దగ్గుబాటి సురేశ్ రెండో తనయుడు అభిరామ్ అహింస సినిమాతో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో అతడు సినిమాలను పక్కనపెట్టి వ్యాపారరంగంపై ఫోకస్ పెట్టాడు. రైటర్స్ కేఫ్ పేరిట హైదరాబాద్‌లో ఓ కేఫ్ ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాల గురించి మాట్లాడాడు.
నా కాళ్లపై నిలబడాలనుకున్నా..
'జీవితం అనేది అంత ఈజీ కాదు. వయసు పెరిగేకొద్దీ అన్నీ తెలిసొస్తాయి. తాతయ్య చనిపోయినప్పుడు జీవితం విలువ తెలిసొచ్చింది. బాధ్యతలు తెలుసుకున్నాను. సొంతంగా నా కాళ్లపై నిలబడాలనుకున్నాను. అందులో భాగంగానే కేఫ్ ప్రారంభించాను. కేఫ్ స్టార్ట్ చేయడం వల్ల ఇంట్లోవాళ్లు కోప్పడి నన్ను ఇంటి నుంచి వెళ్లిపోమన్నారంటూ వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. నిజానికి నాన్న, అన్నయ్య, బాబాయ్ నాకు రకరకాల సలహాలిస్తూ ఎంతగానో సాయం చేశారు. వ్యాపారం ఎలా చేయాలనేది నాన్న దగ్గరి నుంచి నేర్చుకున్నాను. కేఫ్ ఎలా నడపాలన్నది అన్న చెప్తూ ఉంటాడు.
నేనే గ్యాప్ తీసుకున్నా..
నాకు, రానా అన్నకు మధ్య 10 ఏళ్ల వ్యత్యాసం ఉంది. తను నన్ను తమ్ముడిలా కాకుండా స్నేహితుడిలా ట్రీట్ చేస్తాడు. సినిమా అవకాశాలొస్తున్నాయి, కానీ నేనే గ్యాప్ తీసుకున్నాను. నటుడిగా నేను చాలా నేర్చుకోవాలి. అందుకే అహింస తర్వాత బ్రేక్ తీసుకున్నాను. యాక్షన్ లవ్‌స్టోరీలు చేయడమంటే ఇష్టం. నా పేరెంట్స్ ఎవరిని పెళ్లి చేసుకోమంటే వారిని చేసుకుంటాను. పెళ్లి విషయాన్ని వారికే వదిలేశాను' అని చెప్పుకొచ్చాడు అభిరామ్.
చదవండి: నా భర్త రివర్స్ అయితే ఎవరూ పనికి రారు, డబుల్ ఇచ్చిపడేస్తాడు.. సందీప్ మాస్టర్ భార్య ఫైర్
Comments
Please login to add a commentAdd a comment