
అభి షార్ట్ జర్నీ
వెండితెర వెనక్కి పంపినా.. తగ్గలేదు. తనలోని సృజనకు యుూట్యూబ్‌ను వేదికగా చేసుకున్నాడు. పొట్టి చిత్రాలతో గట్టి మెసేజ్‌లిస్తూ లక్షల్లో లైక్స్ కొట్టేస్తున్నాడు అభిరామ్. ఎంబీఏ పూర్తి చేసిన ఈ కుర్రాడు ఉద్యోగానికి టాటా చెప్పి షార్ట్‌ఫిల్మ్స్ రూట్లోకి వచ్చిపడ్డాడు. స్నేహితుడి సహకారంతో ఫేస్‌బుక్ ద్వారా ఆర్టిస్టులను బుక్ చేసుకుని ‘తరుణ్ ఫ్రమ్ తెలుగు మీడియుం’ షార్ట్ ఫిల్మ్ తీసి యుట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. నాలుగు నెలల్లో ఈ చిత్రం రెండున్నర లక్షల లైక్స్ సంపాదించింది. ఇదే స్ఫూర్తితో ‘బ్రేకప్ తరవాత’ షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఇదీ లక్షల్లో లైక్స్ కొల్లగొట్టింది. తాజాగా ‘రంభతో రాముడు’ చేస్తున్న అభిరామ్ తన గురించి ఇలా చెబుతున్నాడు.
ఎంబీఏ కాగానే ఒక కంపెనీలో చేరాను. సినిమాలపై ఉన్న మోజుతో.. ఉద్యోగం మానేసి ఓ ఏడాది ఇండస్ట్రీ చుట్టూ తిరిగాను. ఎక్కడకు వెళ్లినా హారుుగా ఉద్యోగం చేసుకోవునే వాళ్లే తప్ప చాన్స్ దొరకలేదు. అరుునా నిరాశ పడలేదు. నా పనితనాన్ని రుజువు చేసుకోవాలనుకున్నాను. అందుకు షార్ట్ ఫిల్మ్స్‌కు మించిన వూర్గం లేదనిపించింది. వాటిని ప్రమోట్ చేయుడానికి యుూట్యూబ్‌ను వేదికగా వులచుకోవాలని ఫిక్సయ్యూను. అదే టైంలో అసిస్టెంట్ కెమెరామన్ శ్రీకాంత్ అరుపాలతో పరిచయుమైంది. అలా నా కెరీర్ మొదలైంది.
కథ.. స్క్రీన్‌ప్లే.. డెరైక్షన్
నా చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం నేనే చేస్తాను. ఇప్పటి వరకు తీసిన ఈ మూడు చిత్రాల కథలు నా జీవితంలో ఎదురైన సంఘటనల ఆధారంగా తీసినవే. మెయిన్ పాయింట్ ఒకటి తీసుకుని దానికనుగుణంగా కథ సిద్ధం చేసుకుంటాను. ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటూనే వీకెండ్స్‌లో షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాను. నా చిత్రంలో హెల్దీ కామెడీతో పాటు వుంచి సందేశం ఉండేలా ప్లాన్ చేసుకుంటాను.
తరుణ్ ఫ్రమ్ తెలుగు మీడియుం
తెలుగు భాష గురించి ప్రత్యేకంగా తీసిన లఘు చిత్రం ‘తరుణ్ ఫ్రం తెలుగు మీడియుం’. చాలామంది తెలుగులో మాట్లాడితే తప్పనుకుంటారు. తెలుగులో మాట్లాడేవారిని, తెలుగుదనం నిండిన వస్త్రాలు కట్టుకునేవారిని చులకనగా చూడటం ఒక హాబీగా మారిపోరుుంది. మోడ్రన్ డ్రెస్, కాస్ట్‌లీ సెల్‌ఫోన్, వచ్చీరాని ఇంగ్లిష్‌లో ఏదో ఒకటి మాట్లాడేవారికే ఇప్పుడు సవూజంలో విలువ ఇస్తున్నారు. ఇవన్నీ పారుుంటవుట్ చేస్తూ.. మన తెలుగును మరచిపోవద్దనే సందేశాన్ని ఇందులో చూపించాను.
కొసమెరుపు
తాజాగా రంభతో రాముడు చేస్తున్న అభిరామ్ ఎప్పటికైనా వుంచి దర్శకుడిగా ప్రూవ్ చేసుకుంటానని చెబుతున్నాడు. కథ, కథనంలో వైవిధ్యం, ఆర్టిస్టుల సెలక్షన్‌లో కొత్తదనంతో అభిరామ్ బెటర్ అవుట్‌పుట్ ఇస్తున్నాడు. ఈ యుంగ్ టాలెంట్ వుుందు వుుందు వురిన్ని వుంచి చిత్రాలు చేయూలని ఆశిద్దాం.