హీరోగా రానా త‌మ్ముడు.. ఆ డైరెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్న‌ల్‌! | Rana Daggubatis Brother Abhiram Entry With The Director Teja Updates | Sakshi
Sakshi News home page

హీరోగా రానా త‌మ్ముడు.. ఆ డైరెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్న‌ల్‌!

Published Mon, Apr 26 2021 11:03 AM | Last Updated on Mon, Apr 26 2021 12:49 PM

Rana Daggubatis Brother Abhiram Entry With The Director Teja UpdatesSsonn - Sakshi

ద‌గ్గుబాటి కుటుంబం నుంచి మ‌రో హీరో వెండితెర‌కు ప‌రిచ‌యం కానున్నారు. ద‌గ్గుబాటి రానా త‌మ్ముడు అభిరామ్ రీఎంట్రీకి అంతా సిద్ధ‌మైంది. అతి త్వ‌ర‌లోనే ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడితో అభిరామ్ సినిమా చేయ‌నున్నారు. ఇప్ప‌టికే వంశీ, తరుణ్ భాస్కర్, రవి బాబులతో చ‌ర్చ‌లు జ‌రిగినా అవి వ‌ర్క‌వుట్ కాలేదు. ఫైన‌ల్‌ డైరెక్ట‌ర్ తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ స్ర్కిప్ట్‌ను సురేష్‌బాబు ఓకే చేసిన‌ట్లు స‌మాచారాం. దీంతో అతి త్వ‌ర‌లోనే అభిరామ్‌ను గ్రాండ్‌గా ప‌రిచ‌యం చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు సురేష్‌బాబు.

ఇది వ‌ర‌కే తేజ ద‌ర్శ‌క‌త్వంలో రానా న‌టించిన  'నేనే రాజు నేనే మంత్రి సినిమా విజ‌య‌వంత‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ న‌మ్మ‌కంతోనే అభిరామ్‌కు కూడా డెబ్యూ మూవీతోనే హిట్ కొట్టించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. అంతేకాకుండా తేజ డైరెక్ట్ చేసే ఈ సినిమాకు ఆర్పీ ప‌ట్నాయ‌క్ సంగీతం అందించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌లె ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన ఆయ‌న‌..త్వ‌ర‌లోనే ఓ మంచి ప్రాజెక్ట్ ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్న‌ట్లు చెప్పారు. దీంతో ఆర్పీ ప‌ట్నాయక్ అభిరామ్ మూవీకి సంగీతం అందించ‌నున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఇక తేజ‌- ఆర్పీ ప‌ట్నాయ‌క్ కాంబినేష‌న్‌లో ఇప్ప‌టికే జ‌యం, నీ స్నేహం,నువ్వు నేను వంటి సూప‌ర్ హిట్ చిత్రాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ‌‌


చ‌ద‌వండి : సిద్‌ శ్రీరామ్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటాడో తెలుసా?
మన శరీరం కేవలం అందుకోసమే కాదు కదా : రేణు దేశాయ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement