తిరుపతి నేపథ్యంలో... | Nagarjuna Puts Akhil Back On Track With Tirupati Backdrop Film In Tollywood, Check Out Details | Sakshi
Sakshi News home page

తిరుపతి నేపథ్యంలో...

Published Sat, Oct 19 2024 3:16 AM | Last Updated on Sat, Oct 19 2024 3:11 PM

Nagarjuna Puts Akhil Back on Track with Tirupati Backdrop Film: Tollywood

వాట్‌ నెక్ట్స్‌? అఖిల్‌ అక్కినేని చేయనున్న కొత్త చిత్రం గురించిన చర్చ ఇది. వార్తల్లో ఉన్న ప్రకారం అఖిల్‌ రెండు సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకటి యూవీ క్రియేషన్స్‌ నిర్మించనున్న సినిమా అని, ఈ చిత్రాన్ని అనిల్‌ కుమార్‌ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నారని ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఇక మరో చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మించనుందని భోగట్టా. కిరణ్‌ అబ్బవరం హీరోగా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రాన్ని తెరకెక్కించిన మురళీ కిషోర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం.

మురళి చెప్పిన కథ నాగార్జునకు నచ్చడంతో హోమ్‌ బేనర్‌లో నిర్మించాలని నిర్ణయించుకున్నారట. తిరుపతి నేపథ్యంలో పీరియాడిక్‌ మూవీగా రూపొందనుందని టాక్‌. ఈ చిత్రానికి ‘లెనిన్‌’ టైటిల్‌ అనుకుంటున్నారని భోగట్టా. అలాగే యూవీ క్రియేషన్స్‌లో నటించనున్న చిత్రానికి ‘ధీర’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉందట. ఇది కూడా పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ అట. ఇక అఖిల్‌ అయితే ఈ మధ్య మేకోవర్‌ అయ్యారు. ఈ మేకోవర్‌ ఏ సినిమా కోసం అనేది తెలియాల్సి ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement