Singer Kousalya Shares Life Struggles After Her Marriage - Sakshi
Sakshi News home page

Kausalya: తన కోసమే భర్త వేధింపులు భరించా: కౌసల్య

Published Mon, Mar 13 2023 8:08 PM | Last Updated on Mon, Mar 13 2023 9:08 PM

Singer Kousalya Shares Life Struggles After Her marriage - Sakshi

సింగర్ కౌసల్య తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి దర్శకత్వంలో అత్యధికంగా పాటలు పాడిందామె. 1999 తెలుగు సినిమా నీ కోసం చిత్రంలో తొలిసారిగా ఆలపించారు కౌసల్య. ఆ తర్వాత తెలుగులో దాదాపు 350కి పైగా పాటలను పాడారు. 

వైవాహిక జీవితంలో ఇబ్బందులు

అయితే కెరీర్ సవ్యంగా సాగుతున్న సమయంలో ఆమె జీవితంలో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. పెళ్లయ్యాక కౌసల్య జీవితం అనేక మలుపులు తిరిగింది. ఆమె వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఎన్నో ఒడిదుడికుల మధ్య ఆమె జీవితం సాగింది. చాలా సార్లు తన భర్త తనను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కౌసల్య జీవితంలో ఎదురైన సమస్యలను ప్రస్తావించారు.

బాబు కోసం భరించా

కౌసల్య మాట్లాడుతూ..' వైవాహిక జీవితంలో చాలా బాధలు అనుభవించా. ఆ బాధను నాలోనే దాచుకునేదాన్ని. తన బాబు చాలా చిన్న పిల్లవాడు కావడంతో వాడి కోసమే అన్నింటిని దిగమింగా. కానీ అప్పుడప్పుడు నా చెల్లితో చెప్పుకునేదాన్ని. అలాగే అమ్మ దగ్గరా ఏమీ దాచేదాన్ని కాదు. తన భర్త మరో పెళ్లి చేసుకోవాలనుకునే వరకు సర్దుకు పోదామని ఓపికగా ప్రయత్నించా. కానీ కుదరలేదు. చివరికీ ఆయన మరొకరిని పెళ్లి చేసుకుని విడిపోయారు.' అని అన్నారు.

ఆ తర్వాత తన కుమారుడి గురించి ప్రస్తావిస్తూ..' ప్రస్తుతం బాబు పెద్దవాడు అయ్యాడు. వాడిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కానీ వాడేమో తనను మళ్లీ పెళ్లి చేసుకోమని అంటున్నాడు. నా జీవితంలో సంతోషం చూడాలన్నదే వాడి కోరిక. మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. అమ్మే పెంచి పెద్ద చేసింది. ఎనిమిదేళ్ల క్రితం ఆమె కూడా చనిపోయారు. ఇప్పుడు నా కొడుకే  లోకం .. నా పాటకి మంచి గుర్తింపు వస్తే ముందుగా సంతోషపడేది బాబే.' అని అన్నారు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement