abhiram
-
Abhiram Wedding : టాలీవుడ్ హీరో రానా తమ్ముడి గ్రాండ్ వెడ్డింగ్ (ఫొటోలు)
-
Abhiram Daggubati Marriage: రానా తమ్ముడి అభిరామ్ పెళ్లి ఫిక్స్.. అమ్మాయి ఎవరంటే?
-
అభిరామ్‌ను ఇంటి నుంచి వెళ్లగొట్టారా? హీరో ఏమన్నాడంటే?
దగ్గుబాటి సురేశ్ రెండో తనయుడు అభిరామ్ అహింస సినిమాతో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో అతడు సినిమాలను పక్కనపెట్టి వ్యాపారరంగంపై ఫోకస్ పెట్టాడు. రైటర్స్ కేఫ్ పేరిట హైదరాబాద్‌లో ఓ కేఫ్ ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాల గురించి మాట్లాడాడు. నా కాళ్లపై నిలబడాలనుకున్నా.. 'జీవితం అనేది అంత ఈజీ కాదు. వయసు పెరిగేకొద్దీ అన్నీ తెలిసొస్తాయి. తాతయ్య చనిపోయినప్పుడు జీవితం విలువ తెలిసొచ్చింది. బాధ్యతలు తెలుసుకున్నాను. సొంతంగా నా కాళ్లపై నిలబడాలనుకున్నాను. అందులో భాగంగానే కేఫ్ ప్రారంభించాను. కేఫ్ స్టార్ట్ చేయడం వల్ల ఇంట్లోవాళ్లు కోప్పడి నన్ను ఇంటి నుంచి వెళ్లిపోమన్నారంటూ వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. నిజానికి నాన్న, అన్నయ్య, బాబాయ్ నాకు రకరకాల సలహాలిస్తూ ఎంతగానో సాయం చేశారు. వ్యాపారం ఎలా చేయాలనేది నాన్న దగ్గరి నుంచి నేర్చుకున్నాను. కేఫ్ ఎలా నడపాలన్నది అన్న చెప్తూ ఉంటాడు. నేనే గ్యాప్ తీసుకున్నా.. నాకు, రానా అన్నకు మధ్య 10 ఏళ్ల వ్యత్యాసం ఉంది. తను నన్ను తమ్ముడిలా కాకుండా స్నేహితుడిలా ట్రీట్ చేస్తాడు. సినిమా అవకాశాలొస్తున్నాయి, కానీ నేనే గ్యాప్ తీసుకున్నాను. నటుడిగా నేను చాలా నేర్చుకోవాలి. అందుకే అహింస తర్వాత బ్రేక్ తీసుకున్నాను. యాక్షన్ లవ్‌స్టోరీలు చేయడమంటే ఇష్టం. నా పేరెంట్స్ ఎవరిని పెళ్లి చేసుకోమంటే వారిని చేసుకుంటాను. పెళ్లి విషయాన్ని వారికే వదిలేశాను' అని చెప్పుకొచ్చాడు అభిరామ్. చదవండి: నా భర్త రివర్స్ అయితే ఎవరూ పనికి రారు, డబుల్ ఇచ్చిపడేస్తాడు.. సందీప్ మాస్టర్ భార్య ఫైర్ -
పెళ్లి చేసుకోబోతున్న రానా తమ్ముడు! అమ్మాయి ఎవరంటే?
టాలీవుడ్లో మరో యువ నటుడు పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు రెండో కొడుకు అభిరామ్.. కొన్నాళ్ల ముందు 'అహింస' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయింది. దీంతో మరో మూవీ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అలానే ఇప్పుడు వివాహం కూడా చేసుకోనున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: పెళ్లిపై హీరో వరుణ్‌తేజ్ కామెంట్స్.. అలా చేసుకుంటానని!) ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా వెంకటేశ్ హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చారు. సురేశ్ బాబు నిర్మాతగా మారారు. ఇక సురేశ్ పెద్ద కొడుకు రానా.. హీరో కమ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫేమ్ తెచ్చుకోగా, రెండో కొడుకు అభిరామ్ ఈ మధ్యే హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఇప్పుడు అతడికే పెళ్లి చేయాలని పెద్దలు అనుకుంటున్నారట. ప్రస్తుతం మాటలు మాత్రమే జరిగాయని త్వరలో నిశ్చితార్థం, పెళ్లి వివరాలు వెల్లడిస్తారని తెలుస్తోంది. దగ్గుబాటి రామానాయుడు తమ్ముడి కూతురి కూతురే.. అభిరామ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని తెలుస్తోంది. అయితే ఈ విషయమై సురేశ్ బాబు ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బహుశా ఈ ఏడాది చివర్లో పెళ్లి ఉండే అవకాశముంది. అదే టైంలో మెగా ఫ్యామిలీలోనూ పెళ్లి బాజాలు మోగే అవకాశముంది. (ఇదీ చదవండి: విజయ్ దేవరకొండకు కాబోయే భార్యపై సామ్ కామెంట్స్ వైరల్) -
Ahimsa Movie Review: ‘అహింస’ మూవీ రివ్యూ
టైటిల్: అహింస నటీనటులు: అభిరామ్ దగ్గుబాటి, గీతికా తివారి, సదా, కల్పలత, కమల్ కామరాజు, దేవి ప్రసాద్ తదితరులు నిర్మాత : పి.కిరణ్ దర్శకత్వం : తేజ సంగీతం: ఆర్పీ పట్నాయక్ సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు విడుదల తేది : జూన్ 2, 2023 తెలుగు చిత్ర పరిశ్రమలో దగ్గుబాటి ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. రామా నాయుడు మొదలు రానా వరకు ఆ ఫ్యామిలీకి చెందిన ప్రతి ఒక్కరు తమదైన టాలెంట్‌తో ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. అలాంటి ఫ్యామిలీ నుంచి ఓ మరో హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారంటే.. ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడడం సహజం. అందుకే ‘అహింస’పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. సురేశ్ బాబు తనయుడు, రానా తమ్ముడు అభిరామ్ నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అభిరామ్ డెబ్యూ మూవీ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. రఘు(అభిరామ్) ఓ పేద రైతు. తల్లిదండ్రులు చిన్నప్పుడు చనిపోవడంతో మేన మామ, అత్త(దేవీ ప్రసాద్, కల్పలత)దగ్గర పెరుగుతాడు. రఘు మరదలు అహల్య(గీతికా తివారి)కి బావ అంటే చాలా ఇష్టం. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఓ రోజు అహల్య పొలం దగ్గరు ఉన్న రఘుకి టిఫిన్ బాక్స్ ఇచ్చి వెళ్తుంటే.. సిటీకి చెందిన ఇద్దరు కుర్రాళ్లు ఆమెపై హత్యాచారానికి పాల్పడుతారు. అనంతరం దారుణంగా కొట్టి అడవిలో పడేసి వెళ్తారు. తన మరదలికి జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తాడు రఘు. అతని ఓ మహిళా లాయర్ లక్ష్మీ(సదా)తోడుగా నిలుస్తుంది. నిందితులిద్దరూ బడా వ్యాపారవేత్త ధనలక్ష్మి దుష్యంతరావు(రజత్ బేడీ) కొడుకులు కావడంతో ధర్మ పోరాటంలో రఘు ఓడిపోతారు. అంతేకాదు తనకు సహాయం చేసిన లాయర్ లక్ష్మీ, ఆమె భర్తను ధనలక్ష్మీ దుష్కంతరావు దారుణంగా చంపేస్తాడు. అహింసా మార్గంలో వెళ్తే తనకు న్యాయం జరగది భావించిన రఘు.. హింసని ఎంచుకుంటాడు. తన మరదలిపై హత్యాచారానికి పాల్పడిన దుండగులను చంపేయాలని డిసైడ్ అవుతాడు. దాని కోసం రఘు ఏం చేశాడు? వారిని ఎలా చంపాడు? అడవుల్లో గంజాయి సాగు చేసే లుంబ్డి గ్యాంగ్.. రఘును చంపాలని ఎందుకు ప్రయత్నించింది? దుష్కంతరావు కనబడకుండా పోవడానికి కారణం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్లో అహింస మూవీ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్‌లో తేజ ఒకరు. ఒకప్పుడు ఆయన సినిమాలు ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించాయి. ఎంతో మంది హీరోలను తెలుగు తెరకు పరిచయం చేశాడు. చిత్రం, నువ్వు నేను, జయం లాంటి బ్లాక్ బస్టర్స్ అందించాడు. ఇక తేజ పని అయిపోందిలే అనుకుంటున్న సమయంలో రానాతో ‘నేనే రాజు నేను మంత్రి’ సినిమా తీసి మళ్లీ పుంజుకున్నాడు. ఆ తర్వాత ‘సీత’లాంటి డిజాస్టర్ మూవీని ఇచ్చినా.. ఈ సారి బ్లాక్ బస్టర్ పక్కా ఇస్తాడులే అని అభిమానులు ఎంతో నమ్మకంగా ఉన్నారు. కానీ తేజ వారి నమ్మకాన్ని కాపాడుకోలేకపోయాడనిపిస్తుంది. పాత కథ, రొటీన్ స్క్రీన్‌ప్లేతో ‘అహింస’ను తెరకెక్కించాడు. చాలా సన్నివేశాలు తేజ తెరకెక్కించిన ‘జయం’, ‘నువ్వు నేను’ ‘ధైర్యం’ చిత్రాలను గుర్తుకు తెస్తాయి. ఇక లాజిక్కుల గురించి మాట్లాడుకోకపోవడం మంచిదేమో. కానిస్టేబుల్ పతంగి ఎగిరేసి అడవిలో ఉన్న హీరోకి సమాచారం అందించడం, కోర్టులోకి హీరో ప్రవేశించిన తీరు, సాక్ష్యాల కోసం హీరో చేసే ప్రయత్నాలు.. ఇలా ఏ ఒక్కటి రియలిస్టిక్‌గా ఉండదు. పైగా కథ మొత్తాని లాగినట్లుగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే ఐటమ్ సాంగ్ అయితే మరీ దారుణం. ఇంట్లో శవాలను పెట్టుకొని ఐటమ్ పాట పాడించడం ఏంటో ఎవరీ అర్థం కాదు. అలాగే ఓ కానిస్టేబుల్ ఎందుకు వారికి సపోర్ట్‌గా నిలిచాడో అదీ తెలియదు. ఫస్టాఫ్ ఎండింగ్ సమయంలోనే క్లైమాక్స్ అర్థమైపోతుంది. సెకండాఫ్‌లో కథ మరీ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఒకనొక దశలో సినిమా ఇంకా అయిపోవట్లేదే అనే ఫీలింగ్ కలుగుతుంది. మొత్తంగా అహింస పేరుతో తేజ ప్రేక్షకులను హింసించారనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే.. అభిరామ్‌కు ఇది తొలి సినిమా. ఉన్నంతలో రఘు తన పాత్రకు న్యాయం చేసేందుకు ట్రై చేశాడు. తేజ కూడా అభిరామ్‌పై పెద్దగా భారం వేయకుండా సన్నివేశాలను రాసుకున్నాడు. కానీ కొన్ని చోట్ల అభిరామ్ అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక అహల్యగా గీతికా తివారి తనదైన నటనతో మెప్పించింది. తెరపై చాలా అందంగా కనిపించింది. పోలీస్ ఆఫీసర్‌గా కమల్ కామరాజు, లాయర్‌గా సదా తన పాత్రలకు న్యాయం చేశారు. విలన్‌గా నటించిన రజత్ బేడి, ఛటర్జీ పాత్ర పోషించిన వ్యక్తితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఆర్పీ పట్నాయక్ సంగీతం పర్వాలేదు. ‘ఉందిలే’ పాట మినహా మిగతావేవి అంతగా ఆకట్టుకోలేవు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రపీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
