Tamil Nadu: Second Wife Murders First Wife Son Over Extra-Marital Affair - Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం.. ఏకాంతంగా ఉండటం చూశాడని బాలుడి హత్య!

Published Wed, Jul 19 2023 9:54 AM | Last Updated on Thu, Jul 20 2023 7:59 PM

second wife murders son - Sakshi

తమిళనాడు: వివాహేతర సంబంధం పెట్టుకున్న అబ్బాయితో ఒంటరిగా ఉండడాన్ని చూసిన ఓ బాలుడిని హత్య చేసి బావిలో పడేసిన ఏడాది తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ సంఘటనలో బాలుడి చిన్నమ్మ కౌసల్యను ఏడాది తర్వాత అరెస్టు చేశారు. విరుదునగర్‌ జిల్లా వెంబకోట్‌ పక్కన ఎలాయి రాంపన్నాయ్‌ సమీపంలోని ఆర్‌.మడతుప్పట్టికి చెందిన గోపాల్‌ (45)కార్మికుడు.

 పరంధామన్‌ (9)  మొదటి భార్య కుమారుడు. మొదటి భార్య చనిపోవడంతో గోపాల్‌ కౌసల్య(35)ని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ స్థితిలో ఏడాది క్రితం పరంధామన్‌ అదృశ్యమయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు మడత్తుపట్టిలోని బావిలో పరంధామన్‌ మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. పరంధామన్‌ ఆడుకుంటూ బావిలోకి జారిపడి ఉండవచ్చని పోలీసులు భావించారు. అయితే కౌసల్యపై పోలీసులకు అనుమానం వచ్చింది.

 అలాగే ఏలాయిరం పన్నైకి చెందిన సేతు కామేష్‌ (35)ని కూడా పోలీసులు విచారించారు. కౌశల్యకు కామేష్‌తో వివాహేతర సంబంధం ఉందని వెలుగులోకి వచ్చింది. సోమవారం కౌసల్యను పోలీసులు పట్టుకుని విచారించారు. ఇందులో బాలుడిని చంపినట్లు నేరం ఒప్పుకుంది. హత్యకు సహకరించిన సేతు కామేష్‌ కోసం గాలిస్తున్నారు. ఘటన జరిగిన రోజు కౌసల్య, సేతు కామేష్‌ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. బాలుడు పరంధామన్‌ ఇది చూశాడు. ఈ విషయం గోపాల్‌కి చెబుతాడేమోనని కౌసల్య భయపడి బాలుడు పరంధామ¯Œన్‌ను గొంతుకోసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని బావిలో పడేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement