టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్, ఇండియన్ ఐడల్ 9 విజేత రేవంత్ ఓ ఇంటివాడయ్యాడు. గుంటూరుకు చెందిన అన్వితను పెళ్లాడాడు. ఆదివారం (ఫిబ్రవరి 6న) జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాలు సహా, అత్యంత దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారు. గుంటూరులోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది.
పలువురు సెలబ్రిటీలు సైతం ఈ పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం రేవంత్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా డిసెంబర్ 24న వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ తనకు కాబోయే భార్యను పరిచయం చేస్తూ ఎంగేజ్‌మెంట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన విషయం తెలిసిందే!
Comments
Please login to add a commentAdd a comment