
దగ్గుబాటి అభిరామ్.. ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు చిన్న కొడుకు ఇతడు. అదిగో వస్తున్నాడు, ఇదిగో వస్తున్నాడు అంటూ కొన్నేళ్లుగా అతడి సినిమా ఎంట్రీ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. చివరికి అవి నిజమవకుండా మిగిలిపోతూ వచ్చాయి. తాజాగా మరోసారి అతడి రంగప్రవేశం గురించి సిన్మా దునియాలో గుసగుసలు మొదలయ్యాయి. నటుడు, నిర్మాత రవిబాబుతో అభిరామ్ తొలి సినిమా తీయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
సాదాసీదా కథలు కాకుండా ఓ వెరైటీ కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. ఈ పాటికే రవిబాబు తను సిద్ధం చేసిన కథను సురేశ్ బాబుకు వినిపించగా అతడికి నచ్చిందని అంటున్నారు. అయితే మరిన్ని చర్చలు జరిపిన తర్వాతే ఈ సినిమా ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ సారైనా అభిరామ్ హీరో ఎంట్రీ ఖాయం కానుందా? లేదా మరింత ఆలస్యం కానుందా? అన్నది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment