King Nagarjuna To Attend Akhil Akkineni Agent Pre Release Event - Sakshi
Sakshi News home page

Akhil Akkineni : ‍అఖిల్‌ 'ఏజెంట్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు వచ్చేది ఎవరో తెలుసా?

Published Sun, Apr 23 2023 11:57 AM | Last Updated on Sun, Apr 23 2023 12:28 PM

King Nagarjuna To Attend Akhil Akkineni Agent Pre Release Event - Sakshi

అఖిల్‌ అక్కినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్‌. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏకే ఇంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తుంది. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుంది. తొలిసారి భారీ యాక్షన్‌ మూవీతో రంగంలోకి దిగిన అఖిల్‌ ప్రమోషన్స్‌ కూడా గట్టిగానే చేశారు. బ్యాక్‌ టూ బ్యాక్‌ ఈవెంట్స్‌తో బాక్సాఫీస్‌ వద్ద బాగానే బజ్‌ క్రియేట్‌ చేశారు.

ఈనెల 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో వరంగల్‌లో ఈరోజు(ఆదివారం)ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అంతా సిద్దమయ్యింది. అయితే ఈ వేడకకు టాలీవుడ్‌ బిగ్‌ స్టార్స్‌ పేర్లు మొదట వినిపించినా ఇప్పటివరకు కార్లిటీ రాలేదు. ఫైనల్‌గా కింగ్‌ నాగార్జున గెస్టుగా రానున్నట్లు మేకర్స్‌ తెలిపారు. దీనికి సంబంధించిన అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement