Kausalya
-
‘కౌసల్య–క్వీన్ ఆఫ్ హార్ట్స్’.. ఇతిహాసాల్లో స్త్రీ పాత్రలకు ఉన్నప్రాధాన్యత ఎంత?!
ఇతిహాసాల్లో స్త్రీ పాత్రలకు ఉన్నప్రాధాన్యత ఎంత?! భగవంతునికే పునర్జన్మను ఇచ్చిన స్త్రీ అంటే ఆమె ఎంత గొప్పదై ఉండాలి?! మానవ భావోద్వేగాలైన కోపం, అసూయ, ఆనందం, దుఃఖం, సంతృప్తి.. వ్యక్తిత్వాలలో నలుపు–తెలుపుల వడబోతలో వుండే షేడ్స్ ఎన్ని?! ఇలా ఎన్నో సందేహాలకు సమాధానాలు వెతుకుతూ ‘కౌసల్య’ను మన ముందుకు తెచ్చింది విభా సంగీత కృష్ణకుమార్. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో బయాలజీలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ చేస్తున్న విభా సంగీత ‘కౌసల్య– క్వీన్ ఆఫ్ హార్ట్స్’ పుస్తకాన్ని రచించింది. రామాయణంలో కొడుకు జీవితంలో స్త్రీ పాత్రకు ఉన్న ప్రాధాన్యత గురించి రాసిన ‘కౌసల్య’ పుస్తకం విభాకు మంచి పేరు తెచ్చింది. శాస్త్రీయ సంగీతంలోనూ ప్రావీణ్యురాలైన విభా సంగీతను కలిస్తే ఎన్నో విషయాలు ఇలా మన ముందుంచారు.‘‘నేను పుట్టి పెరిగింది చెన్నై. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో బయాలజీ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్‌లో రెండవ సంవత్సరం చదువుతున్నాను. మా అమ్మానాన్నలు సీత, కృష్ణకుమార్ ఇద్దరూ ఉద్యోగస్తులే. రామాయణాన్ని రకరకాల కథనాల ద్వారా వింటూ పెరిగాను. అవన్నీ చాలా ఆసక్తిగా అనిపించేవి. ఈ క్రమంలోనే రామాయణంలోని స్త్రీల పాత్రల గురించి, వారి మనస్తత్వాల గురించి బాగా ఆలోచించేదాన్ని. అందులో కౌసల్య ప్రస్తావన గురించి వచ్చినప్పుడు చాలా ధర్మబద్ధమైన మహిళలలో ఒకరిగా, క్లుప్తంగా ఆమె పాత్ర ఉంది. భగవంతునికి పునర్జన్మను ఇచ్చిన స్త్రీ అంటే ఆమె ఎంత గొప్పదై ఉండాలి. ఆమెకు ఇవ్వాల్సిన గౌరవం దక్కిందా అనిపించింది. ఆ ఆలోచన నుంచి పుట్టుకువచ్చిందే ‘కౌసల్య’. ఈ పుస్తకాన్ని పూర్తిగా కౌసల్య దృష్టి కోణం నుండే తీసుకున్నాను.మొదటి పుస్తకం..పుస్తకం రాయడం పూర్తయ్యేవరకు ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. ‘రామాయణం స్ఫూర్తితో ఎన్నో పుస్తకాలు, సినిమాలు, సీరియల్స్ వచ్చాయి. వాటికి భిన్నంగా ఏం రాసుంటుంది ఈ అమ్మాయి’ అని అనుకుంటారు. నా పుస్తకంలో నా పాత్రలన్నీ మనుషులే. వారిని అతిగా ΄÷గడలేదు. అలాగని, వారిప్రాధాన్యతలను తగ్గించలేదు. మానవ భావోద్వేగాలు అన్నీ ఉంటాయి. వ్యక్తిత్వాలలో నలుపు–తెలుపు మాత్రమే కాదు వివిధ రకాల షేడ్స్ కూడా ఉంటాయి. ఇంతకు ముందు కొన్ని పుస్తకాలు రాశాను. కానీ, అవి ప్రచురించలేదు. ‘కౌసల్య– క్వీన్ ఆఫ్ హార్ట్స్’ నా మొదటి పుస్తకం. ఆంగ్లభాషా పత్రిక ‘శృతి’ మ్యాగజీన్‌కు కరస్పాండెంట్‌గా ఉన్నాను. ఈ మ్యాగజీన్లో నా వ్యాసాలు, సమీక్షలు ప్రచురించారు. ఆ విధంగా నా గురించి చాలామందికి తెలిసింది.మార్పులు చేసుకుంటూ..ఈ పుస్తకాన్ని రెండేళ్ల క్రితం జూలై 2022లోప్రారంభించాను. అలాగని నిరంతరాయంగా రాయలేదు. దీంతో పాటు అకడమిక్ బాధ్యతలు కూడా ఉన్నాయి. కిందటేడాది 84,000 పదాలతో పూర్తి చేసి అనేక మార్పులు చేశాను. ఈ నవల ప్రస్తుత వెర్షన్లో 65,000 పదాలు ఉంటాయి. జేకె పేపర్స్ ఆథర్స్ అవార్డ్ రావడం, ఢిల్లీకి చెందిన పబ్లిషర్, ఎడిటర్ రీడొమానియ నాకు ఎంతో ్రపోత్సాహాన్ని ఇచ్చారు. నేను చదువుకుంటున్నది సైన్స్‌కు సంబంధించినది. కథలు రాయడాన్ని ఇష్టపడతాను. శాస్త్రీయ సంగీతం నాకున్న మరో అభిరుచి.సామాన్యులకు సైన్స్..‘సమాజ శ్రేయస్సుకు పాటుపడటమే నా ముందున్న లక్ష్యం. రకరకాల వ్యాధుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. నా చదువును కొనసాగిస్తూనే వాటికి సంబంధించిన అధ్యయనం కూడా చేయాలనుకుంటున్నాను. కర్ణాటక సంగీతంలో చూపించిన ప్రతిభకు గానూ వందకు పైగా బహుమతులు అందుకున్నాను. భారత ప్రభుత్వం నుండి సిసిఆర్టి స్కాలర్షిప్ పొందాను. నా రచనకు వచ్చిన మొదటి అవార్డును మాత్రం ఎప్పటికీ మరిచిపోలేను’ అంటుంది విభా సంగీత. – పరియాద రామ్మోహన్, సాక్షి, హైదరాబాద్ఇవి చదవండి: శభాష్ శంకర్! పదిహేనేళ్ల వయస్సులోనే ఏఐ స్టార్టప్‌గా.. -
అందుకే ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు: తెలుగు నటి
సినిమ ఇండస్ట్రీలో హీరోల సంగతేమో గానీ హీరోయిన్లు మాత్రం చాలావరకు లేటుగా పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఇంకొందరైతే స్వీటీ అనుష్కలా పూర్తిగా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతారు. అలా అని హీరోయిన్లకే ఇది వర్తిస్తుందనుకుంటే మీరు పొరబడినట్లే. బ్యూటీఫుల్‌గా ఉండే పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చాలామంది ఇప్పటికే సింగిల్‌గానే ఉంటున్నారు. అలా తెలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఓ నటి.. పెళ్లి చేసుకోకపోవడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తెలుగులో హీరోయిన్గా బెంగళూరులో పుట్టి పెరిగిన కౌసల్య.. 'ఏప్రిల్ 19' అనే మలయాళ సినిమాతో నటిగా మారింది. తెలుగు, తమిళ, మలయళ సినిమాల్లో నటించింది. అల్లుడుగారు వచ్చారు, పంచదార చిలక చిత్రాల్లో హీరోయిన్గా చేసింది. కానీ పెద్దగా కలిసి రాలేదు, దీంతో సహాయ నటిగా మారిపోయింది. గౌరి, రారండోయ్ వేడుక చూద్దాం, హీరో తదితర చిత్రాలతో అలరించింది. (ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. కొత్త విషయం బయటపడింది!) పెళ్లంటే భయపడ్డా 'పెళ్లిపై నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. సరైన వ్యక్తి.. జీవితంలోకి అడుగుపెడితే మ్యారేజ్ అనేది చాలా అందంగా ఉంటుంది. పెళ్లి గురించి నేను ఎన్నో ఆలోచించాను. అది నాకు సెట్ కాదేమో అని మొదట్లో అనుకునేవాడిని. నాకు తగ్గ వ్యక్తి దొరకడేమో అని భయపడ్డాను కూడా. కానీ ఎందుకో రిలేషన్ నాకు సెట్ కాలేదు. దీంతో పేరెంట్స్‌తో ఉండాలని ఫిక్సయ్యాను' పెళ్లికి దూరంగా 'తల్లిదండ్రులతో ఉన్నప్పుడూ పెళ్లి గురించి ఆలోచన వచ్చింది. ఒకవేళ పెళ్లి చేసుకుంటే అత్తమామలతో ఎలా ఉంటానో అని కంగారుపడ్డాను. ఇలా ఆలోచనలు ఎక్కువయ్యేసరికి కొన్నాళ్లు మ్యారేజ్ అనే దానికి దూరంగా ఉన్నాను. అప్పట్లో నేను అనారోగ్యం బారినపడ్డాను. బరువు పెరిగాను. యాక్ట్ చేసిన సినిమాలు సంతృప్తి ఇవ్వలేదు. దీంతో అన్ని విషయాల నుంచి బ్రేక్ తీసుకున్నాను' అని నటి కౌసల్య చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: 'నూడిల్స్' మూవీ: అనుకోకుండా హీరో ఓ మనిషిని చంపేస్తే?) -
వివాహేతర సంబంధం.. ఏకాంతంగా ఉండటం చూశాడని బాలుడి హత్య!
తమిళనాడు: వివాహేతర సంబంధం పెట్టుకున్న అబ్బాయితో ఒంటరిగా ఉండడాన్ని చూసిన ఓ బాలుడిని హత్య చేసి బావిలో పడేసిన ఏడాది తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ సంఘటనలో బాలుడి చిన్నమ్మ కౌసల్యను ఏడాది తర్వాత అరెస్టు చేశారు. విరుదునగర్ జిల్లా వెంబకోట్ పక్కన ఎలాయి రాంపన్నాయ్ సమీపంలోని ఆర్.మడతుప్పట్టికి చెందిన గోపాల్ (45)కార్మికుడు. పరంధామన్ (9) మొదటి భార్య కుమారుడు. మొదటి భార్య చనిపోవడంతో గోపాల్ కౌసల్య(35)ని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ స్థితిలో ఏడాది క్రితం పరంధామన్ అదృశ్యమయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు మడత్తుపట్టిలోని బావిలో పరంధామన్ మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. పరంధామన్ ఆడుకుంటూ బావిలోకి జారిపడి ఉండవచ్చని పోలీసులు భావించారు. అయితే కౌసల్యపై పోలీసులకు అనుమానం వచ్చింది. అలాగే ఏలాయిరం పన్నైకి చెందిన సేతు కామేష్ (35)ని కూడా పోలీసులు విచారించారు. కౌశల్యకు కామేష్‌తో వివాహేతర సంబంధం ఉందని వెలుగులోకి వచ్చింది. సోమవారం కౌసల్యను పోలీసులు పట్టుకుని విచారించారు. ఇందులో బాలుడిని చంపినట్లు నేరం ఒప్పుకుంది. హత్యకు సహకరించిన సేతు కామేష్ కోసం గాలిస్తున్నారు. ఘటన జరిగిన రోజు కౌసల్య, సేతు కామేష్ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. బాలుడు పరంధామన్ ఇది చూశాడు. ఈ విషయం గోపాల్‌కి చెబుతాడేమోనని కౌసల్య భయపడి బాలుడు పరంధామ¯Œన్ను గొంతుకోసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని బావిలో పడేశారు. -
తన కోసం అన్ని భరించా.. కానీ పెళ్లి చేసుకోమంటున్నాడు: కౌసల్య
సింగర్ కౌసల్య తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి దర్శకత్వంలో అత్యధికంగా పాటలు పాడిందామె. 1999 తెలుగు సినిమా నీ కోసం చిత్రంలో తొలిసారిగా ఆలపించారు కౌసల్య. ఆ తర్వాత తెలుగులో దాదాపు 350కి పైగా పాటలను పాడారు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు అయితే కెరీర్ సవ్యంగా సాగుతున్న సమయంలో ఆమె జీవితంలో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. పెళ్లయ్యాక కౌసల్య జీవితం అనేక మలుపులు తిరిగింది. ఆమె వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఎన్నో ఒడిదుడికుల మధ్య ఆమె జీవితం సాగింది. చాలా సార్లు తన భర్త తనను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కౌసల్య జీవితంలో ఎదురైన సమస్యలను ప్రస్తావించారు. బాబు కోసం భరించా కౌసల్య మాట్లాడుతూ..' వైవాహిక జీవితంలో చాలా బాధలు అనుభవించా. ఆ బాధను నాలోనే దాచుకునేదాన్ని. తన బాబు చాలా చిన్న పిల్లవాడు కావడంతో వాడి కోసమే అన్నింటిని దిగమింగా. కానీ అప్పుడప్పుడు నా చెల్లితో చెప్పుకునేదాన్ని. అలాగే అమ్మ దగ్గరా ఏమీ దాచేదాన్ని కాదు. తన భర్త మరో పెళ్లి చేసుకోవాలనుకునే వరకు సర్దుకు పోదామని ఓపికగా ప్రయత్నించా. కానీ కుదరలేదు. చివరికీ ఆయన మరొకరిని పెళ్లి చేసుకుని విడిపోయారు.' అని అన్నారు. ఆ తర్వాత తన కుమారుడి గురించి ప్రస్తావిస్తూ..' ప్రస్తుతం బాబు పెద్దవాడు అయ్యాడు. వాడిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కానీ వాడేమో తనను మళ్లీ పెళ్లి చేసుకోమని అంటున్నాడు. నా జీవితంలో సంతోషం చూడాలన్నదే వాడి కోరిక. మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. అమ్మే పెంచి పెద్ద చేసింది. ఎనిమిదేళ్ల క్రితం ఆమె కూడా చనిపోయారు. ఇప్పుడు నా కొడుకే లోకం .. నా పాటకి మంచి గుర్తింపు వస్తే ముందుగా సంతోషపడేది బాబే.' అని అన్నారు -
కౌసల్యజ
అచ్చుగుద్దినట్లు పోలికలొస్తే..‘నోట్లోంచి ఊడిపడింది’ అంటారు!అలాగైతే.. ఈ అమ్మాయి.. భావనను‘నడకల్లోంచి ఊడిపడింది’ అనాలి.అమ్మ నేర్పిన నడకలు... అమ్మను చూసి నేర్చుకున్న నడకలు!కూచిపూడిలో గొప్ప డాన్సర్... భావన. అంతకన్నా గొప్ప.. కౌసల్య కూతురిగా ‘కౌసల్యజ’ అనే భావన! ‘‘నడక, నాట్యం రెండూ ఒకేసారి నేర్చుకున్నాను’’ అన్నారు భావనారెడ్డి. నాట్యం ఆమెకి తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిందనిపిస్తుంది. కానీ భావన మాత్రం అమ్మానాన్నల జన్యువుల్లోంచే వచ్చిందంటారు. ‘‘ఫలానా వయసులో నాట్యసాధన మొదలు పెట్టాను... అని చెప్పడానికి వీలే లేదు. ఎందుకంటే... నడకతోపాటే నాట్యం కూడా అలవడింది. నడక రాకముందు నుంచే నాట్యాన్ని చూస్తున్నాను. మా ఇంట్లో రోజూ నాట్యసాధన జరుగుతుండేది. ఇంటి వెనుక వైపు విశాల స్థలంలో డాన్స్ క్లాసులు జరుగుతుండేవి’’ అని చెప్పారు. నాలుగున్నర ఏళ్లకు తొలి ప్రదర్శన ఇచ్చిన భావన ఖజురహో, కోణార్క్, కాళిదాస సమరోహ్లలో జరిగే డాన్స్ ఫెస్టివల్స్‌లో కూచిపూడి నాట్య ప్రదర్శనలిచ్చారు. ఢాకాలో జరిగిన బెంగాల్ క్లాసికల్ మ్యూజిక్ ఫెస్టివల్, లండన్‌లోని సాడ్లర్స్ వెల్స్ ఫెస్టివల్స్తోపాటు అమెరికా, కెనడా, యూరప్, యునైటెడ్ ఎమిరేట్స్, ఆసియా ఖండాల్లో విస్తృతంగా పర్యటించి లెక్కకు మించిన ప్రదర్శనలిచ్చారు. ప్రధానమంత్రులు, వేల్స్ యువరాజుతోపాటు అనేకమంది విదేశీ ప్రముఖుల సమక్షంలో మన తెలుగు కళను ప్రదర్శించి మెప్పు పొందారు. ఇవన్నీ మూడు పదుల లోపే. విదేశాల్లో యంగ్ఉమన్ అచీవర్స్ అవార్డు, నార్త్ పవర్‌లిస్ట్ అవార్డు, టెక్సాస్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ నుంచి లైఫ్‌టైమ్ అవార్డులు అందుకున్నారు. అన్నింటికంటే తనకు మనదేశంలో సంగీత నాటక అకాడమీ నుంచి అందుకున్న ప్రతిష్ఠాత్మకమైన ‘బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ 2017’ అత్యంత సంతోషాన్నిచ్చింది అంటారామె. న్యూయార్క్, న్యూ ఢిల్లీలో ప్రదర్శనల తర్వాత కొంత విరామం తీసుకుని అమ్మమ్మను చూడటానికి ఆదిలాబాద్‌కి వెళ్లారామె. ఆదిలాబాద్ నుంచి తిరిగి ఢిల్లీ వెళ్తూ సోమవారం రోజు హైదరాబాద్‌లో అక్క యామిని దగ్గర ఆగారు. ఆ సందర్భంగా సాక్షితో మాట్లాడారు. టీనేజ్‌కి వచ్చాకే స్టేజ్ ఫియర్! భావన ప్రఖ్యాత కూచిపూడి నాట్యకారులు పద్మభూషణ్ రాజారెడ్డి, కౌసల్య (రాధారెడ్డి చెల్లెలు)ల పుత్రిక. నడకలో అడుగులు, నాట్యపు అడుగుల మధ్య తేడా తెలియని వయసులోనే వేదికనెక్కడంతో స్టేజ్ ఫియర్ అనేది తెలియనే లేదామెకి. ఇంట్లో జరిగే డాన్సు క్లాసుకి, వేదిక మీద ప్రదర్శనకి మధ్య తేడా తెలియని వయసది. అయితే బాల్యంలో లేని స్టేజి ఫియర్ టీనేజ్‌లోకి వచ్చిన తర్వాత ఆవరించింది. నలుగురి ముందు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఏదో తెలియని సిగ్గు కలవరపెట్టేది. దానిని అధిగమించి ప్రదర్శన ఇవ్వడానికి తనకు తానే ధైర్యం చెప్పుకునేదాన్నంటారామె. స్టేజ్ మీదకు వెళ్లిన తర్వాత ప్రేక్షకులు చూస్తున్నారనే భావనను అదిమిపెట్టి తాను ప్రదర్శిస్తున్న పాత్ర మీదనే మనసు లగ్నం చేసేదాన్నని, క్రమంగా వయసు పరిణతితో అధిగమించగలిగానని చెప్పారు. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో బి.కామ్. ఆనర్స్ చదివిన భావన.. నాట్య ప్రదర్శనల కోసం తరచూ విదేశాలకు వెళ్లొస్తుంటారు. ఒకే ఒక ఉత్తరం ‘‘ఏడేళ్ల వయసులో అమ్మతోపాటు పెర్ఫార్మ్ చేశాను. అమ్మ కౌసల్య... రాముడి తల్లి కౌసల్య పాత్ర చేస్తోంది, నేను రాముడి పాత్ర చేశాను. వేదిక మీద తల్లి పాత్రలో సొంత తల్లితో నాట్యం చేయడం మరచిపోలేని అనుభూతి. ఆ ప్రదర్శన పూనాలో జరిగింది. ఆ ప్రదర్శనలో నా నాట్యాన్ని ప్రశంసిస్తూ ఢిల్లీలో మా ఇంటికి నా పేరుతో ఉత్తరం వచ్చింది. నాకు వచ్చిన ఒకే ఒక్క ఫాన్మెయిల్ అది. అమ్మ పాత్రలో అమ్మతో కలిసి చేయడం ఒక సంతోషమైతే, అదే పెర్ఫార్మెన్స్కి నా పేరుతో ఉత్తరం రావడం తీపి జ్ఞాపకం. ఇంకా బాగా చేయాల్సింది కృష్ణుడి పాత్రలో నటించడం చాలా ఇష్టం. అప్పుడే టీనేజ్‌లో కొచ్చాను. వారణాసిలో కాళీయమర్దన రూపకాన్ని ప్రదర్శించాను. యశోద పాత్రను అమ్మ ప్రదర్శించింది. ప్రేక్షకుల నుంచి ప్రశంసలే వచ్చాయి, నిపుణుల నుంచి కూడా ఎటువంటి విమర్శలూ రాలేదు, కానీ నాకే ఎందుకో ‘ఇంకా బాగా చేయాల్సింది’ అని పదే పదే అనిపించింది. కృష్ణుడిగా ఇంకా బాగా చేయడానికి అవకాశం ఉండింది. పూర్తిగా న్యాయం చేయలేకపోయానేమోనని ఏడ్చాను. నాకు కృష్ణుడి మీదున్న ఇష్టం వల్లే అలా అనిపించిందో ఏమో కానీ ఆ ప్రదర్శన ఇప్పటికీ గుర్తు ఉంది. బాగా గుర్తుండిపోయిన ప్రదర్శన ఏదని ఎవరడిగినా సరే, నాకు అసంతృప్తిని మిగిల్చిన ఆ ప్రదర్శనే మనసులో మెదలుతుంది. అమ్మానాన్నలేమో ‘నీకు బాగా చేయలేదనిపిస్తే... బాగా చేస్తున్నాను అనే తృప్తి కలిగే వరకు ప్రాక్టీస్ చేయడమే పరిష్కారం. మన పెర్ఫార్మెన్స్ మీద మనకు సంతృప్తి కలిగితేనే ప్రేక్షకులను సమాధానపరచగలుగుతాం. అదే గీటురాయి’ అన్నారు. విరామమన్నదే లేదు రోజూ ఒక గంట యోగా, రెండు గంటలు డ్యాన్స్, ఓ గంట కీళ్ల పటుత్వాన్ని పెంచే ఎక్సర్సైజ్ చేస్తాను. ఆహార నియమాలు పెద్దగా పాటించను. నేను మంచి భోజన ప్రియురాలిని. డ్యాన్స్ చేస్తాను కాబట్టి కేలరీలు ఎప్పటికప్పుడు బర్న్ అయిపోతుంటాయి. ఇన్నేళ్లలో డ్యాన్స్‌కి ఒక్క వారం కూడా విరామం రాలేదు. మూడు రోజులు దాటితే కాళ్లుచేతులు లాగినట్లవుతాయి’’ అంటూ తన చేతి వేళ్లతో నాట్య ముద్రలను చూపిస్తూ నవ్వారు భావన. పాడటం... ఆడటం హాబీ కూచిపూడి నాట్యం నా జీవితంలో భాగమైపోయిందనడం తప్పు, అదే నాకు జీవితం. పాటలు పాడటం, బ్యాడ్మింటన్ ఆడటం ఇష్టం. సినిమాలు బాగా చూస్తాను. ఇంగ్లిష్ పాటలు, కర్ణాటక సంగీతంలో పాడాను.హాలీవుడ్ సినిమాల్లో పాడటం, ఇంగ్లిష్ పాటలకు కూచిపూడి నాట్యంలో కొరియోగ్రఫీ చేయడం హాబీగానే చేశాను. ప్రొఫెషన్‌గా తీసుకోవడం లేదు. కూచిపూడి నాట్యానికి ఇప్పటి తరం కనెక్ట్ అయ్యేటట్లు భామాకలాపం రూపకాన్ని చేశాను. ఇలాంటి ప్రయోగాలు ఇంకా చేయాలని ఉంది. అందుకు నేను ఇంకా నేర్చుకోవాలి. ఇప్పటి వరకు నాన్న, అమ్మల దగ్గర నేర్చుకున్న జ్ఞానమే. ఇంకా శాస్త్రీయంగా నేర్చుకోవడానికి కూచిపూడి గ్రామంలోని కూచిపూడి యూనివర్సిటీలో డ్యాన్స్ కోర్సు చేయాలనుకుంటున్నాను. – భావనారెడ్డి, కూచిపూడి కళాకారిణి – వాకా మంజులారెడ్డి -
ఆ రోజు నేను చనిపోయేదాన్ని...!
కాపాడవలసిన చేతులు... ప్రేమించాల్సిన చేతులు ఊతం కావలసిన చేతులు...భరోసా ఇవ్వాల్సిన చేతులు మాటిమాటికీ లేస్తుంటే... బుసలు కొడుతుంటే.. కాటేస్తుంటే... అలాంటి చేతులకు సంకెళ్లు వేయాల్సిందే ఇనుప గాజులు తొడగాల్సిందే. సాక్షి తలపెట్టిన మహోద్యమం, మహిళోద్యమం అయిన ‘నేను శక్తి’ లో భాగంగా గతవారం అంతా ‘లైంగిక వివక్ష’పై కేస్ స్టడీలు ఇచ్చిన ‘ఫ్యామిలీ’.. ఈరోజు నుంచి ‘గృహహింస’పై ప్రత్యేక కథనాలను అందిస్తోంది. పెళ్లంటే అందరి అమ్మాయిల్లాగే నేనూ ఎన్నో కలలు కన్నాను. ఒక కొత్త జీవితాన్ని ఊహించి ఆ ఇంట్లో అడుగుపెట్టాను. అన్ని విధాలా నన్ను చూసుకునే, ప్రేమించే వ్యక్తి ఉన్నాడనే భరోసాతో వెళ్లాను. కానీ పెళ్లయిన పదహారో రోజే అత్తారింట్లో అందరిముందు కొట్టాడు. పెళ్లిలో మా అమ్మ మర్యాదలు సరిగా చేయలేదని. నేను టెన్త్‌క్లాస్‌లో ఉన్నప్పుడే నాన్న చనిపోయారు హఠాత్తుగా. ఏజీ ఆఫీస్‌లో పనిచేసేవారు. మేం ముగ్గురం పిల్లలం. నాకు ఒక చెల్లి, తమ్ముడు. అమ్మే కష్టపడి పెంచింది మమ్మల్ని. ‘‘మా అమ్మను ఒక్క మాట కూడా అనొద్దు’’ అని నేను అన్నందుకు నన్ను కొట్టాడు. దవడ ఇప్పటికీ నొప్పిగానే ఉంటుంది. ఆరోజే అనుకున్నాను ఇంక ఇది వద్దు అని. అయితే విడాకులు తీసుకొని ఇంటికెళితే అమ్మకు ఎంత కష్టం? పెళ్లి కావల్సిన చెల్లి ఉంది. సొసైటీ ఏమనుకుంటుంది? అనే ఆలోచన వెనక్కిలాగింది. అయినా ‘‘నాకు వద్దు. నేను వెళ్లిపోతా’’అని చెప్పా. అప్పుడు మా మామగారు.. ‘‘అమ్మాయి చెప్పింది కరెక్టే. సరిగ్గా చూసుకోగలిగితే చూసుకో. లేదంటే నేనే దగ్గరుండి డివోర్స్ ఇప్పిస్తాను’’ అని అన్నారు. ఆ మాటకు ‘‘లేదు, ఇంకోసారి ఈ మిస్టేక్ జరగదు. ఇది నాకు కావాలి’’ అని తను అన్నాడు. క్షమించాను. కాని అది క్లోజ్ కాలేదు. అతను చెయ్యి ఎత్తుతూనే వచ్చాడు. ఒకసారి మా అత్తగారితో కూడా షేర్ చేసుకున్నా. ‘‘మన ఇళ్లల్లో కొత్తేం కాదు ఇది.. నువ్వే కొంచెం చూసీ చూడనట్టు పో’’ అని చెప్పారు ఆమె. చూసీచూడనట్టూ వెళ్లా. తర్వాత నాకు తెలిసిందేంటంటే.. అతను ఇంకో అమ్మాయితో ఉన్నాడు.. వాళ్లకు సంతానం కూడా ఉందని. టామ్‌బాయ్‌లా.. మా నాన్నే కొట్టలేదెప్పుడూ నన్ను. సింగింగ్‌తో చదువులో బీగ్రేడ్ వచ్చిన రోజూ పల్లెత్తు మాటనలేదు. ‘‘బాధపడకురా.. నీకు చాలా స్ట్రెన్త్ ఉంది’’ అంటూ ఎంకరేజ్ చేయడం తప్ప. పైగా నన్ను ఓ టామ్‌బాయ్‌లా పెంచారు. సైకిల్ తొక్కేదాన్ని. స్పోర్ట్స్ బాగా ఆడేదాన్ని. సింపుల్‌గా, స్ట్రాంగ్‌గా ఉండడం ఆయనకు ఇష్టం. అలాగే పెంచాడు. నిజానికి మా మామగారు, మా నాన్న ఇద్దరూ కొలీగ్స్. చిన్నప్పటి నుంచీ చూసినవాళ్లే. పాడడం నచ్చే నన్ను చేసుకున్నాడు అతను (భర్త). ఫస్ట్‌లో చాలా ఎంకరేజ్ చేశాడు కూడా. అలాంటిది ఒక్కసారిగా ‘‘నీ ఫొటోలు చూడు ఎట్లా ఉన్నాయో? నీ బిహేవియర్ చూడు ఎట్లా ఉందో? నీకు ఎవడో ఉన్నడంట కదా..’’ అంటూ మొదలుపెట్టాడు. సామరస్యంగా మాట్లాడదామని ట్రై చేసినా సాగనిచ్చేవాడు కాదు. కొట్టడమే. ఆయన ఇంటికొస్తున్నాడంటనే దడ వచ్చేది. ‘‘ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావ్?’’ అని అడిగితే నా మీద రాంగ్ ఎలిగేషన్స్ వేయడం స్టార్ట్ చేశాడు. ఎక్కడికి వెళ్లినా ఆయనను తీసుకునే వెళ్లేదాన్ని. అయినా అలా మాట్లాడేవాడు. ఉన్నట్టుండి అప్రోచ్ అయి కొట్టేవాడు. పోలీసుల దగ్గరకు వెళ్లా.. ‘‘ఏం జరిగిందో నాతో చెప్పట్లేదు. ఆయనను ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. మా ఇద్దరినీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వండి’’ అని. చంపేస్తామని బెదిరించారు సూపర్ సింగర్ 7 నాకు పెద్ద చాలెంజ్. అప్పుడే అమ్మకు క్యాన్సర్, ఆయన గొడవలు స్టార్ట్ చేయడం అన్నీ ఒకేసారి. చాలా కుంగిపోయా. ఎందుకంటే ఆమే నాకు సపోర్ట్. బాధ తొలిచేసేది. ఒకసారి మా బావగారు అంటే ఆయన పెద్దనాన్న కొడుకు వాళ్లు వచ్చారు ఇంటికి మా సమస్యను సాటవుట్ చేద్దామని. వాళ్లందరి ముందూ కొట్టాడు రక్తంకారేలా. వాళ్లు ఆయన్ని ఆపకపోతే నేను చచ్చిపోయేదాన్ని ఆ రోజు. మా బాబుకి అప్పుడు ఆరేళ్లు. ‘అమ్మను కొట్టొద్దు నాన్నా. ప్లీజ్ కొట్టొద్దు నాన్నా’ అంటూ వాళ్ల నాన్న కాళ్లు పట్టుకున్నాడు. నా దగ్గరకు వచ్చి ‘అమ్మా కొట్టుకోకండి అమ్మా... కలిసి ఉండండి అమ్మా..’ అని వాడు ఏడుస్తుంటే నా కడుపు తరుక్కుపోయింది. నా తలంతా గాయాలే. మా బావగారు వాళ్లే ఐస్‌క్యూబ్స్ ఇచ్చి ‘‘వెళ్లి అమ్మాయికి పెట్టరా’’ అన్నారు. ఆయన తలకు ఐస్‌క్యూబ్స్ అద్దుతుంటే ‘‘ఎందుకిలా చేస్తున్నావ్? నిన్నేం ఇబ్బంది పెట్టను. చెప్పుకోవడానికి నాకెవరూ లేరు’’ అని బతిమాలాను. అయితే తెల్లవారి ఈ మాటలనే పట్టుకుని హేళన చేస్తుంటే అనుకున్నాను ఇంక చాలు అని. మాట్లాడ్డానికి కూడా ట్రై చేయక మళ్లీ పోలీసుల దగ్గరకు వెళ్లా. ‘‘కేసులేమీ లేకుండా ఒకసారి ఆయనను పిలిచి మాట్లాడండి’’ అని రిక్వెస్ట్ చేశా. కంప్లయింట్లు ఇచ్చి, పదిమందికీ తెలిసి అల్లరి కాకుండా లోపలే పరిస్థితి చక్కదిద్దుకుందామనే నా ప్రయత్నం అప్పటికీ. అందుకే ఆయన మీద డొమెస్టిక్ వయలెన్స్ కేసు వేయాలనే ఆలోచన కూడా రాలేదు. కాని ఇప్పుడనిపిస్తోంది. అప్పుడే ఆ పని చేసుండాల్సింది అని. ఆయనతో ఉన్న ఆమె పేరు బయటపెడితే చంపేస్తామని బెదిరించారు ఇద్దరూ. భయపడి అప్పుడు కేస్ ఫైల్ చేశాను. ఒక్కో రీజన్‌తో.. భరించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. భరించడం కూడా ఒక శాపం. ఒక్కసారి చెయ్యి ఎత్తిన మగవాడు మళ్లీ మళ్లీ ఎత్తుతూనే ఉంటాడు. ఇది నా అనుభవంతో చెప్తున్న సత్యం. వెన్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్.. దాని వెనక కారణం ఏంటో గ్రహించాలి. మరీ పాజిటివ్ ఆటిట్యూడ్ కూడా మంచిది కాదు. నెమ్మదిగా ఆయనే మారతాడని, చెల్లెలి పెళ్లికావాలని, అమ్మకు మాట రాకూడదని, సమాజం ఏమనుకుంటుందోనని.. తర్వాత బాబు ఉన్నాడని ఒక్కో రీజన్‌తో కామ్‌గా ఉన్నా. తర్వాత నా వల్ల కాలేదు. మన దేశంలో స్త్రీత్వం అంటే డిపెండెన్సీ.. అదే అందం అంటూ ఆడపిల్లలను పెంచుతారు. కాని మనకు కావల్సింది ఆత్మవిశ్వాసం, ధైర్యం! నా చేయి పట్టుకొని నా కొడుకు.. ఎదురుగా జీవితమనే సముద్రం.. ఒంటరిగా ఆ సముద్రాన్ని ఈదాలనే వాస్తవం భయపెట్టినప్పుడు, రేపేంటి? అన్న ప్రశ్న కలవరం పుట్టిస్తే నావలా కనిపించేది ఆత్మస్థైర్యమే. సెల్ఫ్ పిటీలోకి పడిపోయి ఎమోషనల్ అయిపోతే ముందుకు వెళ్లలేం. ఆర్థిక ఇబ్బందులున్నాయి. కలిసి ఉన్నప్పుడు భర్త, నేను వేరువేరు అనుకోం కదా. నా అకౌంట్స్, ఐటీ రిటర్న్స్అన్నీ ఆయనే చూసుకునేవారు. అలా ఆస్తీ ఆయనే చూసుకున్నారు. అయినా నాకు న్యాయం జరుగుతుందన్న ఆశ ఉంది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. కొట్టినా, తిట్టినా పడ్డాను. సెలబ్రెటీగా నేనెప్పుడూ బతకలేదు. ఇంట్లో అన్ని పనులు చేసే రికార్డింగ్‌కి వెళ్లేదాన్ని. ఆయన స్నేహితులొస్తే వండిపెట్టేదాన్ని. అత్తింట్లో అందరికీ మర్యాద ఇచ్చాను. నా కొడుకు వ్యాక్సినేషన్ దగ్గర్నుంచి స్కూల్లో చేర్పించేదాకా అన్నీ నేనే చూసుకున్నా ఇండిపెండెంట్‌గా. ఎక్కడా ఏ లోపం చేయలేదే? ఎందుకు నన్ను ఇంత మోసం చేయడం? ఇప్పుడు నా జీవితం నేను జీవిస్తున్నా. నేను ఇంత బలంగా.. సంతోషంగా.. నవ్వుతున్నానంటే కారణం నా కొడుకే. వాడు క్రికెట్ బాగా అడతాడు. పొద్దున్నే అయిదు గంటలకు కోచింగ్‌కు తీసుకెళ్తా. నేను నా కొడుకు మీద పెడుతున్న శ్రధ్ధను చూసి వాళ్ల నాన్నే జెలసీ ఫీలయ్యి ‘‘నువ్వు నీ కొడుకును పెంచినట్టు మా అమ్మ నన్ను పెంచి ఉంటే నేనిట్లా తయారయ్యేవాడిని కాను’’ అని అంటుండేవాడు. నాకున్న గొడవల్లో నాకు వచ్చిందాన్ని మరిచిపోకుండా ఉండడానికే సంగీత అకాడమీ. అదే నా ఆత్మసంతృప్తి. పాడడంలోనే నాకు మనశ్శాంతి. మన హక్కు మనమే.. ఎవరో వస్తారు.. ఏదో సాయం చేస్తారు అనుకుంటూ ఎదురుచూసే రోజులు పోయాయి. నీకు నువ్వే అన్నీ. మన హక్కును మనమే కాపాడుకోవాలి. మన చాయిస్‌ను మనం పర్స్యూ చేసుకోవాలి. ఇబ్బందిని ధైర్యంగా చెప్పాలి. ఇలాంటి క్యాంపెయిన్స్ వల్ల సమాజం ఎడ్యుకేట్ అవుతుంది. -సరస్వతి రమా డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ మనదేశంలో గృహహింస చట్టం 2006 నుంచి అమల్లోకి వచ్చింది. ఒక్కొక్క ఉపశమనానికి ఒక్కో కోర్ట్ని ఆశ్రయించకుండా అన్ని ఉపశమనాలకు ఒకే చట్టం అనేది ఇందులోని ముఖ్యమైన విషయం. స్త్రీలపై జరిగే మానసిక, శారీరక, ఆర్థిక, లైంగిక వేధింపుల నుంచి ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. అన్ని హింసల స్వరూప స్వభావాలను చర్చించి, విశదీకరించిందీ చట్టం. సహజీవనాన్నీ గుర్తించింది. ఇదొక శుభపరిణామం.. మహిళలకు ఆశాకిరణం! ది బెస్ట్: మహిళలు పోరాడి సాధించుకున్న ఈ చట్టం చాలా గొప్పది. ప్రభుత్వం కాస్త దృష్టి పెడితే దిబెస్ట్ అవుతుంది. మధ్యంతర ఉత్తర్వులు ఆర్థికపరంగా, నివాసపరంగా, కస్టడీ పరంగా, రక్షణపరంగా వెనువెంటనే వస్తున్నాయి. కేస్ల పరిష్కారమే ఆలస్యమవుతోంది. ఉత్తర్వుల సత్వర అమలుకు చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. డీవీ (డొమెస్టిక్ వయలెన్స్) చట్టం వచ్చాక 498ఏ కేసుల సంఖ్య కొంత శాతం తగ్గింది. సపరేట్ కోర్టులు కావాలి: డీవీ కేసులను విచారించడానికి సపరేట్ కోర్ట్‌లను ఏర్పాటు చేయాలి. క్రిమినల్ కేసులలో ఎఫ్ఐఆర్ లాంటిదే డీవీ కేసులలో డీఐఆర్. చట్టప్రకారమైతే కొన్ని గుర్తింపు ఉన్న ఎన్జీఓలు గృహహింస జరిగిన చోటుకు వెళ్లి, విచారించి ఒక సమగ్ర నివేదిక ఇవ్వాలి. దాని ఆధారంగానే అధికారులు తదుపరి చర్యలు తీసుకొని కోర్ట్‌కు పంపాలి. కాని ఇది సవ్యంగా జరగడంలేదు. యాంత్రికంగా డీఐఆర్లు వేస్తున్నారు. అసలు కొన్ని చోట్ల అయితే విచారణలే లేవు. ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు పరిచే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. డీవీ చట్టం కింద జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తే నేరం. కాని నేరాన్ని నిరూపించాలన్నా, ఆ ఉత్తర్వులను అమలుపర్చుకోవాలన్నా పోలీసుల సహాయం తప్పనిసరి. కాబట్టి ప్రతి స్టేషన్లో కొందరు పోలీసులకు ఈ బాధ్యతను అప్పగించాలి. రెండవ స్థానంలో .. ♦ డొమెస్టిక్ వయలెన్స్ కేసుల విషయంలో దేశంలోనే రెండవస్థానంలో ఉంది హైదరాబాద్. ♦మహిళలకు సంబంధించి హైదరాబాద్‌లో దాఖలయ్యే కేసుల్లో 25 డీవీ కేసులే. ♦ చట్టం వచ్చిన ఈ పదేళ్లలో మన దేశంలో పదిలక్షల కేసులు నమోదయ్యాయి. ♦ ప్రతిరోజు ఒక్కో కోర్టులో కనీసం అయిదు డీవీ కేస్లు బుక్ అవుతున్నాయి. సర్వే: తమపై జరిగే హింస గృహహింస అని చాలామంది మహిళలు ఇంకా గుర్తించనేలేదు. వారికి తెలియదు కూడా. 80 శాతం మగవారు ఏదో ఒక సందర్భంలో భార్యలను కొడుతున్నామని అంగీకరించారు. అప్పుడప్పుడు అది తప్పు కాదని కొందరు అభిప్రాయపడ్డారు కూడా. - ఇ. పార్వతి, అడ్వకేట్, ఫ్యామిలీకౌన్సిలర్ గట్టిగా ఎదురించాలి.. ఎక్కువ కుటుంబాల్లో భర్తలు తాగివచ్చి భార్యలపై దాడులకు పాల్పడుతున్నారు. శారీరకంగా వేధిస్తున్నారు. చాలా మంది మహిళలు పిల్లల కోసం ఈ హింసను భరిస్తున్నారు. తమపై జరిగే దాడులను మహిళలు ప్రతిఘటించాలి. నలుగురికీ చెప్పాలి. గట్టిగా ఎదురించాలి. అవసరమైతే బంధువుల సహాయం తీసుకోవాలి. అలా చేస్తేనే మగవారిలో భయం వస్తుంది. విదేశాల్లో కూడా గృహహింస ఉంటుంది. ఫిర్యాదు చేస్తే మాత్రం చర్యలు కఠినంగా ఉంటాయి. – పద్మ పాల్వాయి, సైకాలజిస్ట్ జీవితంలో ఎన్ని అపజయాలనైనా ఎదుర్కోవచ్చు.. కాని నీకు నువ్వు ఓటమికి లొంగిపోకు! – మాయా ఎంజెలో -
శంకర్ భార్య కౌసల్య ఆత్మహత్యాయత్నం!
చెన్నై: పరువు హత్య వ్యవహారంలో హత్యకు గురైన దళితుడు శంకర్ భార్య ఎస్ కౌసల్య (20) తాజాగా ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఆమె గురువారం రసాయన పౌండర్‌ను తిని ప్రాణాలు తీసుకోవడానికి యత్నించింది. తమిళనాడులో సంచలనం సృష్టించిన పరువు హత్య వ్యవహారంలో దళిత యువకుడైన శంకర్‌ను కౌసల్య కుటుంబసభ్యులు పట్టపగలే నరికిచంపిన సంగతి తెలిసిందే. కౌసల్యను చికిత్స నిమిత్తం కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రాణగండం తప్పిందని సమాచారం. ఒకే కాలేజీ విద్యార్థులైన శంకర్, కౌసల్య ప్రేమలో పడి 2015లో పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లిను ఇరువైపులా కుటుంబాలు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకొని కౌసల్య శంకర్ ఇంటికి వచ్చేసింది. అగ్రకులానికి చెందిన ఆమె కుటుంబసభ్యులు పలుమార్లు ఈ దంపతులను హెచ్చరించారు. కొన్నిసార్లు దాడులు చేశారు. ఈ నేపథ్యంలో రెండు నెలల కిందట తిరుపూర్ జిల్లా ఉడుమల్ పేట బస్టాంట్ వద్ద పట్టపగలే అతికిరాతకంగా శంకర్‌ను కౌసల్య కుటుంబసభ్యులు నరికి చంపారు. కౌసల్యపైనా వారు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రగాయాలతో బయటపడిన ఆమె కోలుకొన్న తర్వాత కొమరలింగంలోని శంకర్ ఇంట్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపుతోంది. 'మూడేళ్ల కిందట నా భార్య అనారోగ్యంతో చనిపోయింది. ఆ తర్వాత నా కొడుకును పొట్టనబెట్టుకున్నారు. ఇప్పుడు నా కోడలు కూడా ఆత్మహత్యకు యత్నించడం నా కుటుంబం అనుభవిస్తున్న మానసిక క్షోభను మరింత పెంచుతోంది' అని కౌసల్య మామ వేలుస్వామి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.