
కృష్ణ (కమెడియన్ గౌతం రాజు కుమారుడు) హీరోగా, సుమీత హీరోయిన్‌గా అంజన్ చెరుకూరి దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. రావుల గౌరమ్మ సమర్పణలో రావుల లక్ష్మణ్ రావ్, రావుల శ్రీను నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి నిర్మాత రామసత్యనారాయణ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు బి. గోపాల్ క్లాప్ ఇచ్చారు.
దర్శకుడు రేలంగి నరసింహా రావు గౌరవ దర్శకత్వం వహించారు. అంజన్ చెరుకూరి మాట్లాడుతూ.. ‘‘ఓ ప్రేమజంట తమకు వచ్చిన చాన్స్‌ని చేజిక్కుంచుకొని కోటీశ్వరులు ఎలా అయ్యారు? అనేదే ఈ చిత్రకథ’’ అన్నారు. ‘‘మా అభిమాన హీరో చిరంజీవి గారి బర్త్ డే రోజు మా సినిమా ప్రారంభించడం హ్యాపీ. మా తొలి చిత్రం ‘రుద్రవీణ’ రిలీజ్‌కు రెడీగా ఉంది’’ అన్నారు రావుల లక్ష్మణ్ రావ్, రావుల శ్రీను.
Comments
Please login to add a commentAdd a comment