debut movie
-
ట్రెండ్ ఫాలో అవుతున్న సాయి పల్లవి..
-
హీరోగా పరిచయమవుతున్న కమెడియన్ గౌతమ్ రాజు కుమారుడు
కృష్ణ (కమెడియన్ గౌతం రాజు కుమారుడు) హీరోగా, సుమీత హీరోయిన్గా అంజన్ చెరుకూరి దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. రావుల గౌరమ్మ సమర్పణలో రావుల లక్ష్మణ్ రావ్, రావుల శ్రీను నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి నిర్మాత రామసత్యనారాయణ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు బి. గోపాల్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు రేలంగి నరసింహా రావు గౌరవ దర్శకత్వం వహించారు. అంజన్ చెరుకూరి మాట్లాడుతూ.. ‘‘ఓ ప్రేమజంట తమకు వచ్చిన చాన్స్‌ని చేజిక్కుంచుకొని కోటీశ్వరులు ఎలా అయ్యారు? అనేదే ఈ చిత్రకథ’’ అన్నారు. ‘‘మా అభిమాన హీరో చిరంజీవి గారి బర్త్ డే రోజు మా సినిమా ప్రారంభించడం హ్యాపీ. మా తొలి చిత్రం ‘రుద్రవీణ’ రిలీజ్‌కు రెడీగా ఉంది’’ అన్నారు రావుల లక్ష్మణ్ రావ్, రావుల శ్రీను. -
సీనియర్ నటి రాజ్యలక్ష్మి తనయుడు హీరోగా ఎంట్రీ
రోహిత్ కృష్ణ, సంతోష్, నిఖిత, హర్షిత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పల్లెగూటికి పండగొచ్చింది’. తిరుమల్ రావు దర్శకత్వం వహించారు. కె.ప్రవీణ్ సమర్పణలో కె.లక్ష్మి నిర్మించిన ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. తిరుమల్ రావు మాట్లాడుతూ– ‘‘గ్రామీణ యువత ఏ రకంగా చెడు మార్గంలో వెళుతున్నారు? వారు మంచి మార్గంలో నడిస్తే ప్రభుత్వ సహకారం లేకుండానే గ్రామాన్ని ఎలా స్మార్ట్‌గా అభివృద్ధి చేయొచ్చన్నదే కథాంశం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో మా అబ్బాయి రోహిత్ కృష్ణ హీరోగా నటించాడు. ఫిబ్రవరిలో రిలీజ్‌కి ప్లాన్ చేశాం’’ అన్నారు రాజ్యలక్ష్మీ . ‘‘సుమన్, సాయి కుమార్, సాయాజీ షిండే, రఘుబాబు, అన్నపూర్ణమ్మ వంటి సీనియర్ నటులతో నటించే అవకాశం కల్పించిన తిరుమల్ రావుకు «థ్యాంక్స్’’అన్నారు రోహిత్ కృష్ణ. ఈ చిత్రానికి సంగీతం: సింధు కే ప్రసాద్, కెమెరా: రవి టి. -
రౌడీ బాయ్స్: బృందావనం లిరికల్ సాంగ్ రిలీజ్
Rowdy Boys: Anupama Parameswaran Amazing in Brindavanam: దిల్‌రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ రెడ్డి తొలి డెబ్యూ సినిమా రౌడీ బాయ్స్. అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా బృందావనం అనే సాంగ్‌ను విడుదల చేశారు. సుద్దాల అశోక్ లిరిక్స్ అందించగా, మంగ్లీ తన వాయిస్‌తో మరోసారి ఆకట్టుకుంది. హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
కొడుకు ఎంట్రీ.. బన్నీ అభిమానులకు సర్ప్రైజ్ ట్రీట్
Allu Arjun Son Allu Ayaan As Ghani Viral Video: సాధారణంగా స్టార్ హీరోల వారసులు సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేస్తుంటారు. తాజాగా అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి నెక్ట్స్ జనరేషన్ కూడా వెండితెర ఎంట్రీకి సిద్ధమయ్యింది. ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు అర్హ శాకుంతలం సినిమా ద్వారా డెబ్యూ ఇవ్వనుండగా, ఇప్పుడు కొడుకు అల్లు అయాన్ గని సినిమా కోసం రంగంలోకి దిగాడు. వరుణ్‌తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చదవండి: ఫాంహౌస్‌లో బన్నీ దీపావళి సెలబ్రేషన్స్.. వీడియో వైరల్ ఈ మూవీలోని ఫస్ట్ లిరికల్ సాంగ్‌కు అయాన్ చేసిన వర్కవుట్ వీడియోను గీతా ఆర్ట్స్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అల్లు అయాన్‌ను చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. అచ్చం బన్నీలాగే ఎనర్జీ, స్టైల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను రెనైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపనీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు, ఉపేంద్ర కీలకపాత్రల్లో కనిపించనున్నారు. చదవండి: పునీత్ చనిపోయి నేటికి 11రోజులు.. వేలాదిగా జనం క్యూ.. ఎయిర్‌పోర్టులో దాడి: అసలేం జరిగిందో వివరించిన సేతుపతి Here's the cute little video surprise featuring #AlluAyaan from @Bobbyallu & Team #Ghani💫🥊#AlluAyaanForGhani 🤩 ▶️ https://t.co/tSzQqmIjjY @IAmVarunTej @nimmaupendra @SunielVShetty @dir_kiran @saieemmanjrekar @MusicThaman @ramjowrites @george_dop @abburiravi @adityamusic pic.twitter.com/5iCSghYI4H — Geetha Arts (@GeethaArts) November 8, 2021 -
దూసుకెళ్తున్న ‘హీరో’..అప్పుడే 4M వ్యూస్
సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. అమరరాజ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హీరో అనే టైటిల్ ఖారారు చేసింది చిత్రబృందం. శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, అశోక్ గల్లా సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. సూపర్ స్టార్ మహేశ్ విడుదల చేసిన ‘హీరో’ టీజర్‌కు మంచి ఆదరణ లబిస్తుంది. ఇప్పటికే టీజర్‌కు 4మిలియన్ల వ్యూస్ వచ్చాయి. Remarkable #𝐇𝐄𝐑𝐎TitleTeaser hits 4️⃣ Million Views! ▶️ https://t.co/OIenFMIfqL#Hero@AshokGalla_ @SriramAdittya #PadmavathiGalla @AgerwalNidhhi @IamJagguBhai @JayGalla @ravipatic @GhibranOfficial @amararajaent @WhackedOutMedia pic.twitter.com/54it7718FW — BARaju's Team (@baraju_SuperHit) June 24, 2021 టీజర్లో అశోక్ కౌబాయ్ గెటప్‌లో కనిపించారు. గుర్రంపై ఆ ట్రైన్‌ను ఫాలో అవుతూ ఇచ్చిన అశోక్ ఎంట్రీ టీజర్‌కు హైలెట్‌గా చెప్పుకోవచ్చు. అంతేగాక హీరో జోకర్ గేటప్‌లో సైకోగా కనిపించగా మరోచోట రోమియోగా దర్శనం ఇచ్చాడు. టీజర్ మొత్తంలో అశోక్ మూడు పాత్రల్లో కనిపించడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. దాదాపు షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. జగపతిబాబు, నరేష్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించారు. చదవండి : ఆకట్టుకుంటున్న మహేశ్ మేనల్లుడి ‘హీరో’ టీజర్ -
మీట్ ‘క్యూట్’గా మెగాఫోన్ పట్టిన నాని సోదరి
న్యాచురల్ స్టార్ నాని సోదరి క్యూట్‌గా మెగాఫోన్ పట్టేసింది. రోల్.. కెమెరా..యాక్షన్ అంటూ దర్శకత్వ బాధ్యతలు చేపట్టింది. నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ బ్యానర్‌పై ‘మీట్ క్యూట్’ అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను నాని సోదరి దీప్తి గంటా చేపట్టింది. గతంలో ‘అనగనగా ఒక నాన్న’ అనే షార్ట్‌ఫిల్మ్‌ను దీప్తి తీసి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు దర్శకత్వ బాట పట్టారు. ఈ విషయాన్ని నాని ట్విటర్లో తెలిపారు. ‘నేడు కొత్త ప్రయాణం మొదలైంది. ఇది నాకెంతో ప్రత్యేకం’ అంటూ ‘మీట్ క్యూట్’కు సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు. అందులో సత్యరాజ్ కూర్చుని ఉండగా నాని క్లాప్ కొడుతున్న ఫొటోతో పాటు మరో ఫొటో పంచుకున్నారు. సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. ఆ ఫొటో చూస్తుంటే సత్యరాజ్‌కు దీప్తి సీన్ వివరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. నాని నిర్మాణంలో ‘అ!, హిట్’ సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం రూపొందుతున్న ఈ సినిమా ఆ బ్యానర్లో నాలుగోది. Wall Poster Cinema Production No 4 🎬#MeetCute A new journey begins today :)) This one’s special for more than one reason ❤️@mail2ganta @lightsmith83 @VijaiBulganin @vinay2780 @artkolla @Garrybh88 @PrashantiTipirn @walpostercinema pic.twitter.com/8ToWRgu4Zu — Nani (@NameisNani) June 14, 2021 -
హీరోగా రానా తమ్ముడు.. ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
దగ్గుబాటి కుటుంబం నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం కానున్నారు. దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ రీఎంట్రీకి అంతా సిద్ధమైంది. అతి త్వరలోనే ఓ ప్రముఖ దర్శకుడితో అభిరామ్ సినిమా చేయనున్నారు. ఇప్పటికే వంశీ, తరుణ్ భాస్కర్, రవి బాబులతో చర్చలు జరిగినా అవి వర్కవుట్ కాలేదు. ఫైనల్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో ఓ స్ర్కిప్ట్‌ను సురేష్‌బాబు ఓకే చేసినట్లు సమాచారాం. దీంతో అతి త్వరలోనే అభిరామ్‌ను గ్రాండ్‌గా పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారు సురేష్‌బాబు. ఇది వరకే తేజ దర్శకత్వంలో రానా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి సినిమా విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ నమ్మకంతోనే అభిరామ్‌కు కూడా డెబ్యూ మూవీతోనే హిట్ కొట్టించాలని ప్లాన్ చేస్తున్నారట. అంతేకాకుండా తేజ డైరెక్ట్ చేసే ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన..త్వరలోనే ఓ మంచి ప్రాజెక్ట్ ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నట్లు చెప్పారు. దీంతో ఆర్పీ పట్నాయక్ అభిరామ్ మూవీకి సంగీతం అందించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక తేజ- ఆర్పీ పట్నాయక్ కాంబినేషన్లో ఇప్పటికే జయం, నీ స్నేహం,నువ్వు నేను వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి : సిద్ శ్రీరామ్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటాడో తెలుసా? మన శరీరం కేవలం అందుకోసమే కాదు కదా : రేణు దేశాయ్ -
తొలి సినిమాతో స్టార్లుగా మారిన హీరోయిన్లు
ఎంతోమంది స్టార్ హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు..కానీ ఆ అదృష్టం కొందరికే కలిసొస్తుంది. మొదటి సినిమాతోనే కొందరు కనుమరుగైతే, మరొకందరు మాత్రం ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్లుగా మారుతున్నారు. నటన, అందం సహా అదృష్టం కూడా కలిసొచ్చి మొదటి సినిమాతోనే స్టార్డంను సందించుకుంటున్నారు. అలా టాలీవుడ్లో డెబ్యూ మూవీతోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన హీరోయున్లు ఎవరో చూద్దాం. కృతిశెట్టి..మొదటి సినిమాతోనే బంపర్ హిట్ అందుకున్న ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ఉప్పెనతో బేబమ్మగా అలరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. చూడచక్కని అందంతో కుర్రాల మతులు పోగొడుతుంది ఈ మంగళూరు బ్యూటీ. ఛలో సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రష్మిక మందన్నా. ఈ సినిమా హిట్ కావడంతో ఈ అమ్మడికి స్టార్స్‌తో జతకట్టే అవకాశాలు వచ్చాయి. దీంతో అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇటు తెలుగు, కన్నడ చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఏకంగా అమితాబ్ బచ్చన్ సినిమాలోనే అవకాశం దక్కించుకొని మోస్ట్ పాపులర్ హీరోయిన్గా నిలిచింది. ఆర్ఎక్స్100 సినిమాతో సూపర్ హిట్ కొట్టిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. సాధారణంగా బోల్డ్ కంటెంట్‌తో డెబ్యూగా రావడంటే సాహసమనే చెప్పాలి. అలాంటి ధైర్యమే చేసింది ఈ పంజాబీ భామ. వచ్చీ రావడమే సూపర్ హిట్ అందుకొని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మొదటి సినిమాతోనే బంపర్ హిట్ అందుకొని టాలీవుడ్లో దూసుకుపోతుంది. సినిమాలతో పాటు హాట్ ఫోటో షూట్లతో టాక్ ఆఫ్ ది టైన్గా హైలెట్ అవుతోంది ఈ ముద్దుగుమ్మ. నాగ చైతన్య హీరోగా గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఏ మాయ చేసావే. ఈ సినిమాతో సమంత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే సూపర్‌హిట్ అందుకొని స్టార్ హీరోయిన్ అయ్యింది. డెబ్యూ మూవీతోనే తన ఫర్మార్మెన్స్ ఏంటో రుజువు చేసింది ఈ చెన్నై చిన్నది. ఏ మాయ చేసిందో గానీ టాలీవుడ్లో స్టార్ హీరోలకు సమానంగా అవకాశాలు దక్కించుకుంది. తొలి సినిమాలో నటించిన నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. అర్జున్‌రెడ్డి సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ డం సందించుకున్న హీరో-హీరోయిన్లు విజయ్ దేవరకొండ, షాలినీ పాండే. ఈ ఒక్కసినిమాతో విజయ్ దేవరకొండ పాన్ఇండియా లెవల్లో ఫ్యాన్స్‌ని సంపాదించుకుంటే, షాలినీ పాండేకి మంచి గుర్తింపు దక్కింది. డెబ్యూ హీరోయిన్గా షాలినీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే అనుకున్నంతగా ఆమెకు అవకాశాలు రాలేదు. దీంతో ప్రస్తుతం వర్కవుట్లు చేస్తూ స్లిమ్‌గా తయ్యారయ్యింది. నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమా జయం. ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది సదా. ఈ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో వేరే చెప్పక్కర్లేదు. తొలి సినిమాతోనే బంపర్ హిట్‌ను ఖాతాలో వేసుకొని సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ చిన్నది. జయం అనంతరం టాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కించుకొని కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్గా చలామణి అయ్యింది. అల్లు అర్జున్-పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం దేశముదురు. ఈ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన భామ హన్సిక. డెబ్యూ మూవీతోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది హన్సిక. తొలి సినిమాతోనే అందంతో క్రుర్రాల మతులు పొగొట్టింది ఈ బ్యూటీ. అంతేకాకుండా దేశ ముదురు చేసే సమయానికి హన్సిక టెన్త్ క్లాస్. దీంతో షూటింగ్లో పాల్గొంటూనే ఎగ్జామ్స్ రాసింది. ఉదయ్‌కిరణ్, రీమా సేన్ చిత్రం మూవీతో జంటగా నటించారు. ఈ సినిమా అప్పట్లోనే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో వేరే చెప్పక్కర్లేదు. తొలి సినిమాతోనే రీమాసేన్ స్టార్ హీరోయిన్ అయిపోయిది. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు దక్కించుకొని ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న రకుల్ సోదరుడు
ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ కామనే. అయితే ఎక్కువగా హీరోల సోదరులు, కుమారులు వారసులుగా ఎంట్రీ ఇస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా తన వారసుణ్ని వెండితెరకు పరిచయం చేస్తున్నారు. తెలుగు, తమిళ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్గా ఆకట్టుకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్ తన సోదరుడు అమన్‌ను హీరోగా లాంచ్ చేస్తున్నారు. రాజానే ఫిలిం కార్పోరేషన్ నిర్మాణంలో దాసరి లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాతో అమన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే రాక్ అండ్ రోల్ అనే షార్ట్ ఫిలింలో నటించిన అమన్, హీరోగా ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి. ఆదివారం ఉదయం పది గంటలకు అమన్ హీరోగా తెరకెక్కనున్న సినిమా అన్నపూర్ణ స్టూడియోస్‌లో లాంచనంగా ప్రారంభమవుతుంది. -
జెనీలియా రెండ్రోజులు నాతో మాట్లాడలేదు!
సాక్షి, ముంబై: రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా డిసౌజాలను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన తొలి సినిమా 'తుఝే మేరి కసమ్' సినిమా వచ్చి అప్పుడే 15 ఏళ్లు అవుతోంది. ఈ సినిమా రితేశ్, జెనీలియాల జీవితాన్ని మార్చివేసింది. ఈ సినిమాలో సహనటులుగా ప్రస్థానాన్ని ప్రారంభించిన వీరిద్దరు ఇప్పుడు భార్యాభర్తలుగా కలిసి జీవితాన్ని సాగిస్తున్నారు. ఇదే విషయాన్ని గుర్తుచేసిన రితేశ్.. ఈ సినిమా సెట్స్‌లో మొదటి రెండురోజులు జెనీలియా తనతో అస్సలు మాట్లాడలేదని తెలిపాడు. ప్రముఖ తెలుగు దర్శకుడు కే విజయ్‌భాస్కర్ దర్శకత్వంలో రామోజీరావు నిర్మించిన 'తుఝే మేరి కసమ్' సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 'జనవరి 3, 2003న 'తుఝే మేరీ కసమ్' సినిమా విడుదలైంది. నేటికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. మొదటి సినిమాతోనే జీవితం మారిపోయింది. ఆర్కిటెక్ట్ నటుడు అయ్యాడు. సహనటి జెనీలియా జీవితభాగస్వామి అయింది' అని రితేశ్ ట్వీట్ చేశారు. నిర్మాత రామోజీరావు, దర్శకుడు విజయ్‌భాస్కర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 'మా నాన్న అప్పటి ముఖ్యమంత్రి కావడంతో సినిమా షూటింగ్ సమయంలో తొలిరెండురోజులు జెనీలియా మాట్లాడలేదు. ఆమె అడిగిన మొదటి మాట నీ సెక్యూరిటీ ఏదని.. నాకు ఎలాంటి సెక్యూరిటీ లేదని చెప్పాను' అని రితేశ్ గుర్తుచేసుకున్నారు. దివంగత మాజీ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తనయుడైన రితేశ్ తనను ఈ సినిమాకు రికమండ్ చేసినందుకు సినిమాటోగ్రాఫర్ కబీర్‌లాల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. Sincere thanks to Director Vijaya Bhaskar Ji - I Love You Sir, Producer Shri Ramoji Rao Sir 🙏🏽 Respect. Cinematographer Kabir Lal Sir- who recommended me. 🙏🏽. #15YearsOfTujheMeriKasam pic.twitter.com/npIpCgd6jQ — Riteish Deshmukh (@Riteishd) 3 January 2018 .@geneliad didn’t speak to me for the first two days during the shoot of the film because my father was the Chief Minister on Maharashtra then. #15YearsOfTujheMeriKasam pic.twitter.com/dezgUiqtpz — Riteish Deshmukh (@Riteishd) 3 January 2018 -
త్వరలోనే సారా ఎంట్రీ : సైఫ్
గతంలో సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వారసురాళ్లు పెద్దగా వచ్చే వారు కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. స్టార్ హీరోల కూతుళ్లు కూడా వెండితెర మీద సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సోనాక్షి సిన్హా, సోనమ్ కపూర్ లాంటి తారలు వెండితెర మీద మెరుపులు మెరిపిస్తుండగా ఇప్పుడు మరో తార తెరంగేట్రానికి రంగం సిద్దమవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ వెండితెర అంరంగేట్రానికి రెడీ అవుతోంది. ఈ విషయాన్ని సారా అలీఖాన్ తండ్రి ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కన్ఫామ్ చేశాడు. ఈ సినిమాను కర్ణ్ జోహార్ నిర్మించనున్నాడని ప్రకటించాడు సైఫ్. బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్ సరసన సారా వెండితెరకు పరిచయం అయ్యే చాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పబ్లిక్ అపియరెన్స్లలో తన గ్లామర్ తో ఆకట్టుకుంటున్న సారా తొలి సినిమాతోనే సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. -
మరో వారసురాలు వస్తోంది..
ముంబై: బాలీవుడ్, దక్షిణాది హీరోల కుమార్తెలు చాలా మంది నటనను వారసత్వంగా తీసుకుని వెండితెరపై వెలిగిపోతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో వారసురాలు వస్తోంది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్, అమృతా సింగ్‌ల కుమార్తె సారా అలీఖాన్ (24) తెరంగేట్రం చేయనుంది. రణవీర్ సింగ్ హీరోగా జోయా అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాతో సారా హీరోయిన్గా నటించనున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ఏంటంటే.. సారా తొలి చిత్రంలో రణవీర్ సింగ్ సరసన గాక కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో హృతిక్ రోషన్‌తో కలసి నటించనుంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇంతకుముందు కూడా కరణ్ జోహార్ సినిమాలో సారా నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే కరణ్‌తో తన తల్లి అమృతకు విభేదాలు ఉన్న కారణంగా సారా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందట. ఈ నేపథ్యంలో సారా తెరంగేట్రం చేయడం ఖాయమైనా ఏ ప్రాజెక్టులో తొలుత నటిస్తుందన్న విషయంపై క్లారిటీ రావాల్సి వుంది. -
సైఫ్ వారసురాలి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ
గతంలో సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వారసురాళ్లు పెద్దగా వచ్చే వారు కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. స్టార్ హీరోల కూతుళ్లు కూడా వెండితెర మీద సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సోనాక్షి సిన్హా, సోనమ్ కపూర్ లాంటి తారలు వెండితెర మీద మెరుపులు మెరిపిస్తుండగా ఇప్పుడు మరో తార తెరంగేట్రానికి రంగం సిద్దమవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ వెండితెర అంరంగేట్రానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ అమ్మడు చేయబోయే సినిమా కూడా ఫైనల్ అయిపోయిందట. బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్ హీరోగా జోయా అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాతో సారా హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే పబ్లిక్ అపియరెన్స్లలో తన స్టైల్స్ గ్లామర్ తో ఆకట్టుకుంటున్న సారా తొలి సినిమాతోనే సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. -
గెస్ట్ రోల్లో పవన్ కళ్యాణ్!
అక్కినేని కుటుంబం నుంచి వస్తున్న మరో నట వారసుడి అఖిల్ తొలి చిత్రంపై టాలీవుడ్లో రోజుకో హాట్ న్యూస్ హల్చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు యంగ్ హీరో నితిన్ నిర్మాతగా వ్యవహరించడం ఓ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే తాజాగా మరో ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది. అఖిల్ ఎంట్రీ గ్రాండ్‌గా ఉండేందుకు దర్శక నిర్మాతలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దాంతో తనయుడి చిత్రంలో తండ్రి అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదండోయ్... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా గెస్ట్ రోల్ చేస్తున్నాడట. అయితే గెస్ట్ రోల్స్‌పై దర్శక నిర్మాతలు మాత్రం పెదవి విప్పటం లేదు. మరోవైపు ఈచిత్రాన్ని ... సోషియో ఫాంటసీ స్టోరీతో తెరకు ఎక్కించే యోచనలో ఉన్నట్లు సమాచారం. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ...అఖిల్ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఇటీవలే ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌లో లాంఛనంగా ప్రారంభించారు. మరోవైపు అఖిల్ సరసన నటించే హీరోయిన్గా నటించేది ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. -
వినాయక్ డైరెక్షన్లో అఖిల్?
-
అతడితో సినిమా చేయడం లేదు: అక్కినేని అఖిల్
చెన్నై: 'కింగ్' నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ సినిమా రంగ ప్రవేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అఖిల్‌ను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకు పరిచయం చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఊహాగానాలను అఖిల్ ఖండించాడు. తాను త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నట్టు పుకార్లను తోసిపుచ్చాడు. 'నా తొలి చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేస్తున్నట్టు వస్తున్న ఊహాగానాల్లో నిజం లేదు. ఆయనతో పనిచేయడం నాకెంతో ఇష్టం. కానీ నేను ఏ సినిమాకు సంతకం చేయలేదు. కథ కూడా వినలేదు' అని ట్విటర్లో అఖిల్ పోస్ట్ చేశాడు. త్రివిక్రమ్‌తో త్వరలోనే కలిసి పనిచేయాలనుకుంటున్నట్టు వెల్లడించాడు. అఖిల్ త్వరలోనే తెరంగ్రేటం చేయనున్నాడని 'అడ్డా' ఆడియో విడుదల సందర్భంగా నాగార్జున ప్రకటించారు. దీంతో అఖిల్ ఆరంభ సినిమాపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే అఖిల్ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.