గోపాల గోపాల చిత్రం, దగ్గుబాటి అభిరామ్ -
'గోపాల గోపాల' ఆడియో రిలీజ్ హైలెట్స్
-
పవన్ అభిమాని గొంతు కోసిన దుండగులు
గోపాల గోపాల ఆడియో ఫంక్షన్ వద్ద ఘటన గచ్చిబౌలి: గోపాలగోపాల సినిమా ఆడియో ఫంక్షన్ టికెట్లు ఇవ్వలేదని దుండగులు పవన్‌కల్యాణ్ అభిమాని గొంతు కోసి పారిపోయారు. ఈ ఘటన ఆదివారం శిల్పకళా వేదిక వద్ద జరిగింది. గుంటూరు జిల్లా గంటవారిపాలెంకు చెందిన కన్నా శ్రీనివాస్ (31) పవన్ కల్యాణ్ అభిమాన సంఘం వినుకొండ నియోజకవర్గం అధ్యక్షుడు. ప్రస్తుతం అతను హయత్‌నగర్‌లో నివాసముంటున్నాడు. సినీ అగ్రహీరోలు వెంకటేష్, పవన్‌కల్యాణ్ నటించిన గోపాల-గోపాల సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు సంబంధించిన 20 టికెట్లను వేదిక వద్ద తన స్నేహితులకిస్తుండగా దుండగులు వచ్చి తమకూ కావాలని అడిగారు. నిరాకరించిన శ్రీనివాస్ గొంతు, మెడపై బ్లేడ్‌తో దాడి చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో కుప్పకూలి న శ్రీనివాస్‌ను అక్కడే ఉన్న పోలీసులు మాదాపూర్‌లోని సన్‌షైన్ ఆస్పత్రిలో చేర్పించారు. అతనికి ప్రాణహాని తప్పింది. -
చిద్విలాసంగా...
దేవుడు తనను ద్వేషించినా దేవుడు బాధ పడడు. సాటి మనిషిని ద్వేషిస్తే మాత్రం కచ్చితంగా బాధపడతాడు. సాటి మనిషిలో తనని చూస్తే కచ్చితంగా కటాక్షిస్తాడు. సింపుల్‌గా చెప్పాలంటే ‘గోపాల గోపాల’ కథాంశమిదే. తనకు అన్యాయం జరిగిందని దేవునిపైనే కేసు వేసే ఒక మనిషి కథ ఇది. ఆ సామాన్యుడి పాత్రను వెంకటేశ్ పోషిస్తుండగా, శ్రీకృష్ణునిగా పవన్‌కల్యాణ్ నటిస్తున్నారు. కిశోర్‌కుమార్ పార్థసాని దర్శకత్వంలో డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. మరో వైపు పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ కూడా జరుపుకుంటోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని, టీజర్‌ని శుక్రవారం విడుదల చేశారు. శ్రీమహావిష్ణువు తరహాలో ఊయల్లో పడుకుని చిద్విలాసం చేస్తూ పవర్‌స్టార్, ఆయనను అనుకరిస్తూ ఆటపట్టిస్తున్న వెంకటేశ్‌లతో ఫస్ట్‌లుక్ ఆసక్తి రేపుతోంది. సంక్రాంతికి రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీయ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అలనాటి బాలీవుడ్ సూపర్‌స్టార్ మిథున్ చక్రవర్తి ప్రత్యేక పాత్ర పోషిస్తుండటం మరో విశేషం. నిర్మాత డి. సురేశ్‌బాబు రెండో కుమారుడు డి. అభిరామ్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. పోసాని కృష్ణమురళి, ఆశిష్ విద్యార్థి, మురళీశర్మ, కృష్ణుడు, రంగనాథ్, రాళ్లపల్లి, భరణి, మధుశాలిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: భవేష్ మాండలియా, ఉమేశ్ శుక్లా, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: జయనన్ విన్సెంట్, సంగీతం: అనూప్ రూబెన్స్, కూర్పు: గౌతంరాజు, నిర్మాణం: సురేశ్ ప్రొడక్షన్ ప్రై.లిమిటెడ్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లిమిటెడ్.