ఈ సినిమా కోసం మా అబ్బాయి చాలా కష్టపడ్డాడు
-
ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేనివాళ్లకు నేనున్నా
‘‘నేను ఫుట్‌పాత్ నుంచి ఈ స్థాయికి వచ్చాను. ప్రతిభ ఉన్నా ఇండస్ట్రీకి ఎలా రావాలో తెలియనివాళ్లు చాలామంది ఉన్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్లకు నేను బ్రేక్ ఇస్తాను.. నేనున్నంత వరకూ అవకాశాలు ఇస్తాను.. స్టార్ హీరోలతో సినిమా చేసినా అందులో కొత్తవారికి చాన్స్ ఇస్తాను’’ అని డైరెక్టర్ తేజ అన్నారు. అభిరామ్, గీతికా తివారీ జంటగా రూపొందిన చిత్రం ‘అహింస’. పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా తేజ చెప్పిన విశేషాలు. ► అభిరామ్‌ని హీరోగా పరిచయం చేస్తానని రామానాయుడుగారికి మాట ఇచ్చాను.. ఆ మాట కోసమే తనతో ‘అహింస’ చేశాను. సినీ నేపథ్యంలో ఉన్న పెద్ద కుటుంబాల్లోని వ్యక్తులతో చేసినప్పుడు సహజంగానే పోలికలు వస్తాయి. ఇప్పటికే స్టార్స్ అయిన వెంకటేశ్, రానాలతో అభిరామ్‌ని పోల్చకూడదు. ఎక్కువ డబ్బులు, పేరు కోసం పెద్ద స్టార్స్‌తో పని చేయాలి. నేను డబ్బులు, పేరు చూశాను.. నాకు ఇంకేం కావాలి? ► ప్రేక్షకులు చాలా తెలివైనవారు. ట్రైలర్‌ని చూసి సినిమాకి వెళ్లాలా? వద్దా అని నిర్ణయించుకుంటున్నారు. స్టార్ హీరోని బట్టి థియేటర్‌కి వెళతారనుకుంటే.. అప్పుడు పెద్ద స్టార్స్‌కి అపజయాలే రాకూడదు కదా! సినిమాలో ఎమోషన్ ఉంటే ట్రైలర్లో కనిపిస్తుంది. ప్రేక్షకులు ఆ ఎమోషన్‌కి కనెక్ట్ అయితే స్టార్ సినిమానా? కొత్తవారిదా అనే తేడా లేకుండా వచ్చేస్తారు. ► ఒక ఫిలాసఫీని బేస్ చేసి తీసిన చిత్రమిది. అహింసని ఎలా ఫాలో అవ్వాలి? అనే కాన్సెప్ట్‌తో మంచి కమర్షియల్ కథతో ఈ సినిమా చేశాం. ఇందులో దాదాపు 14 యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. ఓ నాలుగు ఎపిసోడ్స్‌కి నేనే ఫైట్ మాస్టర్‌గా చేశాను. ► అభిరామ్‌కి సినీ నేపథ్యం ఉంది. తనని పరిచయం చేస్తున్నప్పుడు నాకంటే అభీపైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. సురేశ్‌బాబుగారు ఒకసారి సెట్‌కి వచ్చారు. ‘నాన్నా.. నువ్వుంటే నేను చేయను’ అని అభి అనడంతో మానిటర్ వద్దకెళ్లి కూర్చున్నారాయన. ఇన్ని సినిమాలు చేసిన వెంకటేశ్‌గారు, రానాకి కూడా సురేశ్‌గారు సెట్‌కి వస్తే టెన్షన్ వచ్చేస్తుంది (నవ్వుతూ).. సురేశ్‌గారి దృష్టి వేరుగా ఉంటుంది. కిరణ్‌గారు రాజీ పడకుండా ఈ సినిమా తీశారు. ఈ మూవీకి ఆర్పీ పట్నాయక్ సంగీతం, అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం ప్లస్ అయ్యాయి. ► ‘అహింస’ విజయం సాధించి డబ్బులు వస్తే ఆ డబ్బుతో మళ్లీ సినిమాలు తీస్తాను. నా చిత్రం మూవీస్ బేనర్లో కొత్త దర్శకులని పరిచయం చేస్తాను. నా తర్వాతి సినిమా ‘రాక్షస రాజు’ని రానాతో చేస్తాను. ఆ తర్వాత మా అబ్బాయిని హీరోగా పరిచయం చేసే సినిమా చేస్తాను. -
అహింస కొత్తగా ఉంటుంది
‘‘అహింస’ కథ చాలా కొత్తగా ఉంటుంది.. కథ కొత్తగా ఉన్నప్పుడు పాట సహజంగానే కొత్తగా వినిపిస్తుంది. ఈ చిత్రం పాటలకు మంచి స్పందన వస్తోంది’’ అన్నారుసంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్. అభిరామ్, గీతికా తివారి జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అహింస’. పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా జూన్ 2న రిలీజ్ కానున్న సందర్భంగా ఈ చిత్ర సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ– ‘‘అహింస సిద్ధాంతం నమ్మే ఓ అబ్బాయిని పరిస్థితులు ఎలా కృష్ణతత్వంవైపు లాగాయనేది ఈ చిత్రకథ. నా దర్శకత్వంలో ఒక మ్యూజికల్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాను. ఎన్నికల నేపథ్యంలో ఓ కథ రెడీ చేశాను. నిర్మాతలు దొరికితే ఏడాదికి 4 చిత్రాలకు దర్శకత్వం వహిస్తా. వెబ్ సిరీస్ కోసం రెండు కథలు రాశాను’’ అన్నారు. -
మీరు కూడా RGV లాగా మారిపోయారా ..!
-
వెంకటేష్,అభిరాం,నాగచైతన్యతో అసలు సినిమా చేయను ....
-
నా తమ్ముడు అభిరామ్ ‘అహింస’ అలరిస్తుంది: రానా
సాక్షి, ప్రకాశం(చీరాల): మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు మనవడు, సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు తనయుడు ప్రముఖ హీరో దగ్గుబాటి రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ చిత్రరంగంలోకి అరంగ్రేటం చేస్తున్న మొదటి సినిమా అహింస ప్రీ రిలీజ్ వేడుక వైభవంగా జరిగింది. శనివారం రాత్రి చీరాలలో స్థానిక ఎన్‌ఆర్‌అండ్‌పీఎం హైస్కూల్ గ్రౌండ్స్‌లో ఈ వేడుక నిర్వహించారు. సినీ నటీనటులను చూసేందుకు వేల సంఖ్యలో సినీ అభిమానులు, దగ్గుబాటి అభిమానులు తరలి రావడం విశేషం. ఉదయభాను యాంకర్‌గా వ్యవహరించి ప్రేక్షకులను అలరించారు. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పాటలను పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్, హీరోయిన్ దీపిక దివని, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, డైరెక్టర్ తేజ, ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, వైఎస్సార్ సీపీ ఇన్చార్జి కరణం వెంకటేష్‌లు హాజరయ్యారు. (చదవండి: సీరియల్ హత్యలు, పోలీసుల ఈగో.. కేసు చేధిస్తారా?) ఎమ్మెల్యే బలరాం మాట్లాడుతూ రామానాయుడు కుటుంబం నుంచి మరో హీరో సినీ అరంగ్రేటం చేయడం శుభపరిణామమన్నారు. తెలుగు సినీఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దగ్గుబాటి కుటుంబం ఎన్నో సందేశాత్మక చిత్రాలను రూపొందించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిందన్నారు. నూతన హీరో అభిరామ్‌ను అందరు ఆదరించాలన్నారు. దగ్గుబాటి కుటుంబంతో తమకు సన్నిహిత కుటుంబ సంబంధాలు ఉన్నాయని నూతన సినీమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చీరాలలో నిర్వహించడం గొప్ప విషయమన్నారు. సినీరంగానికి, చిత్రాల నిర్మాణానికి చీరాల నియోజకవర్గం అనుకూలమన్నారు. అహింస చిత్రం ప్రేక్షకులు ఆదరించి బ్రహ్మాండమైన విజయాన్ని సాధించాలన్నారు. సినీ హీరో దగ్గుబాటి రానా మాట్లాడుతూ తన తమ్ముడు అభిరామ్ హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం అందరిని అలరిస్తుందని, ప్రేక్షకులు ఆదరించి విజయాన్ని చేకూర్చాలన్నారు. ప్రజల అభీష్టంతో ప్రేక్షకులను హత్తుకునేలా చిత్రాన్ని రూపొందించి చక్కని పాటలు, సంగీతం ఇచ్చామన్నారు. చీరాలతో మాకు విడదీయరాన్ని సంబంధం ఉందని తమ కుటుంబం సినీరంగం, సేవా కార్యక్రమాలు, రాజకీయాల్లో చెరగని ముద్రను పొందామని, నూతన నటీనటులను ప్రేక్షకులు ఆదరించాలని ఆయన కోరారు. -
రానా తమ్ముడు హీరోగా 'అహింస'.. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు తనయుడు, రానా సోదరుడు అభిరామ్ అహింస చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిరామ్‌కు జోడీగా గీతికా తివారీ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్ డేట్ పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం జూన్2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈనెల 27న ఆంధ్రప్రదేశ్ చీరాలలోని ఎన్ఆర్పీఎం హైస్కూల్ గ్రౌండ్లో ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ పోస్టర్‌ను వదిలారు. ఇక ఈ ఈవెంట్‌కు పలువురు టాలీవుడ్ పెద్దలు రానున్నట్లు సమాచారం. -
రానా తమ్ముడు హీరోగా 'అహింస'.. రిలీజ్ డేట్ ఫిక్స్
నిర్మాత సురేష్ బాబు తనయుడు, హీరో రానా సోదరుడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం అహింస. తేజ దర్శకత్వంలో పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా జూన్2న రిలీజ్ కానుంది. లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం అహింస. చదవండి: ‘తొలిప్రేమ’ తర్వాత అవకాశాలు వచ్చినా కాదనుకున్నాను: వాసుకి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. సినిమా కూడా అందర్నీ అలరించేలా ఉంటుంది అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం ఆర్పీ పట్నాయక్, కెమెరా సమీర్ రెడ్డి -
రానా తమ్ముడు నటించిన 'అహింస' ట్రైలర్ చూశారా?
ఓ యువకుడిని క్రిమినల్ కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారు. అతన్ని విడిపించడానికి ఓ క్రిమినల్ లాయర్ కేసును టేకప్ చేస్తుంది. గురువారం హీరో రామ్‌చరణ్ విడుదల చేసిన ‘అహింస’ ట్రైలర్లో కనిపించిన సన్నివేశాలు ఇవి. మరోవైపు అదే ట్రైలర్లో ఆ యువకుడు, ఓ యువతి ప్రేమలో ఉన్న సీన్లు కనబడతాయి. దివంగత ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు మనవడు, నిర్మాత సురేష్‌బాబు తనయుడు అభిరామ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అహింస’. గీతిక హీరోయిన్గా లాయర్ పాత్రలో సదా నటించిన ఈ చిత్రానికి తేజ దర్శకుడు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి పి. కిరణ్ నిర్మాత. త్వరలో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఆర్పీ పట్నాయక్, కెమెరా: సమీర్ రెడ్డి. -
యాక్షన్ ఎంటర్టైనర్గా రానా సోదరుడి ‘అహింస’
నిర్మాత సురేశ్‌బాబు తనయుడు, హీరో రానా సోదరుడు అభిరామ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అహింస’. తేజ దర్శకత్వంలో పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ, కొత్త పోస్టర్లను విడుదల చేసింది చిత్రయూనిట్. ‘‘యూత్‌ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘అహింస’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించిన ‘నీతోనే నీతోనే..’, ‘కమ్మగుంటదే..’ పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. త్వరలోనే సినిమాని థియేటర్లలో విడుదల చేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి. -
యంగ్ హీరో చెంప పగలగొట్టిన తేజ!
కొత్త నటులతో సినిమా తీయడంలో దర్శకుడు తేజ దిట్ట. టాలీవుడ్‌కి ఆయన చాలా మంది హీరోహీరోయిన్లను అందించాడు. . ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్ లాంటి యంగ్ హీరోలను తెలుగు తెరకు పరిచయం చేసిన గొప్ప డైరెక్టర్ ఆయన. అయితే షూటింగ్ సమయంలో తేజ కాస్త మొరటుగా ప్రవర్తిస్తాడట. తాను అనుకున్నట్లుగా సీన్ రాకపోతే నటీనటులపై చేయి చేసుకుంటాడని ఇండస్ట్రీలో టాక్. తాజాగా తేజ మరో యంగ్ హీరో చెంప పగలగొట్టాడట. ప్రస్తుతం తేజ ‘అహింస’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీని సురేశ్ బాబు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో అభిరామ్‌పై డైరెక్టర్ తేజ చేయి చేసుకున్నట్లు టీటౌన్ టాక్. షూటింగ్లో భాగంగా ఒక రోజు లెన్త్ సీన్ ప్లాన్ చేశాడట తేజ. ఆ సీన్లో నటించడానికి అభిరామ్ చాలా ఇబ్బంది పడ్డాడట. తేజ ఎన్నిసార్లు చెప్పినా.. సరిగా నటించలేదట. దీంతో తేజ అతనిపై చేయి చేసుకున్నాడట. దీంతో అభిరామ్ అలిగి..కొద్ది రోజుల పాటు షూటింగ్‌కి వెళ్లలేదట. చివరకి సురేశ్‌బాబు రంగంలోకి దిగి..కొడుకును బుజ్జగించి షూటింగ్‌కి పంపినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై తేజ గానీ, అభిరామ్ గానీ ఇంతవరకు స్పందించలేదు. -
నాపై వాలే ఒక్క నవ్వు చాలే!
యష్‌రాజ్, నవమి గాయక్ జంటగా రామ కృష్ణార్జున్ దర్శకత్వంలో జింకా శ్రీనివాసులు నిర్మించిన చిత్రం ‘అభిరామ్’. మీనాక్షీ భుజంగ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘చాలే చాలే ఇంకా చాలే.. నాపై వాలే ఒక్క నవ్వు చాలే’ అంటూ సాగే పాటను దర్శకుడు శివ నిర్వాణ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ పాట వింటుంటే ఇంకా వినాలనిపించేలా ఉంది. సంగీత దర్శకుడు మీనాక్షీ భుజంగ్ ఈ పాటను పాడటం బాగుంది. కిరణ్ కొరియోగ్రఫీ, సాగర్ నారాయణ లిరిక్స్ బాగున్నాయి. ఈ సినిమా యూనిట్‌కి పేరు తీసుకురావాలి’’ అన్నారు. ‘‘త్వరలో మా సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు రామకృష్ణార్జున్. ‘‘లవ్, యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ ఉన్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు జింకా శ్రీనివాసులు. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:ఉల్లగంటి ప్రసాద్. -
దగ్గుబాటి రానా తమ్ముడి ‘అహింస’.. ప్రీ లుక్ పోస్టర్ వైరల్
Rana Daggubati Brother Debut Movie First Look: దర్శకుడి తేజ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్ లాంటి యంగ్ హీరోలను తెలుగు తెరకు పరిచయం చేసిన గొప్ప డైరెక్టర్ ఆయన. ఒకప్పుడు తేజ చిత్రాలకు యమ క్రేజ్ ఉండేది. పలువురు యంగ్ హీరో,హీరోయిన్లు తేజ దర్శకత్వంలో నటించాలని ఆశ పడేవారు. అయితే ఇటీవల కాలంలో తేజను వరుస ప్లాపులు పలకరించాయి. చాలా కాలం తర్వాత రానాతో ‘నేనే రాజు నేనే మంత్రి’మూవీ తీసి హిట్ కొట్టాడు. అయితే ఈ విజయాన్ని అలాగే కొనసాగించడంతో తేజ విఫలం ఆయ్యాడు. ఆ మూవీ తర్వాత తేజ తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.దీంతో తేజ కాస్త విరామం తీసుకొని.. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరోని పరిచయం చేసేందుకు సిద్దమయ్యాడు. రానా తమ్ముడు అభిరామ్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు తేజ. నేడు(ఫిబ్రవరి 22) తేజ బర్త్‌డే. ఈ సందర్భంగా ఈ చిత్రంకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్, టైటిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ సినిమాకి అహింస అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. అభిరామ్ ముఖం కనిపించకుండా కళ్ళవరకూ గోనె సంచితో కట్టేసి ఉండగా.. అతడి నోటి నుంచి రక్తం కారుతూ ఉండే లుక్ ఆకట్టుకుంటోంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. అహింసా పరమో ధర్మః, ధర్మహింసా తధైవచ !! Presenting the Fierce Pre Look Poster of #AbhiramDaggubati’s #AHIMSA 🩸 A Film by @tejagaru 🎬 Principal Shoot Completed 🤘#Kiran @rppatnaik #SameerReddy @boselyricist @AnandiArtsOffl #HappyBirthdayTeja pic.twitter.com/AfBZsky3XA — Suresh Productions (@SureshProdns) February 22, 2022 -
సాక్షిటీవీ రిపోర్టర్ అభిరామ్‌పై టీడీపీ గుండాల దాడి
-
ఎన్టీఆర్ తన పిల్లల ఫొటోలు, వీడియోలు ఎందుకు షేర్ చేయరంటే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిన్నటితో (మే 20) 38వ వసంతంలోకి అడుగు పెట్టాడు. గురువారం ఆయన బర్త్‌డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, దర్శక-నిర్మాతలు పుట్టిన రోజు శుభాకంక్షలు తెలపగా.. పరిశ్రమకు చెందిన కొందరు ఎన్టీఆర్ సన్నిహితులు ఆయనతో తమకు అనుబంధం గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అలాగే ఆయన పీఆర్ఓ మహేశ్ కోనేరు ఎన్టీఆర్ తన పిల్లలతో ఎలా ఉంటారు, వారు ఇంట్లో చేసే అల్లరి గురించి చెప్పాడు. అంతేగాక అభిరామ్, భార్గవ్ రామ్‌ల గురించి పలు ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మిగతా సెలబ్రెటీల మాదిరిగా తన పిల్లల వీడియోలను, ఫొటోలను సోషల్ మీడియాలో కానీ మీడియాతో పంచుకోవడం చాలా అరుదు. వారిని ఎప్పుడు మీడియాకు, పబ్లిక్కు దూరంగా ఉంచుతారు. మూవీ వేడుకలకు కూడా పెద్దగా తీసుకువచ్చింది లేదు. దీనికి కారణం ఏంటో ఈ సందర్భంగా పీఆర్ఓ మహేశ్ కోనేరు వెల్లడించారు. ‘ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభిరామ్‌కు సిగ్గు, మొహమాటం ఎక్కువ, అసలు అల్లరి చేయడు, చాలా కామ్‌గా ఉంటాడు. ఇక చిన్న కుమారుడు భార్గవ్ రామ్, అభిరామ్‌కు పూర్తిగా భిన్నం. చాలా అల్లరి. ఒక్కచోట కుదురుడుగా ఉండడు. చాలా చురుగ్గా ఉంటాడు. అచ్చం తన తండ్రి ఎన్టీఆర్ లాగే. ఇక అభి, భార్గవ్‌లు ఒకరి కంపెనీని ఒకరు చాలా ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు. అలాగే ఎన్టీఆర్ సాధ్యమైనంత వరకు వారికి ఎక్కువ సమయం కేటాయించేందుకు ప్రయత్నిస్తారని కూడా చెప్పాడు. ఇక తన పిల్లల వీడియోలను ఎన్టీఆర్ ఎందుకు విడుదల చేయరో చెబుతూ.. ‘తన పిల్లలను మీడియాకు, పబ్లిక్ దృష్టికి దూరంగా ఉంచాలనుకుంటాడు. ఎందుకంటే ఆయన స్టార్డమ్ వారి బాల్యాన్ని ప్రభావితం చేయకూడదని ఆయన భావిస్తారు. అది ఆయనకు ఇష్టం కూడా లేదు. అందుకే అభి, భార్గవ్‌లకు సంబంధించిన ఫొటోలను కానీ, వీడియోలను ఎక్కువగా పంచుకోరు’ అంటూ పీఆర్ఓ మహేశ్ చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవల ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కుటుంబంతో కలిసి హోం క్వారంటైన్లో ఉన్న ఆయన.. తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు ఇటీవల ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. -
హీరోగా రానా తమ్ముడు.. ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
దగ్గుబాటి కుటుంబం నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం కానున్నారు. దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ రీఎంట్రీకి అంతా సిద్ధమైంది. అతి త్వరలోనే ఓ ప్రముఖ దర్శకుడితో అభిరామ్ సినిమా చేయనున్నారు. ఇప్పటికే వంశీ, తరుణ్ భాస్కర్, రవి బాబులతో చర్చలు జరిగినా అవి వర్కవుట్ కాలేదు. ఫైనల్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో ఓ స్ర్కిప్ట్‌ను సురేష్‌బాబు ఓకే చేసినట్లు సమాచారాం. దీంతో అతి త్వరలోనే అభిరామ్‌ను గ్రాండ్‌గా పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారు సురేష్‌బాబు. ఇది వరకే తేజ దర్శకత్వంలో రానా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి సినిమా విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ నమ్మకంతోనే అభిరామ్‌కు కూడా డెబ్యూ మూవీతోనే హిట్ కొట్టించాలని ప్లాన్ చేస్తున్నారట. అంతేకాకుండా తేజ డైరెక్ట్ చేసే ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన..త్వరలోనే ఓ మంచి ప్రాజెక్ట్ ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నట్లు చెప్పారు. దీంతో ఆర్పీ పట్నాయక్ అభిరామ్ మూవీకి సంగీతం అందించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక తేజ- ఆర్పీ పట్నాయక్ కాంబినేషన్లో ఇప్పటికే జయం, నీ స్నేహం,నువ్వు నేను వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి : సిద్ శ్రీరామ్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటాడో తెలుసా? మన శరీరం కేవలం అందుకోసమే కాదు కదా : రేణు దేశాయ్ -
హీరోగా రానా తమ్ముడి ఎంట్రీ ఫిక్స్!
దగ్గుబాటి అభిరామ్.. ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు చిన్న కొడుకు ఇతడు. అదిగో వస్తున్నాడు, ఇదిగో వస్తున్నాడు అంటూ కొన్నేళ్లుగా అతడి సినిమా ఎంట్రీ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. చివరికి అవి నిజమవకుండా మిగిలిపోతూ వచ్చాయి. తాజాగా మరోసారి అతడి రంగప్రవేశం గురించి సిన్మా దునియాలో గుసగుసలు మొదలయ్యాయి. నటుడు, నిర్మాత రవిబాబుతో అభిరామ్ తొలి సినిమా తీయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సాదాసీదా కథలు కాకుండా ఓ వెరైటీ కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. ఈ పాటికే రవిబాబు తను సిద్ధం చేసిన కథను సురేశ్ బాబుకు వినిపించగా అతడికి నచ్చిందని అంటున్నారు. అయితే మరిన్ని చర్చలు జరిపిన తర్వాతే ఈ సినిమా ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ సారైనా అభిరామ్ హీరో ఎంట్రీ ఖాయం కానుందా? లేదా మరింత ఆలస్యం కానుందా? అన్నది తెలియాల్సి ఉంది. చదవండి: రూ.50 కోట్ల మార్క్ చేరుకున్న 'లవ్ స్టోరీ' కామ్రేడ్‌గా చరణ్.. ఆచార్య సెట్లో నాన్నతో ఇలా.. -
రైతుని కాపాడండి
‘‘సింహరాశి, శివరామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఎవడైతే నాకేంటి, అధినేత వంటి పలు హిట్ చిత్రాలు తీసిన వి.సముద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జై సేన... ది పవర్ అఫ్ యూత్’. శ్రీకాంత్, సునీల్, శ్రీ ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రవీణ్, కార్తికేయ, హరీష్, అభిరామ్‌లు హీరోలుగా పరిచయమవుతున్నారు. శివ మహాతేజ ఫిలిమ్స్‌పై సాయి అరుణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్యాచ్ వర్క్ మినహా పూర్తయింది. సముద్ర మాట్లాడుతూ– ‘‘దేశానికి వెన్నెముక అయిన రైతుని కాపాడండి అంటూ ప్రభుత్వంతో, రాజకీయ నాయకులతో విద్యార్థులు చేసే యుద్ధమే ఈ సినిమా. మంచి సందేశం ఉన్న ఈ చిత్రం నాకు మరో హిట్ అవుతుంది. ఇందులో ఇద్దరు ప్రముఖ హీరోలు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను త్వరలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకి కెమెరా: వాసు, మ్యూజిక్: ఎస్ఆర్ రవిశంకర్, సహ నిర్మాతలు: శిరీష్ రెడ్డి, శ్రీనివాస్. -
బుడతల్లారా.. ఉడతల్లారా!
స్కూలు వదలగానే నాలుగో తరగతి చదువుతున్న అభిరామ్, భాస్వంత్‌లు కొందరు స్నేహితులతో కలిసి పక్కనే ఉన్న పార్కుకి వెళ్లి జారుడు బల్ల, ఉయ్యాల, దాగుడు మూతలు.. ఎంతో సంబరంగా అడుకున్నారు. తర్వాత ఇసుకలో దూదుం పుల్ల ఆడుతున్నారు. వారి ఆటలకు సంబరపడుతూ నింగినుంచి మహాకవి శ్రీశ్రీ కిందికి దిగారు. ఆ చిన్నారులను దగ్గర కూర్చోబెట్టుకున్నారు. ఆయనకు తను రాసిన కవిత్వం స్ఫురించింది.‘‘మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకసమున హరివిల్లు విరిస్తేఅవి మీకే అని ఆనందించే కూనల్లారా... ఈలలు వేస్తూ ఎగురుతు పోయే పిల్లల్లారా పిల్లల్లారాగరిక పచ్చ మైదానాల్లోనూ తామరపూవుల కోనేరులలోపంట చేలలో బొమ్మరిళ్లలో తండ్రి పందిటా తల్లి కౌగిటానోళుల వ్రేళులు, పాలబుగ్గలూ ఎక్కడ చూస్తే అక్కడ మీరైవిశ్వరూపమున విహరిస్తుండే పరమాత్మలు ఓ చిరుతల్లారాఉడుతల్లారా బుడతల్లారా ఇది నా గీతం... వింటారా...’’ అంటూ శైశవగీతి వినిపించాడు.పాట వింటున్న బుడతలు, ‘తాతా! మాకు హరివిల్లు ఎలా ఉంటుందో తెలియదు, గరికపచ్చ మైదానాలు, తామర కొలనులు ఏవీ తెలియవు. అవన్నీ ఎక్కడ ఉంటాయి’ అని అమాయకంగా ప్రశ్నించారు. శ్రీశ్రీ నోట మాట రాలేదు. ఆ పసికూనలకు ఎక్కడ ఎలా చూపించాలో తెలియలేదు.‘మీ స్కూల్ టీచర్లు ఇవేవీ చూపించలేదా, మీ అమ్మానాన్నలు వీటి గురించి చెప్పలేదా’ అని అడిగాడు. అందుకు ఆ చిన్నారులు, ‘లేదు తాతా!’’ అన్నారు. వారి స్థితికి చింతిస్తూ, బరువెక్కిన గుండెతో మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు శ్రీశ్రీ.అంతలోనే యశోదమ్మ వచ్చింది, ‘ఓయమ్మ మీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగ మననీడమ్మా, పోయెదమెచ్చటికైనను మాయన్నుల సురభులాన మంజులవాణీ’ అని చదివాడు కాస్త తెలుగు తెలిసిన పెద్ద బుడతడు. ఆ మాటలు చెవిన పడ్డాయో లేదో యశోదలోని మాతృత్వం బయటకు వచ్చింది, ‘ఏం నాయనా! ఇలా నా కుమారుడి మీద నేరాలు చెబుతున్నారు’ అని అడిగింది. ‘అవ్వా! మీ అబ్బాయి ఇంత అల్లరి చేస్తే నువ్వు ఎన్నడూ కొట్టలేదా’ అని అడిగారు. ‘కొట్టలేదురా పిల్లలూ! మీలాంటి చిట్టిచిట్టి పిల్లలు అల్లరి చేస్తేనే సరదాగా ఉంటుంది. ఇరుగుపొరుగమ్మలు నేరాలు చెప్పినా, చిన్నారి కృష్ణుడు ఏం చేశాడో తెలుసుకుని, అది పెద్ద తప్పయితే, నెమ్మదిగా మందలించేదాన్ని. చిన్నపిల్లలు దేవుడితో సమానం, అందుకే పిల్లలు అల్లరి చేసినా దేవుడి చేష్టగానే భావించేదాన్ని’’ అని చెప్పి వెళ్లిపోయింది యశోద. చిన్నారులకు ఆ యశోదమ్మ పిల్లవాడిని కొట్టలేదన్న విషయం అర్థమైంది. ‘శ్రీశ్రీ తాతయ్య, యశోద అమ్మమ్మ మాటలు వింటుంటే నాకు కూడా తాతయ్య ఇంటికి వెళ్లాలనుంది’ అన్నాడు ఒక చిన్నారి.‘నాకూ వెళ్లాలనే ఉంది. కాని స్కూల్‌కి సెలవులు ఉండవుగా. ఒకవేళ ఇచ్చినా, ఏవో ఒకటి నేర్చుకోమంటుంది అమ్మ’ అంటూ దిగాలుగా అన్నాడు మరో చిన్నారి. వీళ్ల మాటలు వింటున్న దశరథుడు వారి దగ్గరగా వచ్చి, ‘నాయనలారా! ఎందుకురా ఇలా డీలాపడుతున్నారు’ అని ప్రశ్నించాడు. ‘తాతా! రాముడు ఒకసారి చందమామ కావాలి అని ఏడుస్తుంటే, నువ్వు అద్దం తీసుకువచ్చి ఆ అద్దంలో చందమామను చూపించావు. చందమామ కోసం పేచీ పెట్టాడని కొట్టలేదు కదా! కాని మా అమ్మనాన్నలు నేను ఏది అడిగినా తెచ్చివ్వకపోగా గట్టిగా కోప్పడతారు. అంతేనా ఒకసారి నేను పార్కుకి తీసుకెళ్లమని అడిగినందుకు నన్ను హాస్టల్లో చేర్పించేశారు’’ అంటూ ముఖం చిన్నబుచ్చుకున్నాడు. దశరథుడి పితృహృదయం పరితపించింది. నా రామచంద్రుడు అరణ్యాలకు వెళ్లినందుకేగా నేను విలపించి విలపించి మరణించాను. మరి నేటి తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎందుకు ఇంత కఠినంగా ఉంటున్నారు అనుకున్నాడు. చిన్నారులకు కొద్దిసేపు ఒడిలోకి తీసుకుని, సముదాయించి, బుజ్జగించి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఆటల సమయం మించిపోవడంతో ఆ చిన్నారులంతా ఇంటికి వెళ్లిపోయారు. ఆ రాత్రంతా వారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు. వారి ఆనందానికి అవధులు లేవు. అందమైనది బాల్యంరాముడు, కృష్ణుడు, వివేకానందుడు.. ఎందరో మహానుభావులు బాల్యాన్ని అందంగా అనుభవించారు. విశాలమైన ఆటస్థలంలో ఆడుకున్నారు. అమ్మనాన్నల ప్రేమను సంపూర్ణంగా ఆస్వాదించారు. సెలవులకి తాతయ్యల ఇళ్లకు వెళ్లి వారి దగ్గర కథలు విన్నారు, వారు పెట్టే సున్నుండలు తిన్నారు, ఎండల్లో మామిడిచెట్లు ఎక్కారు, వానలో పడవలు వేశారు, చలిలో చలి మంటలు వేసుకున్నారు. గాలిలో గాలిపటాలు ఎగురవేశారు... పంచభూతాలతో చెట్టపట్టాలేసుకుని ఆడుకున్నారు. వారి జీవితం నిజమైన శైశవగీతి అయ్యింది. – డా. వైజయంతి పురాణపండ -
సాఫ్ట్‌బాల్ కెప్టెన్‌గా అభిరామ్
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర బాలబాలికల జట్లను గురువారం ప్రకటించారు. బాలుర జట్టుకు అభిరామ్ రెడ్డి, బాలికల జట్టుకు అంజలి కెప్టెన్లుగా ఎంపికయ్యారు. శనివారం నుంచి ఈనెల 11 వరకు ఒడిశాలోని కటక్‌లో జాతీయ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ జరుగుతుంది. జట్ల వివరాలు బాలురు: పి. అభిరామ్ రెడ్డి (కెప్టెన్), తిరుపతి, పి. మణికంఠ, ఆర్. బంతిలాల్, బి.సేవాలాల్, ఆర్. ప్రవీణ్, కె. గోపాల్, జె. కృష్ణారెడ్డి, కె. సురేందర్, ఆర్. హేమంత్, బి. బాలాజీ, బి. తరుణ్, ఎన్. శివప్రసాద్, ఏ. నితీశ్, జి.ధనుశ్, ఏ రాజ్‌కిషోర్, కె. నిఖిల్, బి. గౌత్మ్ కుమార్, ఎం. శ్రీకాంత్, బి. సంతోష్ (కోచ్). బాలికలు: బి. అంజలి (కెప్టెన్), జి. మమత, మయూరి, కె. సంస్కృతి, జి. ప్రమీల, ఎం. ప్రియరచన, వి. సరోజ, పి. అర్చన, జి. వినీల, కె. మౌనిక, పి. భాగ్యశ్రీ, బి. స్రవంతి, ఎస్కే హసియా బేగం, వై. నూతన, ఎం. జానవి, జి. నాగజ్యోతి, ఎం. ఝాన్సీ, ఎల్.అంజలి, ఎన్. కపిల్ వర్మ, రాజ్ కుమార్ (కోచ్).