
అతడితో సినిమా చేయడం లేదు: అక్కినేని అఖిల్
చెన్నై: 'కింగ్' నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ సినిమా రంగ ప్రవేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అఖిల్ను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకు పరిచయం చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఊహాగానాలను అఖిల్ ఖండించాడు. తాను త్రివిక్రమ్తో సినిమా చేస్తున్నట్టు పుకార్లను తోసిపుచ్చాడు.
'నా తొలి చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేస్తున్నట్టు వస్తున్న ఊహాగానాల్లో నిజం లేదు. ఆయనతో పనిచేయడం నాకెంతో ఇష్టం. కానీ నేను ఏ సినిమాకు సంతకం చేయలేదు. కథ కూడా వినలేదు' అని ట్విటర్లో అఖిల్ పోస్ట్ చేశాడు. త్రివిక్రమ్తో త్వరలోనే కలిసి పనిచేయాలనుకుంటున్నట్టు వెల్లడించాడు.
అఖిల్ త్వరలోనే తెరంగ్రేటం చేయనున్నాడని 'అడ్డా' ఆడియో విడుదల సందర్భంగా నాగార్జున ప్రకటించారు. దీంతో అఖిల్ ఆరంభ సినిమాపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే అఖిల్ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.