కొత్త నటులతో సినిమా తీయడంలో దర్శకుడు తేజ దిట్ట. టాలీవుడ్‌కి ఆయన చాలా మంది హీరోహీరోయిన్లను అందించాడు. . ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్ లాంటి యంగ్ హీరోలను తెలుగు తెరకు పరిచయం చేసిన గొప్ప డైరెక్టర్ ఆయన. అయితే షూటింగ్ సమయంలో తేజ కాస్త మొరటుగా ప్రవర్తిస్తాడట. తాను అనుకున్నట్లుగా సీన్ రాకపోతే నటీనటులపై చేయి చేసుకుంటాడని ఇండస్ట్రీలో టాక్. తాజాగా తేజ మరో యంగ్ హీరో చెంప పగలగొట్టాడట.
ప్రస్తుతం తేజ ‘అహింస’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీని సురేశ్ బాబు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో అభిరామ్‌పై డైరెక్టర్ తేజ చేయి చేసుకున్నట్లు టీటౌన్ టాక్. షూటింగ్‌లో భాగంగా ఒక రోజు లెన్త్ సీన్ ప్లాన్ చేశాడట తేజ. ఆ సీన్‌లో నటించడానికి అభిరామ్ చాలా ఇబ్బంది పడ్డాడట. తేజ ఎన్నిసార్లు చెప్పినా.. సరిగా నటించలేదట. దీంతో తేజ అతనిపై చేయి చేసుకున్నాడట. దీంతో అభిరామ్ అలిగి..కొద్ది రోజుల పాటు షూటింగ్‌కి వెళ్లలేదట. చివరకి సురేశ్‌బాబు రంగంలోకి దిగి..కొడుకును బుజ్జగించి షూటింగ్‌కి పంపినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై తేజ గానీ, అభిరామ్ గానీ ఇంతవరకు స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment