అఖిల్-జైనాబ్ నిశ్చితార్థం.. ఈ ఏడాది మాకెంతో ప్రత్యేకం: నాగార్జున | Nagarjuna about his son Akhil engagement with Zainab | Sakshi
Sakshi News home page

Nagarjuna: ఓకే ఏడాదిలో మూడు శుభకార్యాలు.. చాలా సంతోషంగా ఉంది: నాగార్జున

Published Thu, Nov 28 2024 10:59 AM | Last Updated on Thu, Nov 28 2024 11:08 AM

Nagarjuna about his son Akhil engagement with Zainab

అక్కినేని వారి ఇంట త్వరలోనే శుభకార్యం జరగనుంది. వచ్చేనెల 4వ తేదీన నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ల వివాహా వేడుక జరగనుంది. ఈ పెళ్లి పనులతో ఇరు కుటుంబాలు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. అంతలోనే మరో సర్‌ప్రైజ్ ఇచ్చేశారు అక్కినేని ఫ్యామిలీ. నాగార్జున తనయుడు, హీరో అక్కినేని అఖిల్‌ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. ముంబయికి చెందిన జైనాబ్ రవ్జీతో నిశ్చితార్థం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అయితే మరోవారంలో నాగచైతన్య పెళ్లి జరగనుంది. దీంతో అఖిల్ పెళ్లి ఎప్పుడని అప్పుడే ఆరా తీయడం మొదలెట్టారు నెటిజన్స్. అయితే అఖిల్- జైనాబ్‌ల పెళ్లి 2025లోనే జరగనుందని నాగార్జున ఇటీవల ఇంటర్వ్యూలో  వెల్లడించారు. అయితే ఈ ఏడాది తమకు ఎంతో స్పెషల్ ‍అని కింగ్ తెలిపారు. ఓకే ఏడాదిలో అక్కినేని శతజయంతి ఉత్సవాలు, నాగచైతన్య- శోభితల పెళ్లి, అఖిల్ ఎంగేజ్‌మెంట్‌ జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే కాకుండా అఖిల్, జైనాబ్ రవ్జీల రిలేషన్‌పై నాగ్ మాట్లాడారు.

నాగార్జున మాట్లాడుతూ..'అఖిల్ ఎంగేజ్‌మెంట్‌ పట్ల చాలా సంతోషంగా ఉన్నా. జైనాబ్  అందమైన అమ్మాయి మాత్రమే అఖిల్‌కు సరైన జోడి. వారిద్దరు తమ జీవితాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నందుకు ఆనందంగా ఉంది. వారిద్దరి వివాహం 2025లోనే జరుగుతుంది" అని తెలిపారు. అఖిల్- జైనాబ్‌ల నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు నాగార్జున. కాగా.. నాగ చైతన్య, నటి శోభిత ధూళిపళ్ల వివాహం డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనున్న సంగతి తెలిసిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement