అందుకే ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు: తెలుగు నటి | Actress Kausalya Comments Her Marriage Latest Interview | Sakshi
Sakshi News home page

Actress Kausalya: 43 ఏళ్లొచ్చిన ఇప్పటికీ సింగిల్‌గానే.. కారణమదే!

Published Wed, Sep 6 2023 6:13 PM | Last Updated on Wed, Sep 6 2023 6:34 PM

Actress Kausalya Comments Her Marriage Latest Interview - Sakshi

సినిమ ఇండస్ట్రీలో హీరోల సంగతేమో గానీ హీరోయిన్లు మాత్రం చాలావరకు లేటుగా పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఇంకొందరైతే స్వీటీ అనుష్కలా పూర్తిగా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతారు. అలా అని హీరోయిన్లకే ఇది వర్తిస్తుందనుకుంటే మీరు పొరబడినట్లే. బ్యూటీఫుల్‌గా ఉండే పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చాలామంది ఇప్పటికే సింగిల్‌గానే ఉంటున్నారు. అలా తెలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఓ నటి.. పెళ్లి చేసుకోకపోవడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

తెలుగులో హీరోయిన్‌గా
బెంగళూరులో పుట్టి పెరిగిన కౌసల్య.. 'ఏప్రిల్ 19' అనే మలయాళ సినిమాతో నటిగా మారింది. తెలుగు, తమిళ, మలయళ సినిమాల్లో నటించింది. అల్లుడుగారు వచ్చారు, పంచదార చిలక చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. కానీ పెద్దగా కలిసి రాలేదు, దీంతో సహాయ నటిగా మారిపోయింది. గౌరి, రారండోయ్ వేడుక చూద్దాం, హీరో తదితర  చిత్రాలతో అలరించింది. 

(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. కొత్త విషయం బయటపడింది!)

పెళ్లంటే భయపడ్డా
'పెళ్లిపై నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. సరైన వ్యక్తి.. జీవితంలోకి అడుగుపెడితే మ్యారేజ్ అనేది చాలా అందంగా ఉంటుంది. పెళ్లి గురించి నేను ఎన్నో ఆలోచించాను. అది నాకు సెట్ కాదేమో అని మొదట్లో అనుకునేవాడిని. నాకు తగ్గ వ్యక్తి దొరకడేమో అని భయపడ్డాను కూడా. కానీ ఎందుకో రిలేషన్ నాకు సెట్ కాలేదు. దీంతో పేరెంట్స్‌తో ఉండాలని ఫిక్సయ్యాను'

పెళ్లికి దూరంగా
'తల్లిదండ్రులతో ఉన్నప్పుడూ పెళ్లి గురించి ఆలోచన వచ్చింది. ఒకవేళ పెళ్లి చేసుకుంటే అత్తమామలతో ఎలా ఉంటానో అని కంగారుపడ్డాను. ఇలా ఆలోచనలు ఎక్కువయ్యేసరికి కొన్నాళ్లు మ్యారేజ్ అనే దానికి దూరంగా ఉన్నాను. అప్పట్లో నేను అనారోగ్యం బారినపడ్డాను. బరువు పెరిగాను. యాక్ట్ చేసిన సినిమాలు సంతృప్తి ఇవ్వలేదు. దీంతో అన్ని విషయాల నుంచి బ్రేక్ తీసుకున్నాను' అని నటి కౌసల్య చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: 'నూడిల్స్' మూవీ: అనుకోకుండా హీరో ఓ మనిషిని చంపేస్తే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement