
టాలీవుడ్ నిర్మాత సురేశ బాబు తనయుడు అభిరామ్ వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. రానాకు తమ్ముడైన అభిరామ్ వరసకు మరదలైన ప్రత్యూష అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. శ్రీలంకలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌కు బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరలవుతున్నాయి. దాదాపు మూడు రోజుల పాటు ఈ పెళ్లి వేడుక జరిగింది. కాగా.. ఇటీవలే వరుణ్ తేజ్ సైతం పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేశ్ బాబుకి ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి రానా ఇప్పటికే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రెండో అబ్బాయి అభిరామ్ కూడా 'అహింస' అనే మూవీతో టాలీవుడ్‌లో హీరోగా పరిచయమయ్యాడు. కానీ ఈ మూవీ అంత గుర్తింపు తీసుకురాలేదు. దీంతో కొన్నాళ్లు గ్యాప్ తీసి సినిమాలు చేస్తానని ప్రకటించాడు. అతను ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్‌లోనూ నటించడం లేదు. దీంతో పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. దగ్గుబాటి కుటుంబంలోకి అడుగుపెట్టనున్న అమ్మాయి స్వస్థలం కారంచేడు అని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment