Ram Charan Released Abhiram Daggubati's 'Ahimsa' Trailer - Sakshi
Sakshi News home page

రానా తమ్ముడు నటించిన 'అహింస' ట్రైలర్‌ చూశారా?

Published Fri, Jan 13 2023 10:44 AM | Last Updated on Fri, Jan 13 2023 12:25 PM

Ram Charan Released Abhiram Daggubati Ahimsa Trailer - Sakshi

ఓ యువకుడిని క్రిమినల్‌ కేసులో పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. అతన్ని విడిపించడానికి ఓ క్రిమినల్‌ లాయర్‌ కేసును టేకప్‌ చేస్తుంది. గురువారం హీరో రామ్‌చరణ్‌ విడుదల చేసిన ‘అహింస’ ట్రైలర్‌లో కనిపించిన సన్నివేశాలు ఇవి. మరోవైపు అదే ట్రైలర్‌లో ఆ యువకుడు, ఓ యువతి ప్రేమలో ఉన్న సీన్లు కనబడతాయి.

దివంగత ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు మనవడు, నిర్మాత సురేష్‌బాబు తనయుడు అభిరామ్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అహింస’. గీతిక హీరోయిన్‌గా లాయర్‌ పాత్రలో సదా నటించిన ఈ చిత్రానికి తేజ దర్శకుడు. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీకి పి. కిరణ్‌ నిర్మాత. త్వరలో రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఆర్పీ పట్నాయక్, కెమెరా: సమీర్‌ రెడ్డి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement