దగ్గుబాటి అభిరామ్‌ 'అహింస' టీజర్‌ వచ్చేసింది.. | Daggubati Abhiram Debut Ahimsa Teaser Out Now | Sakshi
Sakshi News home page

Ahimsa Teaser: దగ్గుబాటి అభిరామ్‌ 'అహింస' టీజర్‌ వచ్చేసింది..

Published Thu, Oct 6 2022 11:20 AM | Last Updated on Thu, Oct 6 2022 11:32 AM

Daggubati Abhiram Debut Ahimsa Teaser Out Now - Sakshi

దగ్గుబాటి అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు డైరెక్టర్‌ తేజ. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో అహింస అనే చిత్రం తెరకెక్కతుతున్న సంగతి తెలిసిందే.ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో గీతికా హీరోయిన్‌గా న‌టిస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఒక ఇంగ్లీష్ (ముద్దు) ఇవ్వు..పోనీ తెలుగు ఇవ్వు అని హీరోయిన్‌ చెప్పే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమవుతుంది.  

హీరో హీరోయిన్ల మ‌ధ్య సాగే లవ్ ట్రాక్‌తో మొద‌లైన టీజ‌ర్‌.. యాక్షన్‌ సన్నివేశాలతో క్యూరియాసిటీ పెంచుతుంది. ఇటీవలె ఈ సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.  ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై పీ కిర‌ణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సదా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement