సింపుల్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ లేడీ సింగర్ | Telugu Singer Harika Narayan Married Pruthvinath | Sakshi
Sakshi News home page

Harika Narayan: స్టార్ సింగర్ పెళ్లి.. హాజరైన 'బిగ్‌బాస్' విన్నర్

Published Mon, Mar 18 2024 7:27 AM | Last Updated on Mon, Mar 18 2024 9:43 AM

Telugu Singer Harika Narayan Wedding With Pruthvi - Sakshi

ఇప్పుడంతా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పుడు అలా మరో టాలీవుడ్ సెలబ్రిటీ పెళ్లి చేసేసుకుంది. మొన్నీమధ్యే నిశ్చితార్థం జరగ్గా.. రెండు వారాలు కూడా గడవక ముందే ప్రియుడితో ఏడడుగులు వేసింది. చాలా సింపుల్‌గా జరిగిన ఈ వేడుకలో బిగ్‌బాస్ విన్నర్, సింగర్ రేవంత్ కనిపించాడు. ఈ క్రమంలోనే కొత్త జంటకు తోటీ సింగర్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు.

(ఇదీ చదవండి: కాస్ట్‌లీ నెక్లెస్‌తో సెన్సేషనల్ హీరోయిన్.. రేటు ఎంతో తెలుసా?)

ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరికి చెందిన హారికా నారాయణ్.. తండ్రి ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి కావడంతో ఉత్తరాదిలో పెరిగింది. జర్మనీ వెళ్లి ఉద్యోగం చేయాలనుకుంది. కానీ అనుకోని విధంగా సింగర్ అయింది. నిహారిక 'సూర్యకాంతం' మూవీతో గాయనిగా కెరీర్ మొదలుపెట్టిన హారిక.. మహేశ్ బాబు, దళపతి విజయ్ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో ఎంట్రీ సాంగ్స్ పాడి అలరించింది.

ఇకపోతే గత ఏడేళ్లుగా పృథ్వీ వెంపటి అనే కుర్రాడితో ప్రేమలో ఉన్న హారికా నారాయణ్.. ఈ విషయాన్ని పెద్దగా బయటపెట్టుకోలేదు. మార్చి 6న నిశ్చితార్థం జరిగిన తర్వాత అతడి ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ శుభాకార్యం జరిగిన రెండు వారాల్లో అంటే మార్చి 17న ఈ బ్యూటీఫుల్ లేడీ సింగర్ పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి ఫొటోలు ఎక్కడా బయటకు రాలేదు. వేడుకకు హాజరైన సింగర్ రేవంత్.. తన ఇన్ స్టాలో కొత్త జంట ఫొటో పెట్టి విషెస్ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: రెండేళ్లుగా సహజీవనం.. రెండోపెళ్లికి నటి రెడీ..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement