
'మంచి కథ కోసం చూస్తున్నా'
నెల్లిమర్ల: మంచి కథ కోసం వేచిచూస్తున్నానని గోపాల గోపాల చిత్ర నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు తనయుడు అభిరామ్ అన్నారు. ఆయన రామతీర్థంలోని శ్రీ రాముడ్ని శనివారం సందర్శించారు. ఆలయ అర్చకులు అభిరామ్ పేరిట ప్రత్యేక పూజలు జరిపించారు. అలాగే ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయ వృత్తాంతాన్ని వివరించారు. ఈ సందర్భంగా అభిరామ్ విలేకరులతో మాట్లాడుతూ గోపాల గోపాల సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రను బ్రేక్ చేస్తుందన్నారు. అంచనాలకు మించి ఆదరణ లభిస్తోందని చెప్పారు.
సినిమా ప్రదర్శిస్తున్న అన్ని థియేటర్లను సందర్శిస్తున్నట్టు చెప్పారు. గోపాలగోపాల వంటిమంచి చిత్రాలు నిర్మించేందుకు కథల కోసం వేచి చూస్తున్నామన్నారు. ఇప్పటికే పలువురు రచయితలు తమకు కథలు వినిపించారని, అయితే మరింత విభిన్నమైన కథల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ఐదు శతాబ్దాల చరిత్ర కలిగిన రామతీర్థం దేవస్థానాన్ని దర్శించుకోవడంతనకెంతో ఆనందం కలిగించిందని చెప్పారు. ఆయనతో పాటు స్టూడియో పంతులు ఉన్నారు.
nellimarla, raamatheertham, gopala gopala movie, daggubati abhiram,
నెల్లిమర్ల, రామతీర్థం, గోపాల గోపాల చిత్రం, దగ్గుబాటి అభిరామ్