Allu Arjun Son Allu Ayaan As Ghani Viral Video: సాధారణంగా స్టార్ హీరోల వారసులు సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేస్తుంటారు. తాజాగా అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి నెక్ట్స్ జనరేషన్ కూడా వెండితెర ఎంట్రీకి సిద్ధమయ్యింది. ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు అర్హ శాకుంతలం సినిమా ద్వారా డెబ్యూ ఇవ్వనుండగా, ఇప్పుడు కొడుకు అల్లు అయాన్ గని సినిమా కోసం రంగంలోకి దిగాడు. వరుణ్‌తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చదవండి: ఫాంహౌస్‌లో బన్నీ దీపావళి సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
ఈ మూవీలోని ఫస్ట్ లిరికల్ సాంగ్‌కు అయాన్ చేసిన వర్కవుట్ వీడియోను గీతా ఆర్ట్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అల్లు అయాన్‌ను చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు.
అచ్చం బన్నీలాగే ఎనర్జీ, స్టైల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను రెనైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపనీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు, ఉపేంద్ర కీలకపాత్రల్లో కనిపించనున్నారు.
చదవండి: పునీత్ చనిపోయి నేటికి 11రోజులు.. వేలాదిగా జనం క్యూ..
ఎయిర్‌పోర్టులో దాడి: అసలేం జరిగిందో వివరించిన సేతుపతి
Here's the cute little video surprise featuring #AlluAyaan from @Bobbyallu & Team #Ghani💫🥊#AlluAyaanForGhani 🤩
— Geetha Arts (@GeethaArts) November 8, 2021
▶️ https://t.co/tSzQqmIjjY @IAmVarunTej @nimmaupendra @SunielVShetty @dir_kiran @saieemmanjrekar @MusicThaman @ramjowrites @george_dop @abburiravi @adityamusic pic.twitter.com/5iCSghYI4H
Comments
Please login to add a commentAdd a comment