రానా తమ్ముడి డెస్టినేషన్ వెడ్డింగ్? ఆ దేశంలో మూడు రోజుల పాటు! | Daggubati Abhiram Destination Wedding Details Inside | Sakshi
Sakshi News home page

Abhiram Marriage: తెలుగు యంగ్ హీరో పెళ్లి ఫిక్స్.. అమ్మాయి ఎవరంటే?

Published Sun, Dec 3 2023 7:02 PM | Last Updated on Sun, Dec 3 2023 7:11 PM

Daggubati Abhiram Destination Wedding Details Inside - Sakshi

మరో తెలుగు హీరో పెళ్లికి రెడీ అయిపోయాడు. ఈ మధ్య వరుణ్ తేజ్‌తోపాటు పలువురు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడీ లిస్టులోకి రానా తమ్ముడు చేరిపోయేందుకు రెడీ అయిపోయాడు. అయితే ఈ పెళ్లి మూడు రోజుల పాటు జరగనుందని, ఎవరు ఊహించని ఓ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారని అంటున్నారు. ఇంతకీ పెళ్లి విశేషాలేంటి?

(ఇదీ చదవండి: హనీమూన్‌కి వెళ్లిన మెగా కపుల్ వరుణ్-లావణ్య?)

నిర్మాత సురేశ్ బాబుకి ఇద్దరు కొడుకులు. పెద్దబ్బాయి రానా ఇప్పటికే నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రెండో అబ్బాయి అభిరామ్ కూడా.. 'అహింస' అనే మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. కానీ ఇదేమంత పేరు తీసుకురాలేదు. దీంతో కొన్నాళ్లు గ్యాప్ తీసి సినిమాలు చేస్తానని ప్రకటించాడు. ఇప్పుడీ కుర్రాడే పెళ్లికి రెడీ అయిపోయాడు. వరసకు మరదలు అయ్యే అమ్మాయితో అభిరామ్ డిసెంబరు 6న ఏడడుగులు వేయబోతున్నాడు.

దగ్గుబాటి కుటుంబంలోకి అడుగుపెట్టనున్న అమ్మాయి పేరు ప్రత్యూష. ఆమెది కారంచేడు అని తెలుస్తోంది. ఇకపోతే అభిరామ్-ప్రత్యూష.. శ్రీలంకలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారట. దాదాపు మూడు రోజుల పాటు ఈ పెళ్లి వేడుక జరగనుందని తెలుస్తోంది. అతికొద్దిమంది మాత్రమే హాజరు కానున్న ఈ పెళ్లి వేడుక.. సోమవారం రాత్రి డిన్నర్ పార్టీతో మొదలవుతుంది. మంగళవారం.. మెహందీ, డిన్నర్ ఉంటుంది. బుధవారం.. పెళ్లి కూతుర్ని చేయడం, ఇదే రోజు రాత్రి 8:50 గంటలకు అభిరామ్.. ప్రత్యూష మెడలో మూడు మూళ్లు వేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే పెళ్లి పనుల్లో దగ్గుబాటి ఫ్యామిలీ బిజీగా ఉన్నారట.

(ఇదీ చదవండి: ఆ స్టార్‌ హీరోను గట్టిగా లాగిపెట్టి కొట్టా.. అందరూ షాక్‌..: నటి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement