
హీరోయిన్‌గా రానిస్తున్న సమయంలోనే ఆమె గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని 2020లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి నీల్ అనే కొడుకు కూడా ఉన్నాడు. అయితే బిడ్డకు జన్మనిచ్చిన రెండు నెలలకే కాజల్ అగర్వాల్ నటించడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈమె ఇండియన్–2 చిత్రంలో కమలహాసన్ సరసన నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అదే విధంగా తెలుగులో బాలకృష్ణకు జంటగా భగవంత్ కేసరి చిత్రంలో నటిస్తున్నారు.
(ఇదీ చదవండి: Niharika-Chaitanya Divorce: నిహారిక కోసం పిటిషన్ వేసిన అడ్వకేట్ ఎవరంటూ..)
కాగా ఇటీవల ఓ భేటీలో పేర్కొంటూ తనకు శివభక్తి అధికమని చెప్పారు. ఎక్కువగా శివుడినే కొలుస్తానన్నారు. అందుకే తన బిడ్డకు శివుని పేరు పెట్టాలని ముందుగానే నిర్ణయించుకున్నానన్నారు. బిడ్డ పుట్టిన తరువాత తన భర్త పిలవడానికి అనువుగా, రాయడానికి సులభంగా ఉండేలా పేరు పెడుతామని చెప్పారన్నారు. దీంతో నీలకంఠుడైన శివుని పేరు లోని రెండు అక్షరాలను తీసుకుని నీల్ అనే పేరును తమ బిడ్డకు నామకరణం చేసినట్లు చెప్పారు.
(ఇదీ చదవండి: మెగా ఫ్యామిలీకి దూరంగా అన్నా లెజినోవా?)
ఇంతకుముందు చంటి పిల్లల తల్లులను చూసినప్పుడల్లా అద్భుతమైన అనుభూతి కలిగేదన్నారు. తాను తల్లినైనా తరువాత నీల్‌ను పెంచుతున్నప్పుడు అలాంటి అనుభూతినే అనుభవిస్తున్నట్లు పేర్కొన్నారు. కొంచెం సమయం తన బిడ్డను వదిలి షూటింగ్‌లకు, జిమ్‌లకు వెళ్లటం చాలా కష్టంగా ఉందన్నారు. అయితే తిరిగి రాగానే బిడ్డ చిరునవ్వులు చూస్తే అంతా పోతుందని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment