Ahimsa Movie
-
ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
ఓ తెలుగు సినిమా ఓటీటీలో దాదాపు ఆరు నెలల తర్వాత రిలీజైంది. మీరు కరెక్ట్‌గానే విన్నారు. అప్పుడెప్పుడో జూన్‌లో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ప్రేక్షకుల్ని ఏ మాత్రం అలరించలేకపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు టీవీలో టెలికాస్ట్ అయింది. ఓటీటీలో మాత్రం దాదాపు ఆరు నెలల తర్వాత ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఏంటా సినిమా? విక్టరీ వెంకటేశ్ వారసత్వాన్ని కొనసాగిస్తూ రానా నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. వీళ్ల ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో అభిరామ్. ఇతడు నిర్మాత సురేశ్ బాబు చిన్న కొడుకు. ఇకపోతే ఈ కుర్రాడు.. తేజ దర్శకత్వంలో 'అహింస' అనే సినిమా చేశాడు. దాదాపు రెండేళ్ల పాటు సెట్స్‌పై ఉన్న ఈ మూవీని.. ఈ ఏడాది జూన్ 2న థియేటర్లలో విడుదల చేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) హీరోగా చేసిన అభిరామ్ యాక్టింగ్‌తో పాటు తేజ దర్శకత్వంపై ఘోరమైన విమర్శలు వచ్చాయి. ఏ మాత్రం కొత్తదనం లేని ఇలాంటి సినిమా తీసినందుకు తేజని, యాక్టింగే సరిగా చేయలేదని అభిరామ్‌ని తెగ ట్రోల్ చేశారు. దీంతో రెండు మూడు రోజుల్లోనే ఈ చిత్రం సైడ్ అయిపోయింది. ఓటీటీలో రిలీజ్ అయితే 'అహింస' చిత్ర డిజటల్ రైట్స్‌ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. కానీ ఎందుకో ఓటీటీ రిలీజ్ వాయిదా వేస్తూ వచ్చింది. సెప్టెంబరులో ఈ సినిమాని టీవీల్లో కూడా ప్రసారం చేశారు కానీ ఓటీటీ విడుదల జాడ లేకుండా పోయింది. ఇదిగో ఇన్నాళ్లు ఓటీటీలో ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేశారు. ప్రస్తుతం తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న జపాన్.. వారం రోజుల్లో..) -
Ahimsa Movie Review: ‘అహింస’ మూవీ రివ్యూ
టైటిల్: అహింస నటీనటులు: అభిరామ్ దగ్గుబాటి, గీతికా తివారి, సదా, కల్పలత, కమల్ కామరాజు, దేవి ప్రసాద్ తదితరులు నిర్మాత : పి.కిరణ్ దర్శకత్వం : తేజ సంగీతం: ఆర్పీ పట్నాయక్ సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు విడుదల తేది : జూన్ 2, 2023 తెలుగు చిత్ర పరిశ్రమలో దగ్గుబాటి ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. రామా నాయుడు మొదలు రానా వరకు ఆ ఫ్యామిలీకి చెందిన ప్రతి ఒక్కరు తమదైన టాలెంట్‌తో ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. అలాంటి ఫ్యామిలీ నుంచి ఓ మరో హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారంటే.. ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడడం సహజం. అందుకే ‘అహింస’పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. సురేశ్ బాబు తనయుడు, రానా తమ్ముడు అభిరామ్ నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అభిరామ్ డెబ్యూ మూవీ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. రఘు(అభిరామ్) ఓ పేద రైతు. తల్లిదండ్రులు చిన్నప్పుడు చనిపోవడంతో మేన మామ, అత్త(దేవీ ప్రసాద్, కల్పలత)దగ్గర పెరుగుతాడు. రఘు మరదలు అహల్య(గీతికా తివారి)కి బావ అంటే చాలా ఇష్టం. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఓ రోజు అహల్య పొలం దగ్గరు ఉన్న రఘుకి టిఫిన్ బాక్స్ ఇచ్చి వెళ్తుంటే.. సిటీకి చెందిన ఇద్దరు కుర్రాళ్లు ఆమెపై హత్యాచారానికి పాల్పడుతారు. అనంతరం దారుణంగా కొట్టి అడవిలో పడేసి వెళ్తారు. తన మరదలికి జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తాడు రఘు. అతని ఓ మహిళా లాయర్ లక్ష్మీ(సదా)తోడుగా నిలుస్తుంది. నిందితులిద్దరూ బడా వ్యాపారవేత్త ధనలక్ష్మి దుష్యంతరావు(రజత్ బేడీ) కొడుకులు కావడంతో ధర్మ పోరాటంలో రఘు ఓడిపోతారు. అంతేకాదు తనకు సహాయం చేసిన లాయర్ లక్ష్మీ, ఆమె భర్తను ధనలక్ష్మీ దుష్కంతరావు దారుణంగా చంపేస్తాడు. అహింసా మార్గంలో వెళ్తే తనకు న్యాయం జరగది భావించిన రఘు.. హింసని ఎంచుకుంటాడు. తన మరదలిపై హత్యాచారానికి పాల్పడిన దుండగులను చంపేయాలని డిసైడ్ అవుతాడు. దాని కోసం రఘు ఏం చేశాడు? వారిని ఎలా చంపాడు? అడవుల్లో గంజాయి సాగు చేసే లుంబ్డి గ్యాంగ్.. రఘును చంపాలని ఎందుకు ప్రయత్నించింది? దుష్కంతరావు కనబడకుండా పోవడానికి కారణం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్లో అహింస మూవీ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్‌లో తేజ ఒకరు. ఒకప్పుడు ఆయన సినిమాలు ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించాయి. ఎంతో మంది హీరోలను తెలుగు తెరకు పరిచయం చేశాడు. చిత్రం, నువ్వు నేను, జయం లాంటి బ్లాక్ బస్టర్స్ అందించాడు. ఇక తేజ పని అయిపోందిలే అనుకుంటున్న సమయంలో రానాతో ‘నేనే రాజు నేను మంత్రి’ సినిమా తీసి మళ్లీ పుంజుకున్నాడు. ఆ తర్వాత ‘సీత’లాంటి డిజాస్టర్ మూవీని ఇచ్చినా.. ఈ సారి బ్లాక్ బస్టర్ పక్కా ఇస్తాడులే అని అభిమానులు ఎంతో నమ్మకంగా ఉన్నారు. కానీ తేజ వారి నమ్మకాన్ని కాపాడుకోలేకపోయాడనిపిస్తుంది. పాత కథ, రొటీన్ స్క్రీన్‌ప్లేతో ‘అహింస’ను తెరకెక్కించాడు. చాలా సన్నివేశాలు తేజ తెరకెక్కించిన ‘జయం’, ‘నువ్వు నేను’ ‘ధైర్యం’ చిత్రాలను గుర్తుకు తెస్తాయి. ఇక లాజిక్కుల గురించి మాట్లాడుకోకపోవడం మంచిదేమో. కానిస్టేబుల్ పతంగి ఎగిరేసి అడవిలో ఉన్న హీరోకి సమాచారం అందించడం, కోర్టులోకి హీరో ప్రవేశించిన తీరు, సాక్ష్యాల కోసం హీరో చేసే ప్రయత్నాలు.. ఇలా ఏ ఒక్కటి రియలిస్టిక్‌గా ఉండదు. పైగా కథ మొత్తాని లాగినట్లుగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే ఐటమ్ సాంగ్ అయితే మరీ దారుణం. ఇంట్లో శవాలను పెట్టుకొని ఐటమ్ పాట పాడించడం ఏంటో ఎవరీ అర్థం కాదు. అలాగే ఓ కానిస్టేబుల్ ఎందుకు వారికి సపోర్ట్‌గా నిలిచాడో అదీ తెలియదు. ఫస్టాఫ్ ఎండింగ్ సమయంలోనే క్లైమాక్స్ అర్థమైపోతుంది. సెకండాఫ్‌లో కథ మరీ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఒకనొక దశలో సినిమా ఇంకా అయిపోవట్లేదే అనే ఫీలింగ్ కలుగుతుంది. మొత్తంగా అహింస పేరుతో తేజ ప్రేక్షకులను హింసించారనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే.. అభిరామ్‌కు ఇది తొలి సినిమా. ఉన్నంతలో రఘు తన పాత్రకు న్యాయం చేసేందుకు ట్రై చేశాడు. తేజ కూడా అభిరామ్‌పై పెద్దగా భారం వేయకుండా సన్నివేశాలను రాసుకున్నాడు. కానీ కొన్ని చోట్ల అభిరామ్ అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక అహల్యగా గీతికా తివారి తనదైన నటనతో మెప్పించింది. తెరపై చాలా అందంగా కనిపించింది. పోలీస్ ఆఫీసర్‌గా కమల్ కామరాజు, లాయర్‌గా సదా తన పాత్రలకు న్యాయం చేశారు. విలన్‌గా నటించిన రజత్ బేడి, ఛటర్జీ పాత్ర పోషించిన వ్యక్తితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఆర్పీ పట్నాయక్ సంగీతం పర్వాలేదు. ‘ఉందిలే’ పాట మినహా మిగతావేవి అంతగా ఆకట్టుకోలేవు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రపీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
Geethika Tiwary: అహింసా బ్యూటీ గీతిక తివారీ అందాల విందు (ఫోటోలు)
-
ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేనివాళ్లకు నేనున్నా
‘‘నేను ఫుట్‌పాత్ నుంచి ఈ స్థాయికి వచ్చాను. ప్రతిభ ఉన్నా ఇండస్ట్రీకి ఎలా రావాలో తెలియనివాళ్లు చాలామంది ఉన్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్లకు నేను బ్రేక్ ఇస్తాను.. నేనున్నంత వరకూ అవకాశాలు ఇస్తాను.. స్టార్ హీరోలతో సినిమా చేసినా అందులో కొత్తవారికి చాన్స్ ఇస్తాను’’ అని డైరెక్టర్ తేజ అన్నారు. అభిరామ్, గీతికా తివారీ జంటగా రూపొందిన చిత్రం ‘అహింస’. పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా తేజ చెప్పిన విశేషాలు. ► అభిరామ్‌ని హీరోగా పరిచయం చేస్తానని రామానాయుడుగారికి మాట ఇచ్చాను.. ఆ మాట కోసమే తనతో ‘అహింస’ చేశాను. సినీ నేపథ్యంలో ఉన్న పెద్ద కుటుంబాల్లోని వ్యక్తులతో చేసినప్పుడు సహజంగానే పోలికలు వస్తాయి. ఇప్పటికే స్టార్స్ అయిన వెంకటేశ్, రానాలతో అభిరామ్‌ని పోల్చకూడదు. ఎక్కువ డబ్బులు, పేరు కోసం పెద్ద స్టార్స్‌తో పని చేయాలి. నేను డబ్బులు, పేరు చూశాను.. నాకు ఇంకేం కావాలి? ► ప్రేక్షకులు చాలా తెలివైనవారు. ట్రైలర్‌ని చూసి సినిమాకి వెళ్లాలా? వద్దా అని నిర్ణయించుకుంటున్నారు. స్టార్ హీరోని బట్టి థియేటర్‌కి వెళతారనుకుంటే.. అప్పుడు పెద్ద స్టార్స్‌కి అపజయాలే రాకూడదు కదా! సినిమాలో ఎమోషన్ ఉంటే ట్రైలర్లో కనిపిస్తుంది. ప్రేక్షకులు ఆ ఎమోషన్‌కి కనెక్ట్ అయితే స్టార్ సినిమానా? కొత్తవారిదా అనే తేడా లేకుండా వచ్చేస్తారు. ► ఒక ఫిలాసఫీని బేస్ చేసి తీసిన చిత్రమిది. అహింసని ఎలా ఫాలో అవ్వాలి? అనే కాన్సెప్ట్‌తో మంచి కమర్షియల్ కథతో ఈ సినిమా చేశాం. ఇందులో దాదాపు 14 యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. ఓ నాలుగు ఎపిసోడ్స్‌కి నేనే ఫైట్ మాస్టర్‌గా చేశాను. ► అభిరామ్‌కి సినీ నేపథ్యం ఉంది. తనని పరిచయం చేస్తున్నప్పుడు నాకంటే అభీపైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. సురేశ్‌బాబుగారు ఒకసారి సెట్‌కి వచ్చారు. ‘నాన్నా.. నువ్వుంటే నేను చేయను’ అని అభి అనడంతో మానిటర్ వద్దకెళ్లి కూర్చున్నారాయన. ఇన్ని సినిమాలు చేసిన వెంకటేశ్‌గారు, రానాకి కూడా సురేశ్‌గారు సెట్‌కి వస్తే టెన్షన్ వచ్చేస్తుంది (నవ్వుతూ).. సురేశ్‌గారి దృష్టి వేరుగా ఉంటుంది. కిరణ్‌గారు రాజీ పడకుండా ఈ సినిమా తీశారు. ఈ మూవీకి ఆర్పీ పట్నాయక్ సంగీతం, అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం ప్లస్ అయ్యాయి. ► ‘అహింస’ విజయం సాధించి డబ్బులు వస్తే ఆ డబ్బుతో మళ్లీ సినిమాలు తీస్తాను. నా చిత్రం మూవీస్ బేనర్లో కొత్త దర్శకులని పరిచయం చేస్తాను. నా తర్వాతి సినిమా ‘రాక్షస రాజు’ని రానాతో చేస్తాను. ఆ తర్వాత మా అబ్బాయిని హీరోగా పరిచయం చేసే సినిమా చేస్తాను. -
Ahimsa: ‘అహింస’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
అహింస కొత్తగా ఉంటుంది
‘‘అహింస’ కథ చాలా కొత్తగా ఉంటుంది.. కథ కొత్తగా ఉన్నప్పుడు పాట సహజంగానే కొత్తగా వినిపిస్తుంది. ఈ చిత్రం పాటలకు మంచి స్పందన వస్తోంది’’ అన్నారుసంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్. అభిరామ్, గీతికా తివారి జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అహింస’. పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా జూన్ 2న రిలీజ్ కానున్న సందర్భంగా ఈ చిత్ర సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ– ‘‘అహింస సిద్ధాంతం నమ్మే ఓ అబ్బాయిని పరిస్థితులు ఎలా కృష్ణతత్వంవైపు లాగాయనేది ఈ చిత్రకథ. నా దర్శకత్వంలో ఒక మ్యూజికల్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాను. ఎన్నికల నేపథ్యంలో ఓ కథ రెడీ చేశాను. నిర్మాతలు దొరికితే ఏడాదికి 4 చిత్రాలకు దర్శకత్వం వహిస్తా. వెబ్ సిరీస్ కోసం రెండు కథలు రాశాను’’ అన్నారు. -
ఈ వారం థియేటర్/ఓటీటీ అలరించే చిత్రాలివే!
ఈ ఏడాది వేసవిలో చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. ఇప్పటికే పలు చిత్రాలు థియేటర్లతోపాటు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. జూన్ మొదటి వారంలోనూ చిన్న సినిమాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లతో ఓటీటీలో అలరించే చిత్రాలేవో ఓ లుక్కేద్దాం. దగ్గుబాటి హీరో అహింస ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు తనయుడు, రానా సోదరుడు అభిరామ్ అహింస చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిరామ్‌కు జోడీగా గీతికా తివారీ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఇది చదవండి: చాలా రోజుల తర్వాత అలాంటి చిత్రాన్ని చూశా: రాజమౌళి ప్రశంసలు) థ్రిల్లింగ్ కథతో.. స్టూడెంట్‌గా థియేటర్స్‌కు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు బెల్లకొండ గణేశ్. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లకొండ గణేశ్ హీరోగా ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించిన చిత్రం ‘నేను స్టూండెట్ సార్!’. ఇందులో అవంతిక దస్సాని హీరోయిన్గా నటించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జూన్ 2న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు. ఆసక్తి రేకెత్తించే ఐక్యూ సాయి చరణ్, పల్లవి, ట్రాన్సీ ముఖ్య తారలుగా జి.యల్.బి. శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఐక్యూ’. ‘పవర్ ఆఫ్ స్టూడెంట్’ అనేది ఉపశీర్షిక. కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన ఈ చిత్రం జూన్ 2న విడుదల కానుంది. కామెడీతో పరేషాన్ ‘మసూద’ ఫేమ్ తిరువీర్ హీరోగా, పావని కరణం హీరోయిన్గా రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వంలో తెర కెక్కిన చిత్రం ‘పరేషాన్’. రానా దగ్గుబాటి సమర్పణలో వాల్తేర్ ప్రొడక్షన్స్‌పై విశ్వతేజ్ రాచకొండ, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా జూన్ 2న విడుదలవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ చక్రవ్యూహం సహస్ర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత సావిత్రి నిర్మిస్తున్న చిత్రం "చక్రవ్యూహం" ది ట్రాప్. ఈ చిత్రంలో విలక్షణ నటుడు అజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి చెట్కూరి మధుసూధన్ దర్శకత్వం వహిస్తున్నారు. అప్పట్లో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ చివరిసారిగా ఈ సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ చిత్రం జూన్ 2న విడుదల కానుంది. (ఇది చదవండి: భారీ ధరకు ఆదిపురుష్ థియేట్రికల్ రైట్స్.. ఎన్ని కోట్లంటే?) ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే! నెట్‌ఫ్లిక్స్ ఫేక్ ప్రొఫైల్ -వెబ్‌సిరీస్- మే 31 ఎ బ్యూటిఫుల్ లైఫ్ -హాలీవుడ్- జూన్ 1 న్యూ ఆమ్స్టర్ డామ్ -వెబ్‌సిరీస్- జూన్ 1 ఇన్ఫినిటీ స్టోర్మ్ -హాలీవుడ్- జూన్ 1 స్కూప్ -హిందీ సిరీస్- జూన్ 2 మ్యానిఫెస్ట్ -వెబ్‌సిరీస్- జూన్2 జీ 5 విష్వక్ -తెలుగు- జూన్ 2 డిస్నీ+ హాట్‌స్టార్ సులైకా మంజిల్ -మలయాళం- మే 30 బుక్ మై షో ఈవిల్ డెడ్ రైజ్ -హాలీవుడ్- జూన్ 2 జియో సినిమా అసుర్ 2 -హిందీ సిరీస్- జూన్ 1 -
మీరు కూడా RGV లాగా మారిపోయారా ..!
-
వెంకటేష్,అభిరాం,నాగచైతన్యతో అసలు సినిమా చేయను ....
-
హీరోయిన్ గా తెలుగు అమ్మాయిలను ఎందుకు తీసుకోను అంటే..!
-
థియేటర్ లో పాప్ కార్న్ రేట్ల పై తేజ సంచలన కామెంట్స్
-
తేజ్ కామెడీ పంచెస్ చూస్తే నాన్ స్టాప్ గ నవ్వుతూనే ఉంటారు
-
రానా తమ్ముడిని హీరోగా పెట్టి సినిమా తీయడానికి కారణం ఏంటిఅంటే..
-
రానాతో నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేసిన డైరెక్టర్ తేజ
డైరెక్టర్ తేజ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ అహింస. ఈ సినిమాతో దగ్గుబాటి అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ మూవీ అనంతరం తన నెక్ట్స్ మూవీ రానాతో చేస్తానని తేజ ప్రకటించారు. అహింస ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన ఆయన ఈ మేరకు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'రానాతో నేను చేయబోయే సినిమా పేరు రాక్షస రాజు. ఈ సినిమాతో 45మంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేయాలని అనుకుంటున్నాను. ఆసక్తి ఉన్న వాళ్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు. రామానాయుడు స్వస్థలమైన చీరాల నుంచి కనీసం 10మంది ఆర్టిస్టులు కావాలి. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది' అంటూ తేజ వెల్లడించారు. గతంలో రానా-తేజ కాంబినేషన్లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి మూవీ సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో రాక్షస రాజు మూవీపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ హీరో కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. -
చీరాలలో ‘అహింస’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
నా తమ్ముడు అభిరామ్ ‘అహింస’ అలరిస్తుంది: రానా
సాక్షి, ప్రకాశం(చీరాల): మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు మనవడు, సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు తనయుడు ప్రముఖ హీరో దగ్గుబాటి రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ చిత్రరంగంలోకి అరంగ్రేటం చేస్తున్న మొదటి సినిమా అహింస ప్రీ రిలీజ్ వేడుక వైభవంగా జరిగింది. శనివారం రాత్రి చీరాలలో స్థానిక ఎన్‌ఆర్‌అండ్‌పీఎం హైస్కూల్ గ్రౌండ్స్‌లో ఈ వేడుక నిర్వహించారు. సినీ నటీనటులను చూసేందుకు వేల సంఖ్యలో సినీ అభిమానులు, దగ్గుబాటి అభిమానులు తరలి రావడం విశేషం. ఉదయభాను యాంకర్‌గా వ్యవహరించి ప్రేక్షకులను అలరించారు. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పాటలను పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్, హీరోయిన్ దీపిక దివని, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, డైరెక్టర్ తేజ, ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, వైఎస్సార్ సీపీ ఇన్చార్జి కరణం వెంకటేష్‌లు హాజరయ్యారు. (చదవండి: సీరియల్ హత్యలు, పోలీసుల ఈగో.. కేసు చేధిస్తారా?) ఎమ్మెల్యే బలరాం మాట్లాడుతూ రామానాయుడు కుటుంబం నుంచి మరో హీరో సినీ అరంగ్రేటం చేయడం శుభపరిణామమన్నారు. తెలుగు సినీఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దగ్గుబాటి కుటుంబం ఎన్నో సందేశాత్మక చిత్రాలను రూపొందించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిందన్నారు. నూతన హీరో అభిరామ్‌ను అందరు ఆదరించాలన్నారు. దగ్గుబాటి కుటుంబంతో తమకు సన్నిహిత కుటుంబ సంబంధాలు ఉన్నాయని నూతన సినీమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చీరాలలో నిర్వహించడం గొప్ప విషయమన్నారు. సినీరంగానికి, చిత్రాల నిర్మాణానికి చీరాల నియోజకవర్గం అనుకూలమన్నారు. అహింస చిత్రం ప్రేక్షకులు ఆదరించి బ్రహ్మాండమైన విజయాన్ని సాధించాలన్నారు. సినీ హీరో దగ్గుబాటి రానా మాట్లాడుతూ తన తమ్ముడు అభిరామ్ హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం అందరిని అలరిస్తుందని, ప్రేక్షకులు ఆదరించి విజయాన్ని చేకూర్చాలన్నారు. ప్రజల అభీష్టంతో ప్రేక్షకులను హత్తుకునేలా చిత్రాన్ని రూపొందించి చక్కని పాటలు, సంగీతం ఇచ్చామన్నారు. చీరాలతో మాకు విడదీయరాన్ని సంబంధం ఉందని తమ కుటుంబం సినీరంగం, సేవా కార్యక్రమాలు, రాజకీయాల్లో చెరగని ముద్రను పొందామని, నూతన నటీనటులను ప్రేక్షకులు ఆదరించాలని ఆయన కోరారు. -
అమ్మా, నాన్న చనిపోతే.. వారే అంతా పంచుకున్నారు: తేజ
దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'అహింస'. ఈ సినిమాలో గీతికా తివారి హీరోయిన్గా నటిస్తోంది. విభిన్న కథనాలతో సినిమాలను తెరకెక్కించే తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జూన్ 2న విడుదల థియేటర్లలో కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు తేజ. (ఇది చదవండి: ఉదయ్‌కిరణ్ డెత్ మిస్టరీ.. ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు: తేజ) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన బాల్యంలో ఎదురైన ఇబ్బందులను పంచుకున్నారు. తన చిన్నప్పుడు ఫుట్ పాత్ మీద పడుకున్న రోజుల గురించి తెలిపారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయానని.. ఆ తర్వాతే ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు చూశానని చెప్పుకొచ్చారు. తేజ మాట్లాడుతూ.. 'మేము చెన్నైలో ఉండేవాళ్లం. నాకు ఒక అక్క, ఒక చెల్లి. నా బాల్యంలో మాకు ఆస్తులు బాగానే ఉండేవి. నాకు ఊహ తెలిసే సరికి అమ్మ చనిపోయారు. ఆ బెంగతో నాన్న కొంతకాలానికే కన్నుమూశారు. ఆ పరిస్థితుల్లో మా భవిష్యత్తు తలకిందులైంది. మా బంధువులే మమ్మల్ని పంచుకున్నారు. అక్క ఒక చోట. నేనూ, చెల్లి మరో చోట ఉండాల్సి వచ్చింది. మమ్మల్ని చూసుకున్నందుకు వాళ్లు కూడా కొన్ని ఆస్తులు తీసుకున్నారు. అంతే కాకుండా ఓరోజు నన్ను ఆరు బయట పడుకోమన్నారు. నేను ఆ రోజు రాత్రే పారిపోయా. ఫుట్‌పాత్‌పై పడుకున్నా. ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చానంటే కేవలం సినిమా వల్లే.' అంటూ తను పడిన బాధలను వివరించారు. (ఇది చదవండి: మీ కోసమే వచ్చా.. సల్లు భాయ్‌కి ప్రపోజ్ చేసిన అమ్మాయి!) మహేశ్ బాబు హీరోగా నటించిన నిజం అనుకున్నంతగా ఆడకపోవడంతో సినిమాపై ఏకాగ్రత కోల్పోయానని అన్నారు. ఆ తర్వాత మా అబ్బాయికి ఆరోగ్యం బాగాలేక పోవడంతో సుమారు నాలుగేళ్లపాటు సినిమాకు దూరంగా ఉన్నానని తెలిపారు. నేనే రాజు నేనే మంత్రి మూవీతో తిరిగి హిట్ అందుకున్నా అని తేజ వెల్లడించారు. -
దగ్గుబాటి మల్టీస్టార్ లో నాగచైతన్య ...
-
తేజ ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమవుతున్నా
‘‘ఫలానా జానర్‌కు పరిమితం కాకుండా ఓ నటిగా డిఫరెంట్ సినిమాలు, పాత్రలు చేయాలని ఉంది’’ అన్నారు హీరోయిన్ గీతికా తివారి. దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘అహింస’. ఈ చిత్రంలో గీతికా తివారి హీరోయిన్గా నటించారు. తేజ దర్శకత్వంలో పి. కిరణ్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో గీతికా తివారి మాట్లాడుతూ– ‘‘మాది మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక యాక్టర్‌గా కొన్ని కమర్షియల్ యాడ్స్ చేశాను. ఆ తర్వాత సినిమాల్లోకి రావాలనుకున్నాను. తేజగారితో సినిమాలు చేసిన చాలామంది కొత్త నటీనటులు ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు. ఇలా కొత్తవారిని పరిచయం చేయడంలో తేజగారిది లక్కీ హ్యాండ్. ఆయన సినిమా ద్వారా ఇప్పుడు నేను హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అవుతుండటం చాలా సంతోషంగా ఉంది. ‘అహింస’లో చేసిన అహల్య పాత్ర నాకు పెద్ద సవాల్ అనిపించింది. కొన్ని సన్నివేశాలకు ఎక్కువ టేక్స్ తీసుకున్నాను. కానీ సింగిల్ టేక్‌లో పూర్తి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి’’ అని అన్నారు. -
హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న డైరెక్టర్ తేజ కుమారుడు
ప్రేమకథా చిత్రాలు తెరకెక్కించడంతో తనదైన మార్క్ చూపించిన దర్శకుల్లో డైరెక్టర్ తేజ ఒకరు. తెలుగులో జయం, నిజం, ఔనన్నా కాదన్నా, లక్ష్మీ కల్యాణం, నేనే రాజు నేనే మంత్రి వంటి పలు హిట్ చిత్రాలు తెరకెక్కించిన ఆయన రీసెంట్గా అహింస అనే సినిమాను రూపొందించారు. దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్‌ను ఈ సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నారు. గతంలోనూ అనేకమంది నటీనటులను డైరెక్టర్ తేజ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తేజ తన కొడుకు ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా అబ్బాయిని హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నా. తనకు ఇంట్రెస్ట్ ఉండటంతో విదేశాల్లో అందుకు సంబంధించిన కోర్సులు చేసి వచ్చాడు. చూడటానికి హ్యాండ్సమ్గానే ఉంటాడు. కానీ హీరోగా చేయడానికి అదొక్కటే సరిపోదు కదా.. ఇక మా అబ్బాయిని నేను డైరెక్ట్ చేయాలా లేక ఇంకెవరికైనా అప్పగించాలా అన్నది చూడాల్సి ఉంది అంటూ తేజ పేర్కొన్నారు. -
హీరోగా రానా సోదరుడు, ఆరోజే రిలీజ్ కానున్న అహింస
ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు తనయుడు, హీరో రానా సోదరుడు అభిరామ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం అహింస. తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గీతికా తివారీ హీరోయిన్. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి.కిరణ్ నిర్మించారు. కాగా అహింస సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 7న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. యూత్‌ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా అహింస ఉంటుంది అని చిత్రయూనిట్ పేర్కొంది. రజత్ బేడీ, సదా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవీ ప్రసాద్ నటించిన ఈ చిత్రానికి సమీర్ రెడ్డి కెమెరామన్‌గా వ్యవహరిస్తుండగా ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. A film engraved with rooted emotions & rustic characters🔥#Ahimsa -“A LOVE STORY NEVER TOLD BEFORE” - https://t.co/KUZbW0k8LK In Theatres WW on April 7th❤️🔥 A FILM by @tejagaru🎬@rppatnaik #Kiran #AbhiramMohanNarayan @Geethikaactor #Sadaa @AnandiArtsOffl @jungleemusicSTH pic.twitter.com/X5F22canuY — Suresh Productions (@SureshProdns) March 5, 2023 -
రానా తమ్ముడు నటించిన 'అహింస' ట్రైలర్ చూశారా?
