ఓ తెలుగు సినిమా ఓటీటీలో దాదాపు ఆరు నెలల తర్వాత రిలీజైంది. మీరు కరెక్ట్‌గానే విన్నారు. అప్పుడెప్పుడో జూన్‌లో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ప్రేక్షకుల్ని ఏ మాత్రం అలరించలేకపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు టీవీలో టెలికాస్ట్ అయింది. ఓటీటీలో మాత్రం దాదాపు ఆరు నెలల తర్వాత ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.
ఇంతకీ ఏంటా సినిమా?
విక్టరీ వెంకటేశ్ వారసత్వాన్ని కొనసాగిస్తూ రానా నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. వీళ్ల ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో అభిరామ్. ఇతడు నిర్మాత సురేశ్ బాబు చిన్న కొడుకు. ఇకపోతే ఈ కుర్రాడు.. తేజ దర్శకత్వంలో 'అహింస' అనే సినిమా చేశాడు. దాదాపు రెండేళ్ల పాటు సెట్స్‌పై ఉన్న ఈ మూవీని.. ఈ ఏడాది జూన్ 2న థియేటర్లలో విడుదల చేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు)
హీరోగా చేసిన అభిరామ్ యాక్టింగ్‌తో పాటు తేజ దర్శకత్వంపై ఘోరమైన విమర్శలు వచ్చాయి. ఏ మాత్రం కొత్తదనం లేని ఇలాంటి సినిమా తీసినందుకు తేజని, యాక్టింగే సరిగా చేయలేదని అభిరామ్‌ని తెగ ట్రోల్ చేశారు. దీంతో రెండు మూడు రోజుల్లోనే ఈ చిత్రం సైడ్ అయిపోయింది.
ఓటీటీలో రిలీజ్
అయితే 'అహింస' చిత్ర డిజటల్ రైట్స్‌ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. కానీ ఎందుకో ఓటీటీ రిలీజ్ వాయిదా వేస్తూ వచ్చింది. సెప్టెంబరులో ఈ సినిమాని టీవీల్లో కూడా ప్రసారం చేశారు కానీ ఓటీటీ విడుదల జాడ లేకుండా పోయింది. ఇదిగో ఇన్నాళ్లు ఓటీటీలో ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేశారు. ప్రస్తుతం తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న జపాన్.. వారం రోజుల్లో..)
Comments
Please login to add a commentAdd a comment