ఓ యువకుడిని క్రిమినల్ కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారు. అతన్ని విడిపించడానికి ఓ క్రిమినల్ లాయర్ కేసును టేకప్ చేస్తుంది. గురువారం హీరో రామ్‌చరణ్ విడుదల చేసిన ‘అహింస’ ట్రైలర్లో కనిపించిన సన్నివేశాలు ఇవి. మరోవైపు అదే ట్రైలర్లో ఆ యువకుడు, ఓ యువతి ప్రేమలో ఉన్న సీన్లు కనబడతాయి. దివంగత ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు మనవడు, నిర్మాత సురేష్‌బాబు తనయుడు అభిరామ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అహింస’. గీతిక హీరోయిన్గా లాయర్ పాత్రలో సదా నటించిన ఈ చిత్రానికి తేజ దర్శకుడు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి పి. కిరణ్ నిర్మాత. త్వరలో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఆర్పీ పట్నాయక్, కెమెరా: సమీర్ రెడ్డి. -
యాక్షన్ ఎంటర్టైనర్గా రానా సోదరుడి ‘అహింస’
నిర్మాత సురేశ్‌బాబు తనయుడు, హీరో రానా సోదరుడు అభిరామ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అహింస’. తేజ దర్శకత్వంలో పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ, కొత్త పోస్టర్లను విడుదల చేసింది చిత్రయూనిట్. ‘‘యూత్‌ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘అహింస’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించిన ‘నీతోనే నీతోనే..’, ‘కమ్మగుంటదే..’ పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. త్వరలోనే సినిమాని థియేటర్లలో విడుదల చేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి. -
యంగ్ హీరో చెంప పగలగొట్టిన తేజ!
కొత్త నటులతో సినిమా తీయడంలో దర్శకుడు తేజ దిట్ట. టాలీవుడ్‌కి ఆయన చాలా మంది హీరోహీరోయిన్లను అందించాడు. . ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్ లాంటి యంగ్ హీరోలను తెలుగు తెరకు పరిచయం చేసిన గొప్ప డైరెక్టర్ ఆయన. అయితే షూటింగ్ సమయంలో తేజ కాస్త మొరటుగా ప్రవర్తిస్తాడట. తాను అనుకున్నట్లుగా సీన్ రాకపోతే నటీనటులపై చేయి చేసుకుంటాడని ఇండస్ట్రీలో టాక్. తాజాగా తేజ మరో యంగ్ హీరో చెంప పగలగొట్టాడట. ప్రస్తుతం తేజ ‘అహింస’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీని సురేశ్ బాబు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో అభిరామ్‌పై డైరెక్టర్ తేజ చేయి చేసుకున్నట్లు టీటౌన్ టాక్. షూటింగ్లో భాగంగా ఒక రోజు లెన్త్ సీన్ ప్లాన్ చేశాడట తేజ. ఆ సీన్లో నటించడానికి అభిరామ్ చాలా ఇబ్బంది పడ్డాడట. తేజ ఎన్నిసార్లు చెప్పినా.. సరిగా నటించలేదట. దీంతో తేజ అతనిపై చేయి చేసుకున్నాడట. దీంతో అభిరామ్ అలిగి..కొద్ది రోజుల పాటు షూటింగ్‌కి వెళ్లలేదట. చివరకి సురేశ్‌బాబు రంగంలోకి దిగి..కొడుకును బుజ్జగించి షూటింగ్‌కి పంపినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై తేజ గానీ, అభిరామ్ గానీ ఇంతవరకు స్పందించలేదు. -
'అహింస' నుంచి మరో లిరికల్ సాంగ్ రిలీజ్
దగ్గుబాటి అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు డైరెక్టర్ తేజ. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో అహింస అనే చిత్రం తెరకెక్కతుతున్న సంగతి తెలిసిందే. ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గీతికా హీరోయిన్గా నటిస్తోంది. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై పీ కిరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌ను విడుదల చేసిన మేకర్స్.. తాజాగా ఈ చిత్రం నుంచి కమ్మగుంటదే పిల్లా అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. చంద్ర బోస్ సాహిత్యం అందించిన ఈ పాటని కాలభైరవ – కీర్తన శ్రీనివాస ఆలపించారు. గ్రామీణ ప్రాంత నేపథ్యంలోని లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ పాట ఆకట్టుకుంటుంది. సదా, సముద్రఖని ